Kritika Goel

క్రితికా గోయల్

హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ (ఇండియా)

క్రితికా ప్రస్తుతం లాజికల్లీ ఫ్యాక్ట్స్ హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ (ఇండియా)గా పనిచేస్తున్నారు. వివిధ భాషలలొ ఫ్యాక్ట్ చెక్లు ప్రచురిస్తున్న 20 మందికి పైగా బృందానికి తను నాయకత్వం వహిస్తున్నారు. దీని ద్వారా ఆన్లైన్ లో సర్కులేట్ అయ్యే తప్పుడు/ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతక ముందు తను ది క్వింట్ లో డిప్యూటీ ఎడిటర్ (ఫ్యాక్ట్ చెక్)గా పని చేశారు. వాళ్ళ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగమైన వెబ్ కూఫ్ ని నడిపించారు. భారతదేశంలో మహిళలు, విద్యార్ధులు, యుక్త వయసు వారికి మీడియా, డిజిటల్ అక్షరాస్యత నేర్పే ప్రాజెక్టులలో పని చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ పనిని సునాయాసం చేయడానికి ‘వేరిఫై కియా క్యా?’ అనే సిరీస్ నడిపారు. దీనికి పురస్కారాలు కూడా వచ్చాయి. ఫ్యాక్ట్ చెకింగ్ పనికి గానూ అనేక ప్రశంసలు అందుకున్నారు.

తనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, సమాచారాన్ని జాగ్రత్తగా గమనించేలా ఇతరులకి సహాయపడటం తన విలువలలో భాగం. డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా ఉంచడానికి టెక్నాలజే, ఫ్యాక్ట్ చెకింగ్ రంగాలలో పనిచేయడం తనకి ఇష్టం. 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.