ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 30 2024
వై ఎస్ షర్మిల, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అలాంటి వ్యాఖ్యలేమి చేయలేదు, వే2న్యూస్ (Way2News) కుడా ఈ వార్త ఫేక్ అని నిర్దారించింది.
(పాఠకుల గమనిక: ఈ కథనం లో దాడికి సంబంధించిన ఇబ్బందికర వివరణ ఉంటుంది. పాఠకులు గమనించగలరు)
క్లెయిమ్ ఏమిటి?
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద దాడి చేశాడంటూ, తన చెల్లెలు మరియు కాంగ్రెస్ నాయకురాలు వై ఎస్ షర్మిల ఆరోపించినట్టుగా ఒక వే2న్యూస్ కథనం స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. వే2న్యూస్ అనేది ఒక హైదరాబాద్ కి చెందిన మొబైల్ న్యూస్ అప్లికేషన్. ఆ వార్త కథనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన షర్మిల తన అన్న తన తల్లి ముందే ఆమెను దాడి చేసారు అని పేర్కొంది.
ప్రచారంలో ఉన్న స్క్రీన్ షాట్ లో “ఆ రోజు జగన్, నా గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడు” ఈ కథనం లో ఎపిసిసి ఆఫీస్ దగ్గర షర్మిల జనవరి 26న మీడియా తో మాట్లాడుతూ, ఒకప్పుడు తనకు సన్నిహితులు అయినవారే ఇప్పుడు సాక్షి లో తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. సాక్షి అనేది జగన్ కుటుంబం చే నడపబడే పత్రిక. ఆ కథనం లో షర్మిల ఒకసారి, జగన్ ను తనకు ఆస్థి లో వచ్చే వాటా గురించి ప్రశ్నించగా తనను గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడు అని రాసి ఉంది. ఈ సంఘటన జరిగేటప్పుడు వాళ్ళ తల్లి కుడా ఉన్నారు అని తెలిపినట్టుగా ఉంది. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్ట్లు మరియు వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్(సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వై ఎస్ షర్మిల తాను జులై 2021 లో స్థాపించిన వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని జనవరి 4వ తేదీన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసారు
అయినప్పటికీ షర్మిల తన అన్నపై ఈ విధమైన ఆరోపణ చేసారు అనేది మాత్రం అబద్దం. వే2న్యూస్ కుడా అలంటి వార్త కథనం ఏమి ప్రచురించలేదు పైగా, కాంగ్రెస్ లీడర్ అయిన షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మేము ఏమి కనుగొన్నము?
వై2న్యూస్ వార్త స్క్రీన్ షాట్ గా ప్రచారం అవుతున్న క్లిప్ లో మేము చాలా అవకతవకలు గమనించాము. వే2న్యూస్ వారు తమ కథనాలతో వాడే ఫాంట్ వేరేది, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో కథనం ప్రచురితమైన తేదీ కానీ, సమయం కానీ రాసి లేవు, మాములుగా వే2న్యూస్ రాసే కథనాలతో అవన్నీ ఉంటాయి.
వే2న్యూస్, తమ కథనానికి సంబందించిన హైపర్ లింకులను ఫోటో కింద ఉంచుతుంది, ఈ లింక్ ద్వారా మనం ఆ మొబైల్ అప్లికేషన్ లో ఉన్న కథనం చూడవచ్చు. కానీ ఈ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న లింక్ వెతికితే, అది వే2న్యూస్ లో ప్రచురించబడిన సెలెబ్రిటీల ముద్దు పేర్ల సంబందించిన వేరే కథనానికి తీసుకెళ్లింది. ఆ కథనం శీర్షిక గా, “జి కె : సోబ్రిక్యూట్స్ అఫ్ ఫేమస్ పెర్సనాలిటీస్” అని ఉంది, అందులో చిత్తరంజన్ దాస్, చక్రవరి, రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ టాగోర్ మరియు ఇతరుల ముద్దు పేర్లు పేర్కొని ఉన్నాయి.
వెబ్ బ్రౌసర్ లో లింక్ తెరుచుకున్న వెంటనే, వే2న్యూస్ ప్రచురించిన హెచ్చరిక మనకు కనిపిస్తుంది, ఫేక్ స్క్రీన్ షాట్స్ ని నమ్మకండి అని. అక్కడ ఉండే మరో లింక్ మనకు వే2న్యూస్ మొదలు పెట్టిన వారి ఫాక్ట్ చెకింగ్ పేజీ కు దారి తెస్తుంది, ఇందులో కథనం ఐడి చేర్చి, (వెబ్ లింక్ చివరన ఉంటుంది) ఈ కథనం నిజమో కాదో తెలుసోకోవచ్చు.
ఫేక్ కథనం మరియు వే2న్యూస్ వారి కథనానికి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/వే2న్యూస్ /స్క్రీన్ షాట్స్)
మేము వే2న్యూస్ వారిని సంప్రదించగా, వారు కుడా ఇలాంటి కథనం ఏమి తాము ప్రచురించలేదు అని నిర్ధారించారు, వారి పేరు మీద తప్పుడు వార్త ప్రచారం అవుతుంది అని చెప్పారు.
షర్మిల ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడింది?
ఫేక్ స్క్రీన్ షాట్ లో వాడిన షర్మిల ఫోటోని తాను జనవరి 26 నాడు మీడియా తో మాట్లాడిన సందర్భం లోనిది అని అర్ధమయింది. గణతంత్ర వేడుకలు ముగించిన తరువాత, షర్మిల మీడియా తో మాట్లాడిన వీడియోని తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ5 తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది.
తన అన్న తో విడిపోయిన కుడా తన ఇంటిపేరుగా వై ఎస్ ని పెట్టుకున్నారు అని అడిగిన ప్రశ్నకు షర్మిల సమాధానంగా, “ఒకప్పుడు నాతో సన్నిహితంగా ఉన్నవారే ఇప్పుడు సాక్షి వార్త పత్రిక లో నా పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.” తాను, తన అన్న 2019 లో చేపట్టిన పాదయాత్ర లో తన అన్న చెప్పాడని పాల్గొన్నానని, తన ఇష్ట పూర్వకంగా కాదని తెలిపింది . “నిస్వార్థంగా పాదయాత్ర చేశాను, ముఖ్య మంత్రిని ఎన్నడూ ఏమి తిరిగి కోరలేదు. దీనికి మా అమ్మ కూడా సాక్షి.” షర్మిల ఈ సందర్భం లో ఏ దాడి గురించి ప్రస్తావించలేదు.
తీర్పు : కల్పించబడిన వార్త క్లిప్ ని షేర్ చేసి, ఏపీసిసి ప్రెసిడెంట్ వై ఎస్ షర్మిల తన అన్న మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పై దాడి చేసారు అని ఆరోపించినట్టుగా ప్రచారం చేసారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్దారించాము.