Baybars Orsek

బెబార్స్ ఓర్సెక్

మేనేజింగ్ డైరక్టర్, లాజికల్లీ ఫ్యాక్ట్స్

బెబార్స్ ఓర్సెక్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ మేనేజర్. తను ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ (ఐ ఎఫ్ సి ఎన్) మరియు పోయింటర్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరక్టర్. ఐ ఎఫ్ సి ఎన్ లో చేరక మునుపు ఆయన తుర్కియేలో ప్రధమ మరియు ఒకే ఒక్కటైన రాజకీయ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాజెక్ట్ స్థాపించారు. దాని పేరు డోగ్రులుక్ పాయి (షేర్ ఆఫ్ ట్రూత్). దానితో పాటు తుర్కియే ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ కూడా ఒకటి స్థాపించారు. దాని పేరు వెరి కేనాగి (డేటా సోర్స్) . 

అలాగే తుర్కియేలో మీడియా స్వచ్చంద సంస్థ ఇజ్లేమీడియాజ్ (ఆన్ వాచ్) వ్యవస్థాపక ఛైర్మన్ గా కూడా పని చేశారు. తను 2019 లో కేప్ టౌన్ లో గ్లోబల్ ఫ్యాక్ట్ 6, అలాగే 2022లో ఓస్లోలో గ్లోబల్ ఫ్యాక్ట్ 9 నిర్వహించారు. వీటి మధ్యలో కోవిడ్ సమయంలో అంటే 2020, 2021లో వర్చువల్ గా గ్లోబల్ ఫ్యాక్ట్ కాన్ఫరెన్సులు నిర్వహించారు. తన రిపోర్టింగ్ ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్, సిఎన్ఎన్, దెర్ స్పైగెల్, బీబీసి, వాయిస్ ఆఫ్ అమెరికా లో ప్రచురించబడింది.

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.