హోమ్ విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ ఆడియోని వాడి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైటు ను ప్రచారం చేస్తున్నారు

విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ ఆడియోని వాడి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైటు ను ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రాహుల్ అధికారి

అక్టోబర్ 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో విరాట్ కోహ్లీ ఆన్లైన్ లో బెట్టింగ్ ప్రచారం అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో విరాట్ కోహ్లీ ఆన్లైన్ లో బెట్టింగ్ ప్రచారం అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియోలో విరాట్ కోహ్లీ తన తండ్రి మరణం గురించి, తన భార్య ను కలవటం గురించి, తన జీవితం లో వచ్చిన మార్పుల గురించి తెలియజేసాడు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో విరాట్ కోహ్లీ ఒక బెట్టింగ్ ప్లాట్ ఫార్మ్ ను ప్రచారం చేస్తున్నట్టు వైరల్ అవుతుంది. ఇందులో కోహ్లీ మాట్లాడుతూ, తన జీవితాన్ని ‘Unicon365’ అనే వెబ్సైటు మార్చేసింది అని అంటున్నట్టు ఉంది.

ఒక టివి ప్రముఖుడు, హాస్య నటుడు ద్యానిష్ సైత్ కోహ్లీ ని “మీ జీవితం లో మలుపు తిరిగిన క్షణాలు ఏమైనా మాతో పంచుకోగలరా” అన్న ప్రశ్న అడగటం చూడవచ్చు. దీనికి సమాధానంగా, “నా జీవితం లో అలాంటి క్షణం అంటే నేను  Unicon365 ఆడటం మొదలు పెట్టినప్పటి నుండే. దీనిలో అధికంగా డబ్బు సంభాదించవచ్చు. నేను కొన్ని కోట్ల రూపాయలు ఇందులో సంపాదించాను. యునికార్న్ కి ధన్యవాదాలు, నేను నా మొదటి ఆడి కార్ ను కుడా ఆ డబ్బుతోనే కొన్నాను. ఇది కచ్చితంగా ఒక మలుపు తిరిగిన సంఘటన.”

ఈ వీడియోకి శీర్షిక గా, “✅ 5% Bonus on Every Deposit ✅ Rs.100 Min ID ✅ Multiple Payment Gateways, 1M+ Users.” ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో కుడా షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే, ఈ క్లెయిమ్ తప్పు. వైరల్  అవుతున్న వీడియో కి డీప్‌ఫేక్ ఆడియో జోడించబడింది. అసలు వీడియో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాడ్‌కాస్ట్ నుండి తీసుకున్నారు.

వాస్తవం ఏమిటి? 

ఈ వీడియో లో కోహ్లీ మరియు వక్త ఇద్దరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోగో ఉన్న దుస్తులు ధరించడం మేము గమించాము. దీని ద్వారా, రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు యూట్యూబ్ ఛానల్ లో 2023 లో పరచించిన వీడియోని గుర్తించాము (ఆర్కైవ్ ఇక్కడ). RCB తన ఛానల్ లో క్రికెటర్లకు సంబంధించి ఒక పోడ్కాస్ట్ ను ప్రచారం చేస్తుంది.

ఈ పోడ్కాస్ట్ 46:20 నిమిషాలు ఉంది, ఇందులో నుండి 43:36 నుండి 44:41 వరకు వైరల్ అవుతున్న క్లిప్ ని తీసినట్టుగా తెలిస్తుంది. దీనిని మార్చి వైరల్ క్లిప్ కు డీప్ఫేక్ ఆడియోని జోడించారు.

ఒరిజినల్ వీడియోలో సైత్ అడిగిన ప్రశ్నకు, కోహ్లీ, అనుష్క ను కలవటం తన జీవితం లో మలుపు తిరిగిన క్షణం అని తెలియజేసారు. ఏ బెట్టింగ్ అప్ గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించలేదు. ఇందులో నుంచి ‘ నా జీవితం లో మలుపు తిరిగిన క్షణం’ అనే భాగం తీసుకుని, డీప్ ఫేక్ ఆడియోని జోడించారు.

ఈ ఆడియో ని తీక్షణం గా పరీక్షిస్తే, ఇది కోహ్లీ గొంతులాగా వినపడినప్పటికీ, ఈ గొంతు సహజంగా అనిపించదు, ఒక రోబో మాదిరి ఉంటుంది, ఒక మానవ గొంతుక లో ఉండే విధమైన మెళుకువలు ఇందులో మనకు కనిపించవు. దీని ద్వారా ఇది కృత్రిమంగా తాయారు చేసి ఉండవచ్చు అని మనకు అర్ధమవుతుంది.

నిజంగా కోహ్లీ అలాంటి బెట్టింగ్ ప్రచారం గురించి ఏమైనా చేశారా అని వెతికాము, దానికి ఆధారాలు ఏమి మాకు లభించలేదు.

భారత దేశం లో యునికార్న్ అనేది అధికారికంగా ఉందా?

భారత రాజ్యాంగం, ఏడవ షెడ్యూల్ రెండవ లిస్ట్ ద్వారా జూదాలు మరియు బెట్టింగ్ లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికం చేయగలిగే పవర్ ఉంటుంది.

2022లో సుప్రీమ్ కోర్ట్ ఫాంటసీ స్పోర్ట్స్ ను స్కిల్ గేమ్ వలే గుర్తించింది, కానీ దీని వలన లైవ్ స్పోర్ట్ పైన బెట్టింగ్ వేయడానికి అర్హత ఏమి ఉండదు. పైగా 2023లో భారత ప్రభుత్వం 22 ఇల్లీగల్ బెట్టింగ్  వెబ్సైటు లను బ్యాన్ చేసింది.

Unicon365 అనేది eCOGRA, అనే ఒక లండన్ కి చెందిన సంస్థ ద్వారా సర్టిఫై అయింది. కానీ భారత దేశం లో ఇది ప్రత్యేక్షంగా పని చెయ్యదు.

తీర్పు 

విరాట్ కోహ్లీ ఆడియో కి డీప్ ఫేక్ ఆడియో ని జోడించి, తప్పుగా Unicon365 అనే బెట్టింగ్ ఆప్ ను ప్రచారం చేస్తున్నట్టు షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా )

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.