ద్వారా: రాహుల్ అధికారి
ఏప్రిల్ 4 2024
పురస్కారం ప్రధానం చేసే వేడుక వీడియోలో నరసింహ రావు గారి అబ్బాయి పురస్కారం తీసుకోడానికి స్టేజి ఎక్కుతున్నప్పుడు, ఖర్గే చప్పట్లుకొట్టడం మనం చూడవచ్చు.
క్లెయిమ్ ఏమిటి ?
మాజీ ప్రధాని పి వి నరసింహ రావుకు, అయన మరణాంతరం భారత ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద గౌరవమయిన భారత రత్న ఇచ్చి మార్చ్ 30న పురస్కరించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఆయన కుమారుడు పి వి ప్రభాకర్ రావు అందుకున్నారు.
ఈ వేడుక అనంతరం ప్రభాకర్ రావు పురస్కారం తీసుకుంటుండగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదు అని సామాజిక మాధ్యమాలలో ఒక పోస్ట్ వైరల్ అయింది.
ఆ ఫొటోలో ముర్ము ప్రభాకర్ రావు కు అవార్డు అందజేస్తుండగా ఒక్క ఖర్గే తప్ప మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోమ్ మంత్రి అమిత్ షా తో సహా అందరూ చప్పట్లు కొడుతున్నట్టు ఉంది. .
దీనిని షేర్ చేస్తూ, ఒక యూజర్, ఒకే ఒక వ్యక్తి ఈ వేడుకలో చప్పట్లు కొట్టలేదని, పైగా చేతులని చప్పట్లు కొట్టట్లేదు అని అన్నట్టుగా పెట్టుకున్నారు అనే అర్థం వచ్చేటట్టు పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ కు మా కథనం రాసే సమయానికి 89,000 వేలకు పైగా వ్యూస్ మరియు 1100 లకు పైగా లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే, ఈ క్లెయిమ్ అబద్ధం. పురస్కారం ప్రధానం చేసే సమయం లో ఖర్గే చప్పట్లు కొట్టారు.
మేము ఎలా కనుగొన్నము?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో కుడా షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోలో కుడా ఖర్గే చప్పట్లు కొట్టనట్టే ఉంటుంది.
వైరల్ ఫొటోలో అలా కనపడిన కూడా, వీడియోలో మాత్రం, అయన చప్పట్లు కొట్టడం మనం చూడవచ్చు.
మార్చ్ 31 నాడు భారత రాష్ట్రపతి చానల్ లో ఈ వేడుకకి సంబంధించి షేర్ చేసిన వీడియోని మేము కనుగొన్నాము. 41 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, అవార్డు ప్రధానోత్సవ సమయంలో ఖర్గే మరియు ఇతర రాజకీయ నాయకులు మొదటి వరుసలో కూర్చుని ఉన్నారు. నరసింహ రావు పేరు ప్రకటించినప్పుడు, పురస్కారం అందుకోవటానికి ఆయన కొడుకు నడుస్తున్న సంశయంలో ఖర్గేతో సహాయ అందరూ చప్పట్లు కొట్టడం మనం ఇక్కడ చూడవచ్చు.
ప్రధాన మంత్రి మోదీ, అమిత షా చప్పట్లు కొట్టనప్పుడు కూడా ఖర్గే చప్పట్లు కొట్టడం మనం చూడవచ్చు.
మల్లిఖార్జున్ ఖర్గే చప్పట్లు కొడుతున్న దృశ్యం (సౌజన్యం : యూట్యూబ్ / లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్ )
ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ లో కుడా ఈ వేడుక లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు, ఇందులో 2:31 మార్క్ దగ్గర ఖర్గే నిలబడి ప్రభాకర్ రావు కు షేక్ హ్యాండ్ ఇవ్వటం కుడా చూడవచ్చు.
లైవ్ స్ట్రీమ్ లో ప్రభాకర్ రావు ఖర్గే షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యం (సౌజన్యం : యూట్యూబ్/స్క్రీన్ షాట్)
తీర్పు:
మాజీ ప్రధాని పి వి నరసింహారావుకు భారత రత్న పురస్కారం మరణాంతరం ప్రధానం చేసిన వేడుకలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చప్పట్లు కొట్టలేదు అని ఒక ఫోటో షేర్ చేసారు. కానీ ఆ వేడుక వీడియోలో చూస్తే, ఖర్గే చప్పట్లు కొట్టటం మనకి కనిపిస్తుంది. కనుక ఇది అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం: రాజేశ్వరి పరస)