హోమ్ జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారి 44 అంటూ వైరల్ అవుతున్న వీడియో చైనా లోనిది

జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారి 44 అంటూ వైరల్ అవుతున్న వీడియో చైనా లోనిది

ద్వారా: వనితా గణేష్

అక్టోబర్ 7 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కొంత మంది యూజర్లు సామాజి సామాజిక మాధ్యమాలలో యూజర్లు చైనా వంతెనను జమ్మూ కాశ్మీర్ వంతెన అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ వీడియోలో ఉన్నది చైనా లోని బెపాన్జియాంగ్ బ్రిడ్జి, ఇది యున్నన్ మరియు గ్విజ్హౌ ప్రాంతాలను కలుపుతుంది. ఇది భారతదేశానికి సంభందించినది కాదు.

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో జమ్మూ కాశ్మీర్ కు సంబంధిచిన జాతీయ రహదారి 44 అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ 14 సెకెన్ల వీడియోలో జమ్మూ కాశ్మీర్ లోని  లేహ్, పత్నిటాప్, బారాముల్లా మరియు సాంబ అనే ప్రాంతాల పేర్లు కుడా ఉన్నాయి. 

ఎక్స్ప్లోరర్ భారత్ అనే ఒక ఒక వెరిఫైడ్ ఎక్స్ యూజర్, ఈ వీడియోని షేర్ చేస్తూ “జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే 44,” అని షేర్ చేసారు. ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ కు 38,800 షేర్స్ మరియు 16,000 లైక్స్ వచ్చాయి.

ఈ వీడియోను దివ్య భాస్కర్ అను గుజరాతీ బాషా వార్త పత్రిక కుడా ఇది జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన వీడియో అంటూ ప్రచురించింది. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్టులను ఇక్కడ ,ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు.

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈ వీడియో వైరల్ అవుతుంది, ఈ ఎన్నికలు మూడు విడదతల వారి గా సెప్టెంబర్ 18 నుండి అక్టోబరు 1 వరకు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు అక్టోబరు 5 నాడు వెలువడుతాయి.

కానీ ఆ వీడియో చైనా సంబంధించినది, జమ్మూ కాశ్మీర్ కు ఎటువంటి సంబంధం లేదు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా సెప్టెంబర్ 9, 2020 నాడు పీపుల్స్ డైలీ చైనా ప్రచురించిన ఒక వీడియో లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఇందులో వైరల్ వీడియో మాదిరి గానే ఉన్న వంతెన ఒకటి కనిపించింది. ఇక్కడ ఇచ్చిన వివరణ ప్రకారం, ఇది బెపాన్జియాంగ్ బ్రిడ్జి, ఇది యున్నన్ మరియు గ్విజ్హౌ ప్రాంతాలను కలుపుతుంది.

వైరల్ వీడియో మరియు పీపుల్స్ డైలీ చైనా కథనం మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ పీపుల్స్ డైలీ చైనా)

ఈ సమాచారం ఆధారంగా మేము మరో చైనా డైలీ కథనం కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ), ఇందులో కుడా వైరల్ వీడియోలో ఉన్న కట్టడం మాకు కనిపించింది. ఈ 2018 కథనం ప్రకారం ఈ వంతెన ప్రపంచం లోనే అత్యంత ఎతైన వంతెన గా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు ఎక్కింది, దీని పొడవు 565.4 మీటర్లు, పొడవు 720 మీటర్లు. ఇతర వార్తా కథనాలు ఈ బ్రిడ్జిని దూగే బ్రిడ్జి గా ఇది నైరుతి చైనా లో ఉన్నట్టుగా పేర్కొన్నాయి. 

ఈ వంతెనను గూగుల్ మ్యాప్స్ ద్వారా (ఆర్కైవ్ ఇక్కడ) మేము కనుగొన్నాము, ఈ వంతెన కింద ఉన్న నదిని బెపాన్ జియాంగ్ గా పేర్కొన్నారు. దీని ద్వారా, ఈ వంతెన కచ్చితంగా భారతదేశానికి సంభందించింది కాదు అని అర్ధమవుతుంది. 

మేము జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారి 44 పై ఎటువంటి వంతెననైన నిర్మిస్తున్నారు అని వెతికాము, ఇక్కడ చీనాబ్ నది వద్ద ఒక నాలుగు లైన్ల రాంబాన్ వయ డెక్ట్ అనే రోడ్డు కడుతున్నప్పటికీ ఇది ఎక్కడాను వైరల్ వీడియో మాదిరి కట్టడం లా కనిపించదు.

2023 లో నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖా మంత్రి ఈ రోడ్డు కు సంభందించి ఫోటోలు కుడా తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసారు, కానీ వైరల్ వీడియో మాదిరి ఇక్కడ మనకి ఏ విధమైన కేబుల్స్ కానీ కాషాయ రంగు కానీ కనపడదు. (ఆర్కైవ్ ఇక్కడ)

జమ్మూ కాశ్మీర్ లోని నిర్మాణం మరియు వైరల్ వీడియోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/నితిన్ గడ్కరీ) 

తీర్పు

చైనా లోని బెపాన్జియాంగ్ వంతెనను తప్పుగా జమ్మూ కాశ్మీర్ లోని 44 వ రహదారి గా షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.