Jurijs Svirko

జూరిజస్ స్వీరకో

డిప్యూటీ ఎడిటర్, యూరోప్

యూరిస్ మీడియా మరియు కమ్యూనికేషన్స్ రంగంలో ముప్పైకి పైగా సంవత్సరాల అనుభవం ఉన్న పాత్రికేయులు. తను బెలారస్ లో బీబీసి, రేడియో ఫ్రీ యూరప్/రేడియో లిబర్టీ, రాయిటర్స్ సంస్థలకి పని చేశారు. అలాగే లాట్వియా దేశపు అతి పెద్ద పత్రిక డైనాకి మీన్స్క్ లో ప్రతినిధిగా పని చేశారు. ఆ తరువాత ఉక్రెయిన్ లో అనేక దినపత్రికలకి ఎడిటర్-ఇన్-చీఫ్ గా పనిచేశారు. ఉక్రెయిన్ లో అమెరికా, ఐరోపా సమాఖ్య ఫండ్ చేసిన ప్రాజెక్టులకి, ఐక్యరాజ్యసమితి ఫండ్ చేసిన ప్రాజెక్టులకి బెలారస్ లో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఫండ్ చేసిన ప్రాజెక్టులకి స్విట్జర్లాండ్ లో కమ్యూనికేషన్స్ మేనేజర్ గా పని చేశారు.
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.