హోమ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వం తిరుపతి గుడిలో ధరలు తగ్గించలేదు

ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వం తిరుపతి గుడిలో ధరలు తగ్గించలేదు

ద్వారా: రాజేశ్వరి పరస

జూన్ 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వం తిరుపతి గుడిలో ధరలు తగ్గించలేదు తిరుపతి గుడిలో ప్రత్యేక దర్శన, లడ్డు ధరలు తగ్గించారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

‘ప్రత్యేక దర్శనం’ టికెట్ ధర, ‘లడ్డూ ప్రసాదం’ ధర మారలేదు. టీటీడీ అధికారులు కూడా ఇది స్పష్టం చేశారు.

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జన సేన - భారతీయ జనతా పార్టీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక దర్శనం (మూర్తిని చూసే సౌలభ్యం) టికెట్ ధర, లడ్డూ ప్రసాదం ధర తగ్గించారు అని సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నది. ఈ వైరల్ క్లైమ్ ప్రకారం, ప్రత్యేక దర్శనం ధర గతంలో 300 రూపాయలు కాగా, దానిని 200 కి తగ్గించారు, లడ్డూ ధర 50 రూపాయలు కాగా, 25కి తగ్గించారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ క్లైమ్ అబద్ధం. గుడిలో ఈ ధరలు తగ్గించలేదు. 

వాస్తవం ఏమిటి?

ఈ ధరల తగ్గింపు గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా ప్రకటన చేసిందా అని చూశాము. అయితే, అటువంటిది ఏదీ వారి వెబ్సైట్లో లేదు. 

అయితే, మాకు డెక్కన్ క్రానికల్ లో ఒక కథనం లభించింది. అందులో ఈ ధరల పెంపుదల గురించి వార్త “ఫేక్ న్యూస్” అని టీటీడీ తెలిపింది అని ఉంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఈ విషయం గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనని టీటీడీ వెబ్సైట్ లో పెట్టారు (ఆర్కైవ్ ఇక్కడ). “తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర, లడ్డూ ప్రసాదం ధర తగ్గించలేదు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఫేక్ న్యూస్ ని నమ్మకండి,” అని ఈ ప్రకటనలో ఉంది. 

ఈ ప్రకటనని టీటీడీ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ) లో కూడా షేర్ చేసింది. “ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరలలో మార్పు లేదు” అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. “సామాజిక మాధ్యమాలలో వచ్చే ఫేక్ న్యూస్” ని నమ్మొద్దు అని కూడా ఇందులో పేర్కొన్నారు. 

టీటీడీ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

ధరల గురించి వారి వెబ్సైట్ లో చూడగా, ప్రత్యేక దర్శనం ధర ఒకొక్కరికి 300 రూపాయలు అనే ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). దీనితో పాటు ఒక లడ్డు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది అని ఉంది. ప్రత్యేక దర్శనం కాకుండా మామూలుగా లడ్డు కొనాలంటే 50 రూపాయలు చెల్లించాలి.

టీటీడీ వెబ్సైట్ ప్రకారం శీఘ్ర దర్శనం గా కూడా పిలవబడే ఈ ప్రత్యేక దర్శనాన్ని సెప్టెంబర్ 21, 2009 నాడు ప్రవేశపెట్టారు.

తీర్పు

తిరుపతి గుడిలో ప్రత్యేక దర్శనం, లడ్డు ధరలు మారలేదు. ఇదే విషయాన్ని టీటీడీ కూడా స్పష్టం చేసింది. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.