హోమ్ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 2020 నాటి వీడియోని వాడుకుని కర్ణాటకలో "ఆర్ఎస్ఎస్ ముస్లింల మీద దుష్ప్రచారం చేస్తున్నది" అని ప్రచారం చేస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 2020 నాటి వీడియోని వాడుకుని కర్ణాటకలో "ఆర్ఎస్ఎస్ ముస్లింల మీద దుష్ప్రచారం చేస్తున్నది" అని ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 2020 నాటి వీడియోని వాడుకుని కర్ణాటకలో "ఆర్ఎస్ఎస్ ముస్లింల మీద దుష్ప్రచారం చేస్తున్నది" అని ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

బురఖా ధరించి మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నవారిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు 2020లో పట్టుకున్న వీడియో ఇది.

నేపధ్యం

మే 10, 2023 నాడు కర్ణాటక ఎన్నికలు అయిపోగానే చాలా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని సూచించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఫలితాలని సూచించాయి. ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో గెలిచింది. 

“ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని కర్ణాటకలో ఒక హిందువుల బృందం హిజాబ్ వేసుకుని పోలీసుల మీద రాళ్ళ వర్షం కురిపించింది.” అనే వ్యాఖ్యతో ట్విట్టర్ లో ఒక వీడియో చక్కర్లు కొట్టింది. ఇదే ట్వీట్ త్రెడ్ లో ఇంకొక ట్వీట్ లో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పిన ఒక ఎగ్జిట్ పోల్స్ ఫోటో పెట్టి “ద్వేషం ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి” అని ఒక ట్విట్టర్ యూజర్ రాశారు. 

ఈ వీడియోలో బురఖాలో ఉన్నవారు తెలుగులో మాట్లాడుతున్నారు. పోలీసులు వాళ్ళని బురఖా తొలగించమని అడుగుతున్నారు..

ట్విట్టర్ లో కొంత మంది ఇదే వీడియో షేర్ చేసి కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో ముస్లింల మీద దుష్ప్రచారం చెయ్యడానికి ఆర్ ఎస్ ఎస్ తీవ్రవాదులు ఇలా బురఖాలో పోలీసుల మీద రాళ్ళు రవ్వుతున్నారని  రాసుకొచ్చారు. 

కొన్ని ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తధ్యం అని సూచించడంతో హిందూ మితవాద సంస్థైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి చెందిన వారు ముస్లింల మీద దుష్ప్రచారం చేయడం కోసం బురఖా వేసుకుని కర్ణాటకలో పోలీసుల మీద రాళ్ళు రవ్వుతున్నారు అన్న వ్యాఖ్యానంతో ఈ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొట్టింది. 

అయితే ఇది పాత వీడియో. దీనికి కర్ణాటకకి సంబంధం లేదు. 

వాస్తవం

ఈ వీడియోలో ఒక ఫ్రేమ్ స్క్రీన్ షాట్ తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఇంజన్ లో వెతికితే ఆగస్ట్ 8, 2020 నాటి ఈటివి ఆంధ్ర ప్రదేశ్ వీడియో ఒకటి దొరికింది. ఈ వీడియోలో ఒక నిమిషం మార్క్ దగ్గర ట్విట్టర్లో చక్కర్లు కొట్టిన వీడియోలో ఏదైతే ఉందో ఇందులో కూడా అదే ఉంది. ఈటివి వీడియో శీర్శిక ఇలా ఉంది- బురఖా ధరించి మద్యం అక్రమ రవాణా చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

బురఖా ధరించి మోటార్ సైకిళ్ల మీద అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమందిని కర్నూలు జిల్లా పోలీసులు పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారని, వాళ్ళ దగ్గర నుండి 304 మద్యం సీసాలు జప్తు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశారని ఈటివి వార్తా కథనం పేర్కొంది. 

ఈ వీడియోలో 0:33 దగ్గర పోలీసులు జప్తు చేసిన మద్యం సీసాల ముందు కూర్చున్న ఒక వ్యక్తి బురఖా తొలగించటం మనం చూడవచ్చు.  

అయితే ఈ వీడియోలో కానీ ట్విట్టర్లో వైరల్ అయిన వీడియోలో కానీ రాళ్ళు రువ్వటం ఎక్కడా లేదు. రెండూ ఒకటే వీడియో కూడా. 

నాటి కర్నూలు జిల్లా ఎస్ పి, ఫకీరప్ప కగినెళ్ళి, ఈ విషయం గురించి మార్చ్ 16, 2020 నాడు చేసిన ట్వీట్ ను లాజికల్లీ ఫ్యాక్ట్స్ గుర్తించింది. “బురఖా ధరించి ఉన్న ఈ మనిషి తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ కి మద్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. అబద్ధపు వార్తలు ప్రచారం చెయ్యటం మానండి.” అని ఆయన ట్వీట్ చేశాడు. 

ఈ వీడియో గురించి ఇంకా వెతికితే తెలిసిన విషయం ఏమిటంటే 2020 నుండి కూడా రకరకాల వ్యాఖ్యానాలతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నది అని. అందులో ఒక వ్యాఖ్యానం అయితే ఈ వీడియో కర్ణాటకలో 2022లో చెలరేగిన హిజాబ్ వివాదానికి సంబంధించినది అని కూడా ఉంది. 

బెంగళూరు పోలీసు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 2020 నాటి వీడియో అని తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. 

తీర్పు

బురఖా ధరించి మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోని కర్ణాటకలో హిందూ పురుషులు ముస్లిం మహిళల వేషధారణలో పోలీసులు మీద రాళ్ళు రువ్వుతున్న వీడియో అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది అబద్ధం అని మేము నిర్ధారించాము.  

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.