హోమ్ ఆంధ్రాలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం నాయకులు ప్రకటించలేదు

ఆంధ్రాలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం నాయకులు ప్రకటించలేదు

ద్వారా: రోహిత్ గుత్తా

జనవరి 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్రాలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం నాయకులు ప్రకటించలేదు విజయవాడలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం నాయకులు ప్రకటించారని క్లైమ్ చేస్తున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఇది ఫేక్ వార్తా కథనం. తెలుగుదేశం నాయకులు ధూళిపాళ్ళ నరేంద్ర అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. వే2న్యూస్ కూడా ఇది ఫేక్ అని ధృవీకరించింది.

 

క్లైమ్ ఏమిటి?

మొబైల్ న్యూస్ యాప్ వే2న్యూస్ కి చెందిన వార్తా కథనం స్క్రీన్ షాట్ అని చెబుతూ ఒక స్క్రీన్ షాట్ ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. అందులో తెలుగుదేశం నాయకులు ధూళిపాళ్ళ నరేంద్ర తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విజయవాడలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని అంటునట్టు ఉంది. ఈ కథనం శీర్షిక, “అంబేడ్కర్ విగ్రహం కూల్చేస్తాం,” అని ఉంది. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19, 2024 నాడు ఆవిష్కరించిన తరువాత ఈ స్క్రీన్ షాట్, క్లైమ్ సర్కులేట్ అవ్వటం మొదలయ్యాయి. ఇప్పటివరకు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాలలో ఇదే ఎత్తైనది. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే వే2న్యూస్ ఇటువంటి కథనం ప్రచురించనూ లేదు, నరేంద్ర ఇటువంటి ప్రకటన చేయనూ లేదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ పోస్ట్ లో ఉన్న స్క్రీన్ షాట్ వే2న్యూస్ వార్తా కథనంకి చెందినదిగా ఉంది. అయితే దాని మీద సంస్థ లోగో లేదు. ఈ వైరల్ స్క్రీన్ షాట్ లో అనేక లొసుగులు ఉన్నాయి. ఈ వైరల్ కథనం ఫాంట్ వే2న్యూస్ తమ వార్తా కథానాలలో వాడే ఫాంట్ కాదు. అలాగే వే2న్యూస్ తమ కథనాలలో ఫొటో కింద ఆ కథనానికి సంబంధించిన లింక్ ఇస్తుంది. వైరల్ స్క్రీన్ షాట్ లో ఈ లింక్ లేదు. అలాగే నరేంద్ర ఈ వ్యాఖ్యలు ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే వివరాలు కూడా ఈ వైరల్ కథనంలో లేవు. 

వైరల్ కథనం, వే2న్యూస్ శాంపిల్ కథనం మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/వే2న్యూస్/స్క్రీన్ షాట్స్)

వే2న్యూస్ కూడా ఎక్స్ లో జనవరి 19, 2024 నాడు ఒక పోస్ట్ పెట్టింది. తాము ఈ వైరల్ కథనాన్ని ప్రచురించలేదని, ఇది ఫేక్ అని తెలిపింది. “కొంతమంది దుర్మార్గులు మా లోగో వాడి ఈ తప్పుడు కథనాన్ని వాట్స్ ఆప్ లో సర్కులేట్ చేస్తున్నారు,” అని ఆ పోస్ట్ లో రాశారు.

ఈ క్లైమ్ సర్కులేట్ అవ్వటం మొదలుపెట్టాక ధూళిపాళ్ళ నరేంద్ర గుంటూరు జిల్లా ఎస్పికి జనవరి 22, 2024 నాడు ఫిర్యాదు చేశారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాను అనని వ్యాఖ్యలను తనకి ఆపాదించి, తన గురించి సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తీర్పు

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తెలుగు దేశం నాయకులు అంటున్నట్టున్న ఒక ఫేక్ స్క్రీన్ షాట్ ని సర్కులేట్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.