హోమ్ పాత ఫొటో షేర్ చేసి ఉత్తరాఖండ్ సొరంగంలో ఇరుక్కున్న కార్మికుడిదని క్లైమ్ చేశారు

పాత ఫొటో షేర్ చేసి ఉత్తరాఖండ్ సొరంగంలో ఇరుక్కున్న కార్మికుడిదని క్లైమ్ చేశారు

ద్వారా: రజిని కె జి

నవంబర్ 29 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత ఫొటో షేర్ చేసి ఉత్తరాఖండ్ సొరంగంలో ఇరుక్కున్న కార్మికుడిదని క్లైమ్ చేశారు వైరల్ ఫొటో షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ ఫొటో 2019 నుండి ఆన్లైన్ లో ఉంది. ఉత్తరాఖండ్ సొరంగంలోని కార్మికునికి చెందినది కాదు.

నేపధ్యం

నవంబర్ 12 నాడు ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా బెండ్- బాల్కోట్ సొరంగం కూలిపోవటంతో 41 మంది నిర్మాణ కార్మికులు అందులో ఇరుక్కుపోయారు. గత 17 రోజులుగా అక్కడే ఇరుక్కుపోయిన కార్మికులని నవంబర్ 28 నాడు రక్షించారు.

ఈ నేపధ్యంలో హెల్మెట్ ధరించి, వంగి కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఫొటోని షేర్ చేసి ఆ సొరంగంలో ఇరుక్కున్న కార్మికులలో ఒకరు అనే అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒకరు (ఆర్కైవ్ ఇక్కడ ) ఈ ఫొటో షేర్ చేసి, “15 రోజులుగా సొరంగంలో ఇరుక్కున్న వాళ్ళని కాపాడలేనప్పుడు చంద్రుడు మీదకి చేరుకున్నామని చెప్పుకుని ఏమి లాభం. ఇటువంటి ఘటనలకి ఎదుర్కునే ముందస్తు చర్యలు మనమెప్పుడూ చేపట్టడం లేదు,” అనే శీర్షిక పెట్టారు. #UttarakhanaRescueTunnel, #UttarakhandTunnel అనే హ్యాష్ ట్యాగ్ లతో ఈ ఫొటోని షేర్ చేశారు. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ పోస్ట్ కి 94000 వ్యూస్, 100 లైక్స్ ఉన్నాయి. ఎక్స్ లో అనేక మంది ఇటువంటి శీర్షికతోనే ఇదే ఫొటోని షేర్ చేశారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ ఫొటో షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ ఫొటో ఈ మధ్య కాలంలోది కాదు. 2019 నుండి ఆన్లైన్ లో ఉంది. 

వాస్తవాలు

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ వైరల్ ఫొటోని మే 2, 2019 నాడు ‘ఖాసీం సుల్తానీ’ అనే యూజర్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారని తెలుసుకున్నాము. “అత్యంత బాధాకరమైన ఫొటో. నలభై సంవత్సరాల పదవి నుండి తొలగింపు యుద్ధం కథ ఇది (అరబిక్ నుండి అనువాదం),” అనే శీర్షిక పెట్టారు.

ఈ ఫేస్బుక్ యూజర్ బయోలో, “ఆఫ్గనిస్థాన్ లోని హెరాట్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఫ్యాకల్టీ ఆఫ్ లా అండ్ పొలిటికల్ సైన్స్ నుండి పట్టభద్రులు. సామాజిక, మీడియా కార్యకర్త,” అని ఉంది. ఈ ఫొటో ఎక్కడిది, ఇందులో ఉన్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవటానికి ఈ యూజర్ ని సంప్రదించాము. వారు జవాబిచ్చినప్పుడు వాటిని ఇక్కడ పొందుపరుస్తాము.  

2019 నాటి ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్స్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్)

ఇదే ఫొటో వివిధ సామాజిక మాధ్యమాలలో గత కొన్నేళ్లుగా చక్కర్లు కొడుతున్నదని కూడా తెలుసుకున్నాము. ఉదాహరణకి 2020 లో ఫేస్బుక్ లో ఈ ఫొటోని షేర్ చేశారు, అలాగే 2022 లో టిక్ టాక్ లో.

ఉత్తరాఖండ్ సొరంగం కుప్పకూలటం గురించి

సిల్క్యారా బెండ్- బాల్కోట్ సొరంగ మార్గానికి భారత ప్రభుత్వం నవంబర్, 2018లో అనుమతి ఇచ్చింది. చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా నాలుగు హిందూ దేవాలయాలని (కేదార్ నాథ్, బద్రీనాధ్, గంగోత్రి, యమునోత్రి) ఒక దానితో ఒక దానికి రవాణా పరంగా అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన మార్గం ఇది. నవంబర్ 12 నుండి అందులో ఇరుక్కున్న కార్మికులని రక్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొదట్లో అందులోకి డ్రిల్ చేయడానికి ఆగర్ డ్రిల్లింగ్ మెషీన్ వాడారు. అయితే అది ఇరుక్కుపోయి, బ్లేడ్స్ దెబ్బతిన్నాయి. ఆ తరువాత, భారత సైన్యం, నిపునలైన కూలీలు (ర్యాట్ మైనర్స్), ఇంజినీర్లు, ఇతర సాంకేతిక బృందం కష్టపడి వారిని నవంబర్ 28 నాడు రక్షించారు.

తీర్పు

2019 నుండి ఆన్లైన్ లో ఉన్న ఒక ఫొటోని ఉత్తరాఖండ్ లో కూలిన సొరంగంలో ఇరుక్కున్న కార్మికులలో ఒకరి ఫొటో అంటూ షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.