హోమ్ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ రాయ్ బరేలి మరియు అమేథీ నుండి పోటీ చేస్తున్నారు అనే ప్రకటన ఫేక్.

రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ రాయ్ బరేలి మరియు అమేథీ నుండి పోటీ చేస్తున్నారు అనే ప్రకటన ఫేక్.

ద్వారా: రాజేశ్వరి పరస

మే 2 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ రాయ్ బరేలి మరియు అమేథీ నుండి పోటీ చేస్తున్నారు అనే ప్రకటన ఫేక్. వైరల్ అవుతున్న కాంగ్రెస్ ప్రెస్ నోట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ /ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

ఫేక్

కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఒక అధికారి మాతో ఈ ప్రకటన ఫేక్ అని తెలియజేశారు.

క్లెయిమ్ ఏమిటి ? 

భారత దేశ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రకటన అంటూ ఒక నోటిఫికేషన్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది, ఇందులో భాగంగా, ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ మరియు రాయ్ బరేలి నియోజకవర్గాలకు  కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది అంటూ ఉంది. ఏప్రిల్ 30, 2024 నాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటన అంటూ ఇందులో రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుండి మరియు ప్రియాంక గాంధీ అమేథీ నుండి పోటీ చేస్తారు అని ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఇదే విధంగా మరో ప్రెస్ నోట్లో రాహుల్ గాంధీ అమేథీ నుండి మరియు ప్రియాంక రాయిబరేలి నుండి పోటీ చేస్త్తారు అని కుడా ప్రచారం లో ఉంది, అది ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ అవుతున్న కాంగ్రెస్ ప్రెస్ నోట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ /ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ రెండు నియోజకవర్గాలు మాత్రమే చర్చనీయాంశంగా ఉండడానికి ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ 2004 లో రాయ్ బరేలి నుంచి పోటీ చేశారు. కాని ఇప్పుడు ఆమె రాజ్యసభకి నామినేట్ అయ్యారు, కునుక ఇప్పుడు తన స్థానంలో కూతురు అయిన ప్రియాంక గాంధీకి అక్కడ సీట్ ఇస్తారు అని ఊహాగానాలు ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుండి పోటీ చేసి ఓడిపోయారు, ఇక్కడ బీజేపీ అభ్యర్థి స్స్మృతి ఇరానీ గెలిచారు. రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి పోటీ చేసి గెలిచి ఎం పి అయ్యారు. ఈ సంవత్సరం కుడా రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి పోటీ చేసారు, ఇక్కడ ఏప్రిల్ 26 న రెండో విడుతలో ఎన్నికలు జరిగాయి. మే 3, నామినేషనల్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజు కావటంతో ఈ ప్రకటనలు వైరల్ అయ్యాయి.

కానీ ఈ రెండు ప్రకటనలు ఎడిట్ చేసినవే. కాంగ్రెస్ పార్టీ ఇంకా అమేథీ మరియు రాయ్ బరేలి నియోజక వర్గాలకి అభ్యర్థులను ప్రకటించలేదు.

వాస్తవం ఏమిటి ?

వైరల్ అవుతున్న ప్రకటనలో మాకు కొన్ని లొసుగులు కనిపించాయి. తేదీ ఒక ఫాంట్లో ఉంటే, మిగతా లేఖ ఇంకో ఫాంట్ లో ఉంది, పైగా పెద్దగా కుడా ఉంది. పైగా, అందులో లేఖలో ఇంగ్లీష్ లో ఉన్న “List of candidates Uttar Pradesh Shri. Rahul Gandhi: Raibareli Smt. Priyanka Gandhi: Amethi” ఈ అక్షరాలు కూడా పెద్దగా మరియు భిన్నంగా ఉన్నాయి.


లేఖ లో కనిపించిన లొసుగులు మరియు కాంగ్రెస్ అధికారిక ప్రెస్ నోట్ కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ ఏ ఐ సి సి/ స్క్రీన్ షాట్ 

కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు జారీ చేసిన ప్రెస్ నోట్లతో పోలిస్తే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రెస్ నోట్ సరితూగలేదు. ఇంతకు ముందు కాంగ్రెస్ విడుదల చేసిన లిస్టులను మేము పోల్చి చూసాము. అధికారిక ప్రకటనల అన్నింట్లోనూ ఏ ఐ సి సి స్టాంప్ ఉంటుంది . 

పైగా, కాంగ్రెస్ అధికారిక వెబ్సైటు లో అమేథీ మరియు రాయ్ బరేలికి అభ్యర్థులను ప్రకటించినట్టుగా ఎటువంటి ప్రకటన మాకు కనపడలేదు. ఈ మధ్యకాలం లో ఏప్రిల్ 30, 2024 నాడు విడుదల చేసింది హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు మహారాష్ట్ర లోని కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ కాంగ్రెస్ ని కుడా సంప్రదించింది. ఏ ఐ సి సి మీడియా మరియు పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా మాతో మాట్లాడుతూ, వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్ అని, అలాంటి ప్రకటన తాము చేయలేదని తెలిపారు.

ఒకవేళ అలాంటి ప్రకటన చేసి ఉంటే, అది కచ్చితంగా వార్తలలో ఉండేది. పైగా ఇండియా టుడే కథనం ప్రకారం, ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి అవకాశం తక్కువ.

తీర్పు :

రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ అమేథీ మరియు రాయ్ బరేలి నుండి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించినట్టుగా వైరల్ అవుతున్న లేఖ ఎడిట్ చేయబడినది. కాంగ్రెస్ ఆ రెండు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు, కనుక దీనిని మేము ఫేక్ అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.