హోమ్ వైరల్ అవుతున్న మంత్రి స్మృతి ఇరానీ ఫొటో ఎడిటెడ్ ఫొటో

వైరల్ అవుతున్న మంత్రి స్మృతి ఇరానీ ఫొటో ఎడిటెడ్ ఫొటో

ద్వారా: రజిని కె జి

మార్చి 14 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైరల్ అవుతున్న మంత్రి స్మృతి ఇరానీ ఫొటో ఎడిటెడ్ ఫొటో బెల్లీ నృత్యకారణి దుస్తులలో మంత్రి స్మృతి ఇరానీ అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

తుర్కియేకి చెందిన ఒక బెల్లీ డాన్సర్ ఫొటోని ఎడిట్ చేసి దానికి మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఫొటోని జోడించారు.


క్లెయిమ్ ఏమిటి?

భారత మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బెల్లీ డాన్స్ దుస్తులు వేసుకుని ఉన్నట్టుగా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోని షేర్ చేస్తూ పలువురు యూజర్లు సెక్సిస్టు వ్యాఖ్యలతో, మంత్రిని అప్సర (దేవ కన్య) అని పిలుస్తూ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో కనుక్కోమంటూ పోస్ట్లు పెడుతున్నరు. అలాంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఫొటో (సౌజన్యం : ఫేస్బుక్/ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే,  ఈ ఫొటో ఫేక్. ఇది ఎడిట్ చేయబడిన ఫోటో. ఒక ఇరానీ నృత్యకారిణి ఫొటో తీసుకుని తన మొహానికి బదులు మంత్రి స్మృతి ఇరానీ మొహాన్ని జోడించారు.

వాస్తవం ఏమిటి ?

ఆ ఫోటోని తీక్షణంగా పరీక్షిస్తే, అందులో స్మృతి ఇరానీ మొహం మరియు తల భాగం మిగతా శరీరంతో పోలిస్తే సరిగ్గా జతకూడలేదని అర్దమవుతుంది. దీని వలన ఇది డిజిటల్ గా ఎడిట్ చేయబడినది అనే అనుమానం కలుగుతుంది. 

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే మాకు  ట్రిప్ అడ్వైసర్ అనే ఒక యాత్ర వెబ్సైటులో ఒరిజినల్ ఫొటో లభించింది. ఈ ఫొటోకి శీర్షికగా, “ఫొటో: టర్కిష్ బార్బెక్యూ రాత్రి వేళ ఒక బెలల్లీ డాన్సర్” అని ఉంది, ఇది మర్మరీస్ తుర్కియా లో క్లబ్ ఎగ్జిల్సియార్ అనే ఒక హోటల్ లో తీసినది అని ఉంది.

ఒరిజినల్ ఫొటో మరియు వైరల్ అవుతున్న ఫొటోని పోల్చి చూస్తే, స్మృతి ఇరానీ మొహం తప్ప అన్నీ ఒకేలాగ ఉన్నాయి. దీని బట్టి కావాలనే వేరే ఫొటోలో స్మృతి ఇరానీ మొహాన్ని పెట్టి, ఆ ఫొటోని బ్లాక్ అండ్ వైట్ లో ఒక పాత ఫొటో లాగా కనిపించాలని తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోని మొదటిగా ఎవరు తీశారు అనే విషయాన్ని మేము నిర్ధారించలేకపోయినా, ఇది ఆ యాత్ర వెబ్సైటు లో ఉండటం వలన అక్కడి హోటల్ లో నివాసం ఉండడానికి వచ్చిన యాత్రికులు తీసి ఉండవచ్చని అనుకుంటున్నాము.

వైరల్ ఫొటో మరియు ట్రిప్ అడ్వైసర్ లో ఉన్న ఫొటో మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/ట్రిప్ అడ్వైసర్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

తీర్పు

ఒక బెల్లీ డాన్సర్ ఫొటోని ఎడిట్ చేసి  మంత్రి స్మృతి ఇరానీ మొహాన్ని ఆ ఫొటోకి జోడించారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము.

(అనువాదం- రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.