మేము ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఫ్యాక్ట్ చెక్ వార్తలను ప్రచురిస్తాము. అలాగే వివిధ మాధ్యమాలలో ట్రెండ్ అవుతున్న తప్పుడు కథనాలను ఫ్యాక్ట్ చెక్ చేస్తాము.
మా ఫ్యాక్ట్ చెకర్లు సమాచారాన్ని, డేటా అనలిటిక్స్, ఇంకా సంపాదకీయ సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ హాని కలిగించే వ్యాఖ్యానాలని గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మా అనుభవజ్ఞులైన సంపాదకీయ బృందం మరియు ఫ్యాక్ట్ చెకింగ్ నిపుణులు ఒక్కో క్లైమ్ వ్యాప్తిని, ఆ క్లైమ్ ప్రభావాలను అంచనా వేస్తారు.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ కింద తెలిపిన ప్రమాణాల ఆధారంగా క్లైమ్స్ ను పరిశోధిస్తారు
- బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు లేదా అందరికీ అందుబాటులో ఉండే ఆన్లైన్ మాధ్యమాలలో చేసిన వ్యాఖ్యలు
- అవి నిజామా లేక అబద్ధమా అని సరిగ్గా అంచనా వేయగలిగే వ్యాఖ్యలు
- అందరికి అందుబాటులో ఉండే, సాధారణంగా అందరూ ఒప్పుకునే ప్రమాణాల ఆధారంగా అంచనా వేయగలిగేవి
- ఇది నిజం లేదా ఇది వాస్తవం అంటూ ఇచ్చే నిశ్చిత వ్యాఖ్యలని మాత్రమే లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. నిశ్చిత వ్యాఖ్యలు అంటే అవి నిజమని ఇతరులని నమ్మించేటట్టు ఉండే వ్యాఖ్యలు.
క్లైమ్ ఎవరు చేశారు, ఏ రాజకీయ అభిప్రాయం కలిగి ఉన్నవారు చేశారు అనే దానితో నిమిత్తం లేకుండా ప్రతి క్లైమ్ ని అందుబాటులో ఉన్న అవే ఆధారాలతో అంతే క్షుణ్ణంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తాము. అన్ని రాజకీయ స్రవంతులు నుండి వచ్చే క్లైమ్స్ ని మేము ఫ్యాక్ట్ చెక్ చేస్తాము. అయితే దానర్థం ప్రతి స్రవంతి నుండి కూడా సమానమైన సంఖ్యలో చేస్తామని కాదు. కొన్నిసార్లు కొన్ని క్లైమ్స్ ని మావద్ద అప్పటికే ఉన్న ఆధారాలను ఉపయోగించి కాని లేదా భవిష్యత్తులో మాకు అందుబాటులోకి రాబోయే ఆధారాలను ఉపయోగించి కానీ నిర్ధారణ చేయలేకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి క్లైమ్స్ అభిరుచులకు సంబంధించి కాని , అప్పటివరకు నిర్ధారింపబడని చారిత్రక విషయాలకు సంబంధించినవి కానీ లేదా నైతిక/మతపరమైన విలువలకు సంబంధించినవై ఉంటాయి.
ఏదైనా క్లైమ్ ని నిర్ధారించడం బాధ్యతారాహిత్యమని భావిస్తే అటువంటివాటిని మేము ఫ్యాక్ట్ చెక్ చెయ్యము. మాకు ఆ విషయాల పట్ల నైపుణ్యం లేకపోవటం లేదా ఆ క్లైమ్ కి సంబంధించిన నేపధ్యాన్ని అందించే సామర్ధ్యం లేకపోవడం లాంటివి అందుకు కారణం. ఇలా ఒక నేపధ్యం లేకుండా లేదా నిర్ధారించే నైపుణ్యం లేకుండా ఫ్యాక్ట్ చేస్తే అది అంతిమంగా మేము ఆ క్లైమ్ తప్పా ఒప్పా అని చెప్పటంలో ఏ మాత్రం సహాయపడదు. మేము ట్రోల్స్ తో ఎంగేజ్ అవ్వము. ఆలాగే నిర్ధారించక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు తప్ప మేము ప్రమాదకర కుట్ర సిద్ధాంతాలకి కూడా దూరంగా ఉంటాము.
మేము ఫ్యాక్ట్ చెక్ చేయడానికి మీరు కూడా క్లైమ్స్ సబ్మిట్ చేయడాన్ని మేము ప్రోత్సాహిస్తున్నాము. ఈ ఫాం ద్వారా మీరు మాకు క్లైమ్ ని పంపిస్తే, అది పైన పేర్కొన్న ఆంచనాలకి తగ్గట్టు ఉంటే, మా బృందం ఆ క్లైమ్ ని ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు మా సామాజిక మాధ్యమ అకౌంట్ల ద్వారా మాకు ఈ ఫలానా క్లైమ్ ఫ్యాక్ట్ చేయమని సూచనలు అందుతా ఉంటాయి.