హోమ్ 2021 నాటి వీడియోని ప్రమాణస్వీకారం ముందు చంద్రబాబు ‘ఎన్డీఏ కూటమి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు’ షేర్ చేశారు

2021 నాటి వీడియోని ప్రమాణస్వీకారం ముందు చంద్రబాబు ‘ఎన్డీఏ కూటమి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు’ షేర్ చేశారు

ద్వారా: ఇషిత గోయల్ జె

జూన్ 17 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2021 నాటి వీడియోని ప్రమాణస్వీకారం ముందు చంద్రబాబు ‘ఎన్డీఏ కూటమి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు’ షేర్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు నాయుడు కోపంతో అరుస్తున్నారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఈ వీడియో 2021లో చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి బయటకి వెళ్ళిపోయిన సందర్భంలోనిది.

క్లైమ్ ఏమిటి?

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12నాడు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ఇది నాలుగో సారి. 

ఈ కార్యక్రమం తరువాత, చంద్రబాబు శాసనసభ నుండి బాధతో వెళ్లిపోతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఈ వీడియోని ఎన్డీయే ప్రమాణ స్వీకారానికి ముందుగా తీసినట్టుగా వైరల్ అవుతుంది. ఇందులో చంద్రబాబు తెలుగులో మాట్లాడుతూ, “నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కుడా మీరు ఇవ్వనివ్వకుండా చేశారు...ముఖ్య మంత్రిగానే నేను ఇక్కడికి వస్తాను. లేకపోతే నాకు అవసరం లేదు. ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. నేను ఇలాంటి సభలో ఉండను అని తెలియజేస్తున్నాను. నా అవమానం మీరందరు అర్ధం చేసుకోవాలి. నిండు మనసుతో అర్ధం చేసుకోవాలని కోరుతూ అందరికి నమస్కారం,” అని అనటం మనం చూడవచ్చు. వీడియోలో మరో వ్యక్తి, మీ పతనం మొదలయింది, మా ప్రభుత్వం వస్తుంది అంటూ అనడం మనం వినవచ్చు.

ఈ వీడియోని షేర్ చేసి చంద్రబాబు ఎన్డీయే కూటమి పట్ల అసంతృప్తితో ఉన్నారు అని హిందీలో శీర్షిక పెట్టారు.. కొంత మంది యూజర్లు, చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపట్లేదు అని కుడా రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్ లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ ల స్క్రీన్ షాట్ (సౌజన్యం :ఫేస్బుక్ /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈమధ్య జరిగిన సాధారణ ఎన్నికలలో విజయం సాధించింది. నరేంద్ర మోదీ మరియు ఇతర ఎంపీలు జూన్ 10 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం కుడా ఎన్డీయే కూటమిలో భాగమే.

అయితే, ఈ క్లైమ్స్ తప్పు. ఈ వీడియో ఈమధ్య కాలం లోది కాదు. ప్రమాణస్వీకారానికి కానీ, ఎన్డీఏ కూటమికి కానీ సంబంధం లేదు.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, ఈ వీడియో నవంబర్ 2021 నాటిది అని అర్ధమయింది. నవంబర్ 19, 2021 నాడు వీ 6 (ఆర్కైవ్ ఇక్కడ) వార్తా చానల్ తమ యూట్యూబ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన మరింత నిడివి ఉన్న ఇదే వీడియో లభించింది. ఈ వీడియోని “Chandrababu Naidu Sensational Decision In AP Assembly” అనే శీర్షికతో షేర్ చేసారు. వైరల్ వీడియో ఇందులో 0:02 టైమ్ స్టాంప్ దగ్గర ఉంది. 

అదే విధంగా, టీవీ 5 న్యూస్  (ఆర్కైవ్ ఇక్కడ) తమ యూట్యూబ్ లో ఈ వీడియోని, "UNSEEN VIDEO: TDP Chief Chandrababu Naidu Challenge in Andhra Pradesh Assembly” అనే శీర్షిక తో షేర్ చేసారు. వైరల్ వీడియో ఇందులో 0:54 టైమ్ స్టాంప్ దగ్గర ఉంది.

చంద్రబాబు ఏమని అన్నారు?

హిందుస్థాన్ టైమ్స్ మరియు ఎన్ డీ టీ వీ కథనాల ప్రకారం, నాడు ప్రభుత్వంలో ఉన్న వై ఎస్ ఆర్ సీ పీ శాసనసభ్యులు అంబటి రాంబాబు మరియు ఇతరులు చేసిన అసభ్య వ్యాఖ్యలకి జవాబుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. తరువాత తెలుగుదేశం సభ్యులు పోడియం వద్ద క్షమాపణ చెప్పాలని నిరసనలు కుడా చేశారు.

శాసనసభ నుండి బయటకి వచ్చిన తరువాత పెట్టిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తన భార్య మీద చేసిన వ్యాఖ్యలకు ఆ విధంగా స్పందించినట్టుగా తెలిపారు. “నా భార్య ఎన్నడూ రాజకీయాలలోకి రాలేదు. నేనెప్పుడూ గౌరవంతోనే బతికాను, గౌరవం కోసమే ఉంటాను. ఇంకా నేను దీనిని భరించలేను,” అని ఆయన అన్నట్టుగా ఎన్డీటీవీ కథనం పేర్కొంది.

తీర్పు

ఈ వీడియో 2021 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో చంద్రబాబు నాయుడు భావోద్రేకానికి గురైన సందర్భంలోనిది. మహిళా సాధికారత గురించి జరుగుతున్న చర్చలో తన భార్య గురించి వై ఎస్ ఆర్ సీ పీ సభ్యలు చేసిన అసభ్యకర వ్యాఖ్యల ఆయన అలా స్పందించారు. ఈ సంఘటనకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధం లేదు. 

(అనువాదం - రాజేశ్వరి పరసా ) 

 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.