హోమ్ సినిమా సంబరాలను వైకాపా నేతల నాయుడు జైలుకి వెళ్ళి నందుకు సంబరాలు అంటూ షేర్ చేశారు

సినిమా సంబరాలను వైకాపా నేతల నాయుడు జైలుకి వెళ్ళి నందుకు సంబరాలు అంటూ షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా

అక్టోబర్ 27 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సినిమా సంబరాలను వైకాపా నేతల నాయుడు జైలుకి వెళ్ళి నందుకు సంబరాలు అంటూ షేర్ చేశారు ఆన్లైన్ లో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆ వీడియో అక్టోబర్ 19 నాడు లియో సినిమా విడుదల సందర్భంగా తమిళ నటుడు విజయ్ అభిమానులు చేసిన సంబరాలు.

క్లెయిమ్ ఏమిటి?

అక్టోబర్ 20 నాడు ఎక్స్ (పూర్వపు ట్విటర్) లో ఒక యూజర్ ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియో షేర్ చేస్తూ అది ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు అరెస్ట్ అయినందుకు, ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ వైకాపా కార్యకర్తలు  సంబరాలు చేసుకుంటున్న వీడియో అంటూ షేర్ చేశారు. 

2014-19 మధ్య టిడిపి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ది శాఖలో నిధుల దుర్వినియోగం జరిగినది  అనే ఆరోపణతో సెప్టెంబర్ 10 వ తారీఖున నాయుడుని కారగారానికి కి పంపారు. 

వీడియోలో సినిమా థియేటర్ లాగా కనిపించే ప్రాంగణం ముందు, కొంతమంది రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టడం కనిపిస్తుంది, దీనివల్ల ట్రాఫిక్ కూడా ఆగి ఉంది. ఈ కథనం రాసే సమయానికి, ఈ వీడియోకి 50,000 వ్యూస్ వరకు ఉన్నాయి. ఆర్కైవ్ ఇక్కడ. 


సామాజిక మాధ్యమాలలో క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ వీడియో నాయుడు జైలుకి వెళ్లినందుకు వైకాపా నేతలు సంబరాలు జరుపుకుంటున్నది కాదు 

వాస్తవం ఏమిటి?

వీడియోలో రోడ్డు మధ్య ఉన్న మీడియన్ మీద తమిళంలో ఉన్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. జనాలు కొబ్బరికాయలు కొడుతున్న చోట సంగీత థియేటర్ అని కూడా రాసి ఉంది.


వీడియోలో కనిపిస్తున్న గుర్తులు (సౌజన్యం: ఎక్స్ /స్క్రీన్ షాట్)

వీడియోలో ఉన్న కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మరియు కీ వర్డ్స్ తో వెతికితే, ఇది తమిళనాడులో జరిగింది అంటూ కొన్ని కథనాలు మాకు కనిపించాయి. 

ఈ ఒరిజినల్ కలర్ వీడియో ని ఎక్స్ లో,స్పార్క్ మీడియా అనే ఒక యూజర్ అక్టోబర్ 19న  పోస్ట్ చేస్తూ, తమిళ సినిమా నటుడు విజయ్ సినిమా విడుదల తరువాత ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియో అని పోస్ట్ చేశారు. ఇది తమిళనాడు లోని కోయంబత్తూరు  దగ్గర కారుమతంపట్టి అని ఈ యూజర్ తెలిపారు.

రెండు వీడియోలలోనూ ట్రాఫిక్ ని ఆపేసి కొబ్బరికాయలు కొట్టడం కనిపిస్తుంది, పసుపు పచ్చ రంగు లో ఒక లారీ, ఒక పసుపు పచ్చ మరియు నల్ల రంగు లో ఉన్న ఆటో, విజయ్ బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. 


వైరల్ వీడియోకి మరియు స్పార్క్ మీడియా ఇంకా ఇతరులు షేర్ చేసిన సినిమా సంబరాల వీడియో కి మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ ఈటివి భారత్ తమిళ్/స్క్రీన్ షాట్స్)

లియో అక్టోబర్ 19, 2023 న థియేటర్లో విడుదల అయ్యింది. 


ఈటివి భారత్ తమిళ్ కూడా దీనికి సంబందించి న్యూస్ రిపోర్ట్ ప్రచురిస్తూ, ఈ సంఘటన కోయంబత్తూరులో జరిగింది అని రాశారు. న్యూస్ 18 మరియు న్యూస్ 24*7 తమిళ్ కూడా దీని గురించి కథనాలు ప్రచురించాయి.

వీటి ఆధారంగా ఈ థియేటర్ ని గూగుల్ మ్యాప్స్ లో కనుగొన్నాము. ఈ సంగీత థియేటర్ అనేది సోమనూరులోని సంగీత సవీత థియేటర్ సముదాయంలో బాగం. ఇక్కడ మనం వీడియోలో కనిపించే ఒక విద్యుత్తు స్తంభం,, ఒక నీలం రంగు భవంతి, థియేటర్ లోపల ఒక ఎత్తైన కట్టడం లాంటివి కూడా గూగుల్ మ్యాప్స్ చిత్రంలో కూడా చూడ వచ్చు. 


స్పార్క్ వీడియోకి మరియు గూగుల్ మ్యాప్స్ లోని సంగీత థియేటర్ ఫొటో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/గూగుల్ ఇమేజ్స్ /స్క్రీన్ షాట్)

దీని బట్టి ఇది కోయంబత్తూరులో విజయ్ అభిమానులు చేసిన సంబరాల వీడియో అని తెలుస్తుంది. 

తీర్పు

ఇటీవల లియో అనే తమిళ సినిమా విడుదలప్పుడు విజయ్ అభిమానులు చేసిన సంబరాలని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు అరెస్ట్ అయినందుకు ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ వైకాపా నేతలు సంబరాలు చేసుకుంటున్న వీడియో అంటూ షేర్ చేశారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

(ఆనువాదం: రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.