ద్వారా: రాజేశ్వరి పరస
ఆగస్టు 23 2024
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ వీడియో తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా లో తలమడుగు లో జరిగినట్టుగా కనుగొంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించినది కాదు.
క్లెయిమ్ ఏమిటి ?
కొంత మంది వ్యక్తులు సి ఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఒక పాడెను మోసుకెళ్తున్న 19 సెకెన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేసి, ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలు అన్నట్టుగా షేర్ చేస్తున్నారు.
ఆ పోస్టుకు శీర్షిక గా, “సైకిల్ కి ఇంత తొందరగా పాడి కడతారు అని అనుకొలేదు. సూపర్ సిక్స్ మాట తప్పుతాడని తెలిసి కూడా కుప్పం ప్రజలు గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతటా ఇలా సిఎం డౌన్ డౌన్ అంటూ కేకలు పెడుతున్నారు.” అని ఉంది. అలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ సూపర్ సిక్స్ అనేది, ఆంధ్ర ప్రదేశ్ లో నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలలో ఒకటి, ఇందులో భాగంగా ఉద్యోగ కల్పన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలగు వాగ్ధానాలు ఉన్నాయి. ఈ కూటమి లో ముఖ్య భాగమైన తెలుగు దేశం పార్టీ (టిడిపి) తమ పార్టీ గుర్తు సైకిల్.
అయితే, వైరల్ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు, ఇది తెలంగాణ లో రైతులు రుణ మాఫీ సంబంధించి చేసిన నిరసన కి చెందిన వీడియో.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న వీడియోని తెలంగాణ లో జరిగిన ఘటనగా అనేక అకౌంట్లు సామాజిక మాధ్యమాలలో షేర్ చేసినట్టు తెలుస్తుంది.
ఆగష్టు 17, 2024 నాడు తెలంగాణ లో ప్రతి పక్ష పార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ, ఒక 19 సెకెన్ల నిడివి గల వీడియోని షేర్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ), ఈ పోస్టులో, రైతులు రుణ మాఫీ అందనందుకు గాను నిరసన చేసినట్టు పేర్కొంది. ఈ వీడియోకి శీర్షిక గా, ఆదిలాబాద్ లోని తలమడుగు గ్రామం లో తెలంగాణ ముఖ్య మంత్రి దిష్టి బొమ్మకు పాడి కట్టి ఊరేగించారు అని ఉంది.
గూగుల్ సెర్చ్ చేయగా, మరిన్ని వార్త కథనాలు ఈ సంఘటన జరిగినట్టుగా నిర్ధారించాయి. ఇండియా టుడే కథనం ప్రకారం, ఆగష్టు 17 నాడు, తలమడుగులో కొంత మంది రైతులకు రుణ మాఫీ అవ్వకపోవటం తో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను శవ యాత్ర లాగా ఊరేగించారు. ఈ కథనం లో వైరల్ క్లిప్ పోలిన వీడియో ఉంది.
టి న్యూస్ లాంటి స్థానిక మీడియా చానళ్ళు కుడా ఈ నిరసనల గురించి ప్రచురించాయి. తెలంగాణ టుడే ప్రచురించిన కథనం ప్రకారం, రేవంత్ రెడ్డి ని అవమాన పరించినందుకు గాను ఆగష్టు 17 నాడు 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా కుడా తెలుస్తుంది.
గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ నిరసనలు జరిగిన స్థలాన్ని మేము జియోలొకేట్ చేశాము, వైరల్ వీడియోలో ‘ZPHS’ జిల్లా పరిషత్ హై స్కూల్ అని రాసి ఉండటం గమనించాము. వైరల్ వీడియో తలమడుగు లోని అంబేద్కర్ మెయిన్ రోడ్ లో తీశారని గమనించాము. గూగుల్ మ్యాప్స్ లో కుడా అదే మాదిరి, ఆకు పచ్చ బోర్డు, కాషాయ రంగు గోడలు మరియు ముదురు గోధుమ రంగు గేటు చూశాము. ఆకు పచ్చ బోర్డు మీరు, తెలంగాణ క్రీడా ప్రాంగణము, తలమడుగు అని రాసి ఉంది.
వైరల్ వీడియో మరియు గూగుల్ మ్యాప్స్ లో ఉన్న లొకేషన్ కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/గూగుల్ మ్యాప్స్)
తీర్పు :
వైరల్ అవుతున్న వీడియో తెలంగాణ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి నిరసనగా రైతులు ఆగష్టు 17 నాడు చేసిన ‘శవయాత్ర’ కి చెందిన వీడియో. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధం లేదు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)