హోమ్ ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సీ పీ గెలవనుందని ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలో తేలిందంటూ ఒక ఫేక్ ప్రకటన వైరల్ అయ్యింది

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సీ పీ గెలవనుందని ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలో తేలిందంటూ ఒక ఫేక్ ప్రకటన వైరల్ అయ్యింది

ద్వారా: రాజేశ్వరి పరస

మే 30 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సీ పీ గెలవనుందని ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలో తేలిందంటూ ఒక ఫేక్ ప్రకటన వైరల్ అయ్యింది ఆర్ఎస్ఎస్ 'అంతర్గత సర్వే'లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని తేలిందని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఇది ఫేక్ అని ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచార కమిటీ అధ్యక్షులు స్పష్టం చేశారు. అలాగే ఈ ‘అంతర్గత సర్వే’ ప్రకటన ఏదీ కూడా ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ లో మాకు లభించలేదు.

క్లైమ్ ఏంటి?

‘సంస్థ చేపట్టిన అంతర్గత సర్వే’ ప్రకారం 2024 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒక ప్రకటన విడుదల చేసిందంటూ ఒక ఫొటోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.

మే 13, 2024 తారీఖుతో ఉన్న ఈ ప్రకటనలో, 57.1 శాతం ఓట్లతో వై ఎస్ ఆర్ సీ పీ 159 సీట్లు గెలుచుకుంటది అని, 36.2 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలుచుకుంటది అని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మే 13 నాడు జరిగాయి.

ఈ సర్వేని ఏప్రిల్ 25 - మే 5 మధ్య నిర్వహించారు అని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో, వాలంటీర్లతో చర్చించిన తరువాత ఈ సర్వే ఫలితాలని విడుదల చేశారని ఈ ప్రకటనలో ఉంది. మహిళా ఓటర్ల శాతం ఎక్కువుగా ఉండటం, సంక్షేమ పధకాల అమలు లాంటివి వై ఎస్ ఆర్ సీ పీకి అనుకూలమని కూడా ఈ ప్రకటనలో ఉంది. ఈ ప్రకటన ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు బర్ల సుందర్ రెడ్డి పేరు మీద ఉంది. ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ. 

ఒక యూజర్ ఈ ప్రకటనని షేర్ చేసి, “బిజెపి మాతృసంస్థ, బిజెపి ఆత్మ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేసింది. మునుపెన్నడు ఎగ్జిట్ పోల్స్ ను సర్వే చేయించని ఈ సంస్థ....తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ను తమ ఆఫీసియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయటం విశేషం,” అని రాసుకొచ్చారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం, జన సేన, భారతీయ జనతా పార్టీ విపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఫేక్ ప్రకటన.

మేము ఏమి తెలుసుకున్నాము?

మేము ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ లో ఈ ప్రకటన గురించి వెతికాము. అక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఎటువంటి ప్రకటనా లేదు. అలాగే ఈ సర్వే విడుదల గురించి ఎటువంటి పత్రికా కథనం కూడా లేదు. ఈ వెబ్సైట్ లో ‘ఆంధ్ర ప్రదేశ్’, ‘శాసనసభ ఎన్నికలు’ లాంటి కీ వర్డ్స్ వాడి వెతికినా కూడా ఏమీ లభించలేదు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సీ పీ విజయం గురించి ఆర్ఎస్ఎస్ వారి సామాజిక మాధ్యమ అకౌంట్లలో కూడా ఏమీ లేదు.

అలాగే ఆర్ఎస్ఎస్ ఇటువంటి సర్వే చేసింది అని కానీ, ఇటువంటి ‘ఎగ్జిట్ పోల్’ నిర్వహించింది అని కానీ తెలుపుతూ ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనం కూడా మాకు లభించలేదు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ బర్ల సుందర్ రెడ్డిని సంప్రదించడానికి ప్రయత్నించింది. తన బదులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంత ప్రచార విభాగం అధినేత అయిన ఆయుష్ నడింపల్లి మాతో మాట్లాడారు. “ఇటువంటి ప్రకటనని ఆర్ఎస్ఎస్ విడుదల చేయలేదు. ఇందులో సంతకం కూడా నకిలీ సంతకం లాగానే ఉంది. దీని గురించి ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో మా న్యాయ బృందం కసరత్తు చేస్తున్నది,” అని ఆయుష్ మాకు తెలిపారు. ఇటువంటి రాజకీయ సర్వేలని ఆర్ఎస్ఎస్ చేపట్టదు అని కూడా తను మాకు తెలిపారు.

2024 ఎన్నికలు పూర్తి అయ్యేవరకు వార్తా చానళ్ళ, పోలింగ్ సంస్థల ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ఫలితాల విడుదల మీద ఎన్నికల సంఘం నిషేధం విధించింది. జూన్ 1 సాయంత్రం 6:30 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

2022లో కూడా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్ఎస్ఎస్ ‘అంతర్గత సర్వే నివేదిక’ పేరు మీద ఒక నివేదిక తెలంగాణలో సర్కులేట్ అయ్యింది. ఇది ఫేక్ అని ఆర్ఎస్ఎస్ అప్పుడే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇచ్చిన వివరణలో “ఆర్ఎస్ఎస్ రాజకీయాలలో పాల్గొనదు, అలాగే రాజకీయ సర్వేలు చేపట్టదు” అని ఉంది.

తీర్పు

సామాజిక మాధ్యమాలలో ఒక ఫేక్ ప్రకటన షేర్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనుందని ఆర్ఎస్ఎస్ ఆంచనా వేసిందని క్లైమ్ చేశారు. అయితే ఈ ప్రకటన ఫేక్ అని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.