హోమ్ అగ్నిపథ్ పధకాన్ని ‘సైనిక్ సమాన్ స్కీమ్’ పేరు మీద తిరిగి కొత్తగా ప్రవేశపెట్టారు అనే క్లైమ్ అబద్ధం

అగ్నిపథ్ పధకాన్ని ‘సైనిక్ సమాన్ స్కీమ్’ పేరు మీద తిరిగి కొత్తగా ప్రవేశపెట్టారు అనే క్లైమ్ అబద్ధం

ద్వారా: ఉమ్మే కుల్సుం

జూన్ 21 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అగ్నిపథ్  పధకాన్ని ‘సైనిక్ సమాన్ స్కీమ్’ పేరు మీద తిరిగి కొత్తగా ప్రవేశపెట్టారు అనే క్లైమ్ అబద్ధం అగ్నిపథ్ పధకాన్ని సవరించి 'సైనిక్ సమాన్ స్కీమ్' పేరు మీద కొట్టగా తీసుకువస్తున్నారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

భారత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అగ్నిపథ్ పధకానికి ప్రభుత్వం చేసిన మార్పులు అని సర్కులేట్ అవుతున్న డాక్యుమెంట్ ఫేక్.

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో షేర్ చేసి, భారత ప్రభుత్వం అగ్నిపథ్ పధకానికి మార్పులు చేసి ‘సైనిక సమాన్ స్కీమ్’ పేరు మీద తిరిగి కొత్తగా ప్రవేశపెడుతున్నది అని క్లైమ్ చేశారు. జూన్ 14, 2022 నాడు అమలులోకి వచ్చిన అగ్నిపథ్ పధకం ప్రకారం, భారత రక్షణ దళాలలో సైనికులని స్వల్ప కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. రక్షణ దళాలలో సగటు వయసుని తగ్గించటం, కొత్త టాలెంట్ ని తీసుకురావడం, సైన్యాన్ని తయారుగా ఉంచడం కోసం యువకులకి తాత్కాలిక అవకాశం కలిపించడం ఈ పధకం ఉద్దేశం అని ప్రభుత్వం తెలిపింది. 

ఈ పధకం ప్రకారం, 'అగ్నివీర్'గా పిలవబడే తాత్కాలిక సైనికులు నాలుగు సంవత్సరాలు రక్షణ దళాలలో పని చేస్తారు. ఆ తరువాత అందులో కొంత మందిని వారి పనితీరుని బట్టి వారి ఉద్యోగాన్ని పొడిగిస్తారు. మిగతావారికి కొన్ని సదుపాయాలు కలిపించడం ద్వారా సాధారణ జీవితానికి తోడ్పాటు అందిస్తారు. 

సైనిక దళాలలో మూడు అంగాలలో -  సైనిక, వాయు, నౌకా దళాలు- అంతర్గత సర్వే నిర్వహించి, అగ్నిపథ్ పధకంలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,చూచాయగా తెలిపిన తరువాత ఈ ఫొటో సర్కులేట్ అవ్వటం మొదలయ్యింది.

వైరల్ ఫొటోలో ఏముంది?

ఈ ఫొటోలో కొన్ని విషయాలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగాలని 25 నుండి 60 శాతానికి పెంచడం. సాంకేతిక ఉద్యోగాలని శాశ్వత ఉద్యోగాలుగా చేయడం, తాత్కాలిక ఉద్యోగ నిడివిని నాలుగు నుండి ఏడు సంవత్సరాలు పెంచడం, చనిపోయిన తాత్కాలిక సైనికుల కుటుంబాలకి ఫించను, శిక్షణా కార్యక్రమం నిడివిని 42 వారాలకి పెంచడం, 45 రోజులు సెలవలు, మొత్తం 41 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం లాంటివి ఉన్నాయి. అలాగే ఏడు సంవత్సరాలు పని చేశాక ఉద్యోగాలు కలిపించడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలులో వీరికి 15 శాతం రిలాక్సేషన్ కలిపించడం, చనిపోయిన సైనికులకి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం లాంటి విషయాలు కూడా ఈ ఫొటోలో ఉన్నాయి.

“ప్రతిపక్షమే కనుక మరింత బలంగా ఉండుంటే ఏమయ్యేదో ఆలోచించండి. అగ్నివీర్ పధకాన్ని నాలుగు నుండి ఏడు సంవత్సరాలకి పొడిగించారు. బలమైన ప్రతిపక్షం ఎందుకు ఉండాలి అనేదానికి ఇది ఒక ఉదాహరణ,” అని ఒక యూజర్ ఈ ఫొటోని ఎక్స్  లో షేర్ చేసి హిందీలో రాశారు.

“అగ్నివీర్ నిడివిని నాలుగు నుండి ఏడు సంవత్సరాలకి పెంచారు,” అని ఇంకొక యూజర్ ఫేస్బుక్ రాశారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ లో పోస్ట్ చేసిన క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఫేక్ డాక్యుమెంట్. జూన్ 18, 2024 నాటికి అగ్నిపథ్ పధకంలో ఇటువంటి మార్పులు చేస్తున్నట్టు ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

వైరల్ ఫొటోలో ఏమి లొసుగులు మేము గమనించాము?

జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో చాలా లొసుగులు మాకు కనిపించాయి. ‘Agnipath’ పదాన్ని ‘Aganipath’ అని, ‘Permanent’ అనే పదాన్ని ‘Parmanent’ అని, ‘Pension’ అనే పదాన్ని ‘Pantion’ అని, ‘Lakhs’ అనే పదాన్ని ‘Lacs’ అని, ‘Guaranteed Jobs’ అనే పదాన్ని ‘Gurnted Jobs’  అని రాశారు. దీని బట్టి ఇది అధికారిక పత్రం కాకపోవచ్చు అని అనిపించింది.

వైరల్ ఫొటోలో ఉన్న లొసుగులు (సౌజన్యం: ఎక్స్)

అలాగే, అగ్నిపథ్ పధకానికి మార్పులు చేస్తున్నారని ప్రధాన స్రవంతి మీడియాలో ఎటువంటి వార్తలు రాలేదు. అలాగే 'Join Indian Army'వెబ్సైట్ లో కూడా ఈ పధకంలో మార్పులు గురించి ఏ ప్రకటనా లేదు. 

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి చివరగా మార్చ్ 2024లో వచ్చిన ఉత్తర్వు వచ్చింది. అందులో అగ్నిపథ్ పధకం గురించి ఎమీ లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా అధికారిక పత్రాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లెటర్ హెడ్ మీద రాస్తారు. రక్షణ శాఖ వెబ్సైట్ లో What's Newవిభాగంలో ఉన్న ఉత్తర్వులు మంత్రిత్వ శాఖ లెటర్ హెడ్ మీద ఉన్నాయి, ప్రతి ఉత్తర్వు మీద ఒక సంఖ్య ఉంటుంది. అలాగే వైరల్ ఫొటోలో ఉన్న ఫాంట్ వేరు, అధికారిక ఉత్తర్వుల ఫాంట్ వేరు కూడా. 

మంత్రిత్వ శాఖ అధికారిక లెటర్ హెడ్, వైరల్ ఫొటో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/రక్షణ మంత్రిత్వ శాఖ)

అలాగే, రక్షణ  మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ అకౌంట్ (ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ) లలో కూడా అగ్నిపథ్ పధకానికి మార్పులు గురించి ఎటువంటి ప్రకటనా లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్  (ఆర్కైవ్ ఇక్కడ) జూన్ 16, 2024  నాడు ఈ ఫొటో ఫేక్ అని తెలిపారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ రక్షణ మంత్రిత్వ శాఖని సంప్రదించింది. వారు జవాబిస్తే ఇక్కడ పొందుపరుస్తాము. 

తీర్పు

అగ్నిపథ్ పధకానికి చాలా మార్పులు చేశారు, ఆ మార్పులు ఇవే అని క్లైమ్ చేస్తూ సర్కులేట్ చేస్తున్న ఫొటో ఫేక్. రక్షణ మంత్రిత్వ ఇటువంటి మార్పులు చేశాము అని ఇప్పటివరకు ప్రకటించలేదు. 

(అనువాదం - గుత్తా రోహిత్)   

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.