హోమ్ కోల్కతాలో జరిగిన దాడికి మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు

కోల్కతాలో జరిగిన దాడికి మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: రాజేశ్వరి పరస

సెప్టెంబర్ 13 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక ముస్లిం బాలుడు హిందూ బాలికపై దాడి చేసాడు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ తో పాటు దాడి కి సంభందించినది అంటూ షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఒక ముస్లిం బాలుడు హిందూ బాలికపై దాడి చేసాడు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కోల్కతా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, అవిజిత్ దత్త మరియు రిషికేయిత్ పాల్ అనే వ్యక్తులు ఇందులో నిందితులుగా పేర్కొన్నారు.

క్లెయిమ్ ఏమిటి?

36 సెకెన్ల నిడివి గల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది, ఇందులో ఒక వ్యక్తి పై  చుట్టుపక్కన ఉన్న వారు దాడి చేస్తుంటే, పక్కన రక్తపు మడుగులో కూర్చుని ఉన్న ఒక యువతిని మనం చూడవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తూ, ఒక ముస్లిం వ్యక్తి, మరొక హిందూ యువతి పై ఈ విధంగా పట్ట పగలే దాడి చేశారు అని రాసుకొచ్చారు.

పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ నేత మరియు పార్టీ మైనారిటీ సెల్ సభ్యురాలైన, నజియా ఇలాహి ఖాన్ ఈ వీడియోని పోస్ట్ చేసి, ఈ విధంగా పోస్ట్ చేసారు, “ చుడండి, ఒక ముస్లిం బాలుడు ఆ విధంగా ఒక హిందూ బాలికపై పట్ట పగలే దాడి చేస్తున్నాడో. హిందువులు మమతా రాజ్యం లో సురక్షితంగా లేరు. పశ్చిమ బెంగాల్ లో దారుణంగా ఉంది.” ఈ శీర్షిక తో పాటు, వెస్ట్ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీని మరియు కోల్కతా పోలీసులను కుడా ట్యాగ్ చేస్తూ చర్యలు తీస్కోమని కోరింది. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 1,200 పైగా రీపోస్టులు మరియు 1,700 లైక్స్ ఉన్నాయి (ఆర్కైవ్ ఇక్కడ). ఈ క్లెయిమ్ ని కొంతమంది తెలుగు లో కుడా షేర్ చేస్తున్నారు, ఆర్కైవ్ ఇక్కడ.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్లు (సౌజన్యం :ఎక్స్/ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ సంఘటనకి తప్పుగా మతరంగు పులిమారు. నిజానికి, ఇక్కడ నిందుతుడు మరియు గాయపడిన వ్యక్తి ఇద్దరు హిందూ మతానికి చెందిన వారే.  

వాస్తవం ఏమిటి? 

కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, టైమ్స్ అఫ్ ఇండియా ప్రచురించిన కథనం ఒకటి లభించింది, ఇందులో వైరల్ వీడియో కి చెందిన ఫొటో కుడా ఉంది. సెప్టెంబర్ 5 నాడు, ప్రచురితమైన ఈ కథనం ప్రకారం, అసభ్య పదజాలం వాడిన కారణంగా ఒక యువతి చెంప దెబ్బ కొట్టింది అనే నెపం తో “అభిజీత్ దత్త” ఆ 14 సంవత్సరాల యువతిని ఒక పదునైన ఆయుధం తో దాడి చేసాడు. ఈ సంఘటన ప్రఫుల్ల నగర్ లో బారాక్పోర్ కమిషనరేట్ లో ఉన్న బెల్ఘేరియా పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. కోల్కతా అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం రాజధాని.

కథనం ప్రకారం, యువతి మరియు ఆమె తల్లి కుడా ఈ దాడి లో గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కన ఉన్న వారు, నిండుతుంది పై రోడ్డు మీద దాడి చేశారు, అనంతరం సోయతప్పుగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్నే టెలిగ్రాఫ్ ఇండియా కథనం కుడా పేర్కొంది. 

సెప్టెంబర్ 5, 2024 నాడు, బారాక్పోర్ పోలీసులు కుడా తమ ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేసారు (ఆర్కైవ్ ఇక్కడ). ఈ పోస్టు ప్రకారం, ఒక యువతి పై పదునైన ఆయుధం తో దాడి చేసిన కారణంగా ఒక యువకుడి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు.




లాజికల్లీ ఫ్యాక్ట్స్ బారాక్పోర్ పోలీసుల వెబ్సైటు నుండి ఎఫ్ ఐ ఆర్ ను సంపాదించింది, దీని ప్రకారం, నిందితుల పేర్లు, అవిజిత్ దత్త, రిషికేయిత్ పాల్ మరియు అయిదుగురు గుర్తు తెలియని తెలియని వ్యక్తుల పేర్లు రాసి ఉన్నాయి.

బారాక్పోర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ (సౌజన్యం : స్క్రీన్ షాట్/బారాక్పోర్ పోలీసులు)

ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, నిందితుల పై హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపు, మరియు పిల్లల పై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం కింద కేసు నమోదు చేసారు (POCSO Act).  

బాధితురాలి తండ్రి ఈ విషయమై సెప్టెంబర్ 4 నాడు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇందులో, తన భార్య, ఇద్దరు పిల్లలతో మధ్యాహ్న సమయం లో తిరిగి వస్తున్న వేళ, అవిజిట్ దత్త అనే వ్యక్తి ఒక పదునైన ఆయుధం తో దాడి చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదు లో, దత్త మరియు రిషికేయిత్ పాల్ అనే వ్యక్తులు ఇంతకు మునుపు తమ కుమార్తెను బెదిరించి నట్టు తెలియజేసారు. ఈ దాడి జరిగిన రోజున, ప్రమాదకర స్థితిలో ఆమెను ఆసుపత్రి లో చేర్చినట్టు తెలిపారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ బెల్ఘేరియా పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా, వారి నుండి స్పందన రావాల్సి ఉంది.

తీర్పు

కోల్కతా లో జరిగిన ఒక దాడి కి సంభందించిన ఘటనను, తప్పుగా మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు. ఈ సంఘటన లో దాడి చేసిన వ్యక్తి, గాయ పడిన వ్యక్తి, ఇద్దరు, హిందూ మతానికి చెందిన వారే.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.