హోమ్ 2018 వార్తను షేర్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంటున్నట్టు షేర్ చేసారు

2018 వార్తను షేర్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంటున్నట్టు షేర్ చేసారు

ద్వారా: మొహమ్మద్ సల్మాన్

సెప్టెంబర్ 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
టీడీపీ ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంటుంది అని షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ టీడీపీ ఎన్డీఏ కూటమి నుండి తప్పుకుంటుంది అని షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ 2018 నాటిది, అప్పట్లో టీడీపీ అధినేత ఎన్డీఏ కూటమి నుండి బయటకి రావాలని అనుకున్నారు.

క్లెయిమ్ ఏమిటి ?

సామాజిక మాధ్యమాలలో ఒక వార్త క్లిప్ వైరల్ అవుతుంది, దీనిని షేర్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నడిపే నేషనల్ డెమోక్రాటిక్ కూటమి నుండి విడిపోయారు అని షేర్ చేస్తున్నారు. ఈ న్యూస్ క్లిప్ లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక స్టేటస్ ఇవ్వని కారణంగా తమ పార్టీ తరపున ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కుడా రాజీనామా చేస్తారు అని కుడా ఉంది. కొంత మంది యూజర్లు ఇది ఈమధ్య కాలం లోని సంఘటనగా షేర్ చేసారు.

ఒక ఎక్స్ యూసర్ (పూర్వపు ట్విట్టర్) లో ఈ వార్త క్లిప్ ను షేర్ చేస్తూ, “ఆట మొదలయింది” అనే శీర్షిక తో షేర్ చేసారు. ఈ పోస్టుకు కథనం రాసే సమయానికి దాదాపుగా 3000 రీపోస్టులు, 9000 లైక్స్ ఉన్నాయి. మరొక యూసర్ ఈ పోస్టును షేర్ చేసి, “చంద్రబాబు నాయుడు తరువాత నితీష్ కుడా కూటమి నుండి తప్పుకోవచ్చు. రేపు, టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు ఎన్డీఏ నుండి రాజీనామా చేస్తారు.”   అటువంటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

16 సీట్లతో టీడీపీ పార్టీ అనేది ఎన్డీఏ కూటమి కేంద్రం లో ప్రభుత్వం రూపొందించడానికి కూలకమైన పాత్ర ఉంది. కానీ ఈ వార్త క్లిప్ ఈ మధ్య జరిగిన సంఘటనకు సంబంధించింది కాదు, 2018 నాటిది, అప్పట్లో నాయుడు, ఈ కూటమి నుండి తప్పుకున్నాడు.

మేము ఏమి కనుగొన్నాము?

కీ వర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న క్లిప్ ఏ బి పి వార్త ఛానల్ తమ యూట్యూబ్ ఛానల్ లో మార్చ్ 7, 2018 నాడు అప్లోడ్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ), దీని ద్వారా ఇది ఆరు సంవత్సరాల కిందటి విషయం అని అర్ధమవుతుంది.

ఈ కథనం లో ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వని కారణంగా, నాయుడు ఎన్డీఏ కూటమి తో సంబంధాలు  తెంచుకున్నారు అని ఉంది. కథనం లో ఇద్దరు కేంద్ర మంత్రులు కుడా రాజీనామా చేస్తారు అని ఉంది. 

మార్చ్ 16, 2018 లో ప్రచురితమైన మరొక ఎన్డీటీవీ  కథనం ప్రకారం, టీడీపీ ఎన్డీఏ కూటమి నుండి బయటకు రావటం వలన బీజేపీ కి 2019 లో పెద్ద పడింది. టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని కుడా ప్రవేశ పెట్టింది. నాయుడు మాట్లాడుతూ, ఇదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంచికై ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు, పైగా నాలుగు సంవత్సరాలు ఎదురు చుసిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ పేరు రాలేదు అని తెలిపారు.

మేము నాయుడు ఈమధ్య కాలం లో ఎన్డీఏ కూటమి  వదలటం గురించి ఏమైనా వ్యాఖ్యలు చేసారా అని వెతికాము, కానీ అలాంటి కథనాలు ఏమి మాకు లభించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే, కచ్చితంగా అది పెద్ద వార్త అవుతుంది.   

టీడీపీ, ఎన్డీఏ ప్రయాణం

జూన్ 2024 లో ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ (ఆర్కైవ్ ఇక్కడ) టీడీపీ ఎన్డీఏ కూటమి తో ప్రయాణం గురించి ప్రచురించిన కథనం ప్రకారం, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ నేతృత్వం లోఎన్డీఏ కూటమి లో 1999 నుండి 2004 వరకు టిడిపి భాగమై ఉంది. మరల 2014 ఎన్నికల ముందు కుడా ఎన్డీఏ లో భాగమైంది. 2018 లో కూటమి నుండి విడిపోక ముంది వరకు భాగమై ఉన్నారు. ఈమధ్యన 2024 లో మరల ఎన్డీఏ లో భాగమయ్యారు.

తీర్పు : 

టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి నుండి తప్పుకోలేదు. వైరల్ అవుతున్న క్లిప్ 2018 నాటిది.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.