ద్వారా: మొహమ్మద్ సల్మాన్
అక్టోబర్ 15 2024
వైరల్ వీడియోలో హుడా మోహము మసకగా కనపడటం లాంటి అవకతవకలు మనకి ఈ వీడియో కృత్రిమంగా తాయారు చేసి ఉండొచ్చు అని అర్ధమవుతుంది.
క్లెయిమ్ ఏమిటి?
రోహ్తక్ పార్లమెంట్ సభ్యుడు దీపేందర్ హుడా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హత్తుకుంటున్నట్టు గా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియో హుడా ఎక్స్ అకౌంట్ (పూర్వపు ట్విట్టర్) వివరాలు కూడా ఉండటం తో ఇది ఆయనే తన అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు గా అనిపిస్తుంది.
ఒక వెరిఫీడ్ ఎక్స్ యూసర్, KK Nehra ఈ వీడియోని షేర్ చేసి, శీర్షిక గా “ఏంటి బ్రదర్? కొన్ని సార్లు ప్రియాంక గాంధీ, కొన్ని సార్లు దీపేందర్ హుడా. . .” అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే మరి కొందరు కుడా పోస్టులు షేర్ చేసారు, వాటి ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
కానీ మా పరిశోధన ప్రకారం, ఈ వీడియో కృత్రిమ మేధా సంపత్తి ద్వారా తయారు చేసినది అని కనుగొన్నము.
వాస్తవం ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియోని క్షున్నంగా పరిశీలిస్తే, కొన్ని అవకతవకలు మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు, హుడా చెయ్యి, హత్తుకోకముందే రాహుల్ గాంధీ వెనకాల ఉన్నట్టుగా కనిపిస్తుంది, మరో ఫ్రేమ్ లో హుడా రాహుల్ గాంధీ వైపుగా ఉన్నా కూడా ఆయన ఎడుమ చెయ్యి ఇంకా కార్ తలుపు వద్దే కనిపిస్తుంది. పైగా, గాంధీ వద్దకు వస్తున్న సమయం లో హుడా మోహము మసక బారి నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ, ఈ వీడియో కృత్రిమంగా చేసి ఉండొచ్చు అనడానికి సంకేతాలు.
వీడియోలో కనిపిస్తున్న అవకతవకలు (సౌజన్యం : ఎక్స్)
ఆన్లైన్ లో ఇద్దరు వ్యక్తులు హత్తుకుంటున్నట్టుగా వీడియోలు సృష్టించడానికి ‘ఏఐ హగ్ జనరేటర్’ లాంటి అనేక డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఈ వీడియోను ఏ పరికరం వాడి తాయారు చేసిఉండొచ్చు అనేది మాత్రం మేము కనిపెట్టలేదు.
ఆ వీడియోలో ‘@Paltupaltann’ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాటర్ మార్క్ ను మేము గమనించాము (ఆర్కైవ్ ఇక్కడ). కానీ ఆ అకౌంట్ లో ఈ క్లిప్ డిలీట్ చేయబడింది. ఆ అకౌంట్ లో ఈ విధంగా రాహుల్ గాంధీ ని ఇతర కాంగ్రెస్ నాయకులతో జోడించి అనేక వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో గురించి మేము ఆ అకౌంట్ గలా వ్యక్తిని సంప్రదించాము, స్పందన వచ్చిన వెంటనే ఈ కథనం లో పొందుపరుస్తాము.
ఒరిజినల్ ఫొటో ఎప్పటిది?
ఒరిజినల్ ఫొటోని మేము హుడా సామాజిక మాధ్యమ అకౌంట్ లో చూసాము, దీనిని అక్టోబర్ 1, 2024 నాడు ఎన్నికల ప్రచార సమయం లో పోస్ట్ చెయ్తడం జరిగింది. హర్యానా ఎన్నికల సమయం లో హర్యానా విజయ్ సంకల్ప్ యాత్ర చేయటం జరిగింది. ఈ ఫొటోని షేర్ చేస్తూ, హుడా దీనికి శీర్షిక గా, “మన నాయకుడు” అని పోస్ట్ చేసారు. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ తన తల పాగా ను సర్దుకుంటుంటే, హుడా తనను చూడటం మనం చూడవచ్చు (ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ).
ఈ వీడియోని మేము రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో కుడా చూసాము (ఆర్కైవ్ ఇక్కడ). ఇందులో ఒక నిమిషం సమయం వద్ద, హుడా రాహుల్ గాంధీకి తన తల పాగా చుట్టుకోవడం లో సహాయం చేయటం మనం చూడవచ్చు. ఇందులో ఎక్కడా కూడా, ఈ కాంగ్రెస్ నాయకులు హత్తుకోవటం కానీ ముద్దు పెట్టుకోవటం కానీ మనకు కనపడదు.
పైగా, పంజాబ్ కేసరి పాత్రికేయుడు, అమన్దీప్ పిల్లనియా షేర్ చేసిన మరో వీడియోలో కుడా హుడా రాహుల్ గాంధీకి సహాయం చేయటం చూడవచ్చు. ఈ వీడియోను ముందు నుండి తీసినది, ఇందులో హుడా చెయ్యి కార్ తలుపు వద్దనే ఉంటుంది, ఇక్కడ మనం వైరల్ వీడియో మాదిరి విజుఅల్స్ ఎక్కడ కనపడవు (ఆర్కైవ్).
తీర్పు
మా పరిశోధన ప్రకారం, వైరల్ అవుతున్న వీడియో ఫేక్. అసలైన వీడియోలో రాహుల్ గాంధీ, దీపేందర్ హుడా హత్తుకుంటున్నట్టు ఎక్కడా కనపడరు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)