హోమ్ లఘు చిత్రంలోని ఒక సన్నివేశాన్ని హర్యానాలో ముస్లింల పై జరుగుతున్న హింసగా ప్రచారం చేశారు

లఘు చిత్రంలోని ఒక సన్నివేశాన్ని హర్యానాలో ముస్లింల పై జరుగుతున్న హింసగా ప్రచారం చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 23 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
లఘు చిత్రంలోని ఒక సన్నివేశాన్ని హర్యానాలో ముస్లింల పై జరుగుతున్న హింసగా ప్రచారం చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వైరల్ క్లిప్ ఉత్తర్ ప్రదేశ్ లో తీసిన ‘దోస్తీ కి సజా’ (స్నేహం విధించిన శిక్ష) అనే హిందీ లఘు చిత్రం లోనిది.

నేపధ్యం 

ఎక్స్ (ఇంతకమునుపు ట్విట్టర్) లో వైరల్ అవుతున్న ఒక 30 సెకన్ల క్లిప్ ఒకదానిలో ఖాకీ బట్టలు వేసుకున్న కొందరు- బహుశా పోలీసులు- కింద ఒక మనిషి అదుపు చేస్తున్నట్టు ఉంది. అదుపులో ఉన్న మనిషి మీద వీరు దాడి చెయ్యడం, తుపాకీతో బెదిరించడం, హింసించడం మనం ఆ వీడియోలో చూడవచ్చు. 

కొంతమంది ఎక్స్ యూజర్స్ ఈ క్లిప్ షేర్ చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వ హిందూ పరిషద్, బజారంగ దళ్ లాంటి మతవాద సంస్థలు హర్యానాలో ముస్లింలని అణిచివేయటానికి చేస్తున్న ప్రయత్నాలని ఈ వీడియో “బహిర్గతం” చేసిందని రాసుకొచ్చారు. హర్యానాలోని నూహ్ లో మొన్న జులై 31 నాడు జరిగిన అల్లర్ల తరువాత ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. 

ఈ వైరల్ వీడియోని ఈ వ్యాఖ్యానంతో కూడా షేర్ చేశారు- చూడండి, ఆలోచించండి... ఈ ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా హర్యానాలో ముస్లింలని అణిచివేస్తున్నాయో. ఆర్ఎస్ఎస్ , విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్... మానవత్వం చనిపోతుంది... మీరేమో ఏమీ మాట్లాడటం లేదు. (హిందీ నుండి తెలుగు అనువాదం)

ఇది హర్యానాకి చెందిన వీడియో అని హిందుత్వ సంస్థలు ఒక ముస్లిం వ్యక్తిని హింసిస్తున్నాయని క్లైమ్ చేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. (సౌజన్యం: ఎక్స్/@Abdul_1_MS, @Sameer_asp/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో లక్నోలో తీసిన ఒక లఘు చిత్రంలోని క్లిప్. దీనికి హర్యానాలో హింసకి సంబంధం లేదు. 

వాస్తవం

వీడియోలోని కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఈ వీడియోని ఫేస్బుక్ లో విపిన్ పాండే అనే యూజర్ అప్లోడ్ చేశారని తెలిసింది. ఈ వీడియోని ఆయన జులై 28, 2023 నాడు పోస్ట్ చేశారు. అంటే హర్యానా హింసకి మూడు రోజుల ముందు. “త్వరలో వస్తున్న వీడియో. కాబట్టి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి”, అని ఈ వీడియో శీర్షిక ఉంది. అలాగే దీనితో పాటు తన యూట్యూబ్ ఛానల్ హైపర్ లింక్ కూడా ఇచ్చారు. 

విపిన్ పాండే జులై 28, 2023 నాడు పోస్ట్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/విపిన్ పాండే)

జులై 31 నాడు పాండేకి చెందిన యూట్యూబ్ ఛానల్ “విపిన్ పాండే ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్”లో ఇదే వీడియో మరింత నిడివి ఉన్నది అప్లోడ్ చేశారు. ఈ వీడియో 10:45 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ వీడియోలో ఉన్న సీన్ మనం చూడవచ్చు. అయితే ఈ వీడియోలో అదే సీన్ వేరే కెమెరా యాంగిల్ లో ఉంది. 

వైరల్ వీడియో, విపిన్ పాండే ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/@Abdul_1_MS/యూట్యూబ్)

అలాగే ఈ వీడియో షూటింగ్ కి సంబంధించి మరికొన్ని చిన్న చిన్న వీడియోలని పాండే తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. 

విజయ్ పాండే ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియోల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: యూట్యూబ్/విపిన్ పాండే)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ విపిన్ పాండేని సంప్రదించింది. ఈ వీడియో తను తీసిందేనని, ఇది కాల్పనిక వీడియో అని తను ధ్రువీకరించారు. ఈ వీడియో ఏ మతానికి సంబంధించినది కాదని, హిందూ లేదా ముస్లిం అస్థిత్వాలకి ఈ వీడియోకి సంబంధం లేదని ఆయన నొక్కివక్కాడించారు. తప్పుడు శీర్షికలు పెట్టి తన వీడియో షేర్ చెయ్యడాన్ని ఆపాలని ఆయన కోరారు. “ఆ వైరల్ వీడియో క్లైమ్ లో చెప్పినట్టు ఏమీ కాదు. అలాగే నేను ఏ రాజకీయ స్రవంతికి చెందినవాడిని కాదు”, అని ఆయన తెలిపారు. 

వాస్తవం

హర్యానాలోని మేవాట్ లో ఒక ముస్లిం వ్యక్తిని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషద్, బజరంగ దళ్ సంస్థలకి చెందిన వ్యక్తులు హింసిస్తున్నారు అని చెబుతూ వైరల్ చేసిన ఒక వీడియో క్లిప్ “స్నేహం విధించిన శిక్ష” అనే ఒక హిందీ లఘు చిత్రంలోనిది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.