హోమ్ 2001 ఎల్ సాల్వడార్ భూకంపానికి సంబంధించిన ఫొటోని వయనాడ్ ఫొటోగా షేర్ చేస్తున్నారు

2001 ఎల్ సాల్వడార్ భూకంపానికి సంబంధించిన ఫొటోని వయనాడ్ ఫొటోగా షేర్ చేస్తున్నారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

ఆగస్టు 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2001 ఎల్ సాల్వడార్ భూకంపానికి సంబంధించిన ఫొటోని వయనాడ్ ఫొటోగా షేర్ చేస్తున్నారు వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన తాలూకూ ఫొటో అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

2001 నాటి ఈ ఫొటో ఎల్ సాల్వడార్ కి చెందినది. కేరళ లో భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటో కాదిది.

క్లైమ్ ఏంటి?

కొండ వాలు మీద కొంత భాగం విరిగిపోయినట్టున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. తాజాగా కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన తాలూకా ఫొటో ఇది అని క్లైమ్ తో ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. తమిళ న్యూస్ ఛానల్ పోలిమర్ న్యూస్ ఈ ఫొటోని తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, ఇది వయనాడ్ ఘటనకి సంబంధించిన ఫొటో అని క్లైమ్ చేసింది(ఆర్కైవ్ ఇక్కడ). 

“వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన దృశ్యాన్ని చూపిస్తున్న విహంగా వీక్షణం. 291 మంది చనిపోయారు,” అనే శీర్షికతో ఫేస్బుక్ లో ఒక యూజర్ ఈ ఫొటోని షేర్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఈ ఫొటో ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది వయనాడ్ ఫొటో అని నమ్మారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది వయనాడ్ కి చెందిన ఫొటో కాదని మా పరిశోధనలో తేలింది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, ఇది ఎల్ సాల్వడార్ లో 2001 లో భూమి కంపించిన నాటి ఫొటో అని తేలింది. ఇదే ఫొటో నాసా వాళ్ళు ఫిబ్రవరి 2006 లో ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల హాట్స్పాట్స్ అనే అంశం మీద ప్రచురించిన వ్యాసంలో కూడా ఉంది. “2001 లో ఎల్ సాల్వడార్ లో శాంటా టెక్లా ప్రాంతం సమీపంలో భూకంపం కారణంగా కొండ చరియలు విరిగిపడి అనేక ఇళ్ళు మట్టి పెళ్లల కింద శిధిలమయ్యాయి ,” అనేది ఈ ఫొటో శీర్షిక. ఫొటోగ్రాఫర్ ఎడ్వర్డ్ ఎల్ హార్ప్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వారికి ఈ ఫొటో సౌజన్యం ఇచ్చారు.

నాసా వారు షేర్ చేసిన ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: నాసా ఎర్త్ డేటా)

ఈ ఫొటో అనేక  కథానాలలో కూడా వచ్చింది. అందులో బీబీసీ వారు జనవరి 2001 లో ఎల్ సాల్వడార్ లో భూకంపం గురించి ప్రచురించిన కథనం కూడా ఒకటి.

ఎల్ సాల్వడార్ లో 2001 లో వచ్చిన భూకంపం

జనవరి 13, 2001 నాడు ఎల్ సాల్వడార్ లో పసిఫిక్ మహాసముద్రంలో శాన్ మిగ్యుల్ అనే పట్టణం దగ్గర 7.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా శాంటా టెక్లా ప్రాంతంలో ఇలా జరిగింది. అనేక ప్రాంతాలు శిధిలమైపోయాయి.   

కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 800 మంది చనిపోగా, 10000 వరకు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.

వయనాడ్ ఘటన 

ది ఇండియన్ ఎక్స్ప్రెస్  లో కథనం ప్రకారం వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా చనిపోయారు. భారతీయ వాయు సేన, నావికా దళం, రాష్ట్ర సహాయక దళం లాంటి వాటి ఆధ్వర్యంలో సహాయాక చర్యలు కొనసాగుతున్నాయి.

తీర్పు

పాత ఫొటోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఫొటోగా షేర్ చేస్తున్నారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.