హోమ్ హైడ్రా పై నిరసన వీడియో అంటూ షేర్ చేసిన వీడియో రాజస్థాన్ కి చెందినది

హైడ్రా పై నిరసన వీడియో అంటూ షేర్ చేసిన వీడియో రాజస్థాన్ కి చెందినది

ద్వారా: రాజేశ్వరి పరస

అక్టోబర్ 4 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇది హైడ్రా పై నిరసనల వీడియో అంటూ సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వీడియోని షేర్ చేసి ఇది హైడ్రా పై నిరసనల వీడియోలా షేర్ చేసారు (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

రాజస్థాన్ లో భూ వివాదానికి సంభందించిన వీడియోని తప్పుగా తెలంగాణ లో హైడ్రా పై నిరసన లాగ షేర్ చేసారు.

క్లెయిమ్ ఏమిటి?

కొంతమంది వ్యక్తులు ఒక బుల్ డోజర్ వెనుక కర్రల తో తరుముతున్న ఒక 15 సెకెన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతుంది. దీనిని షేర్ చేసి, ఇది తెలంగాణ లోని ఆక్రమణల నిరోధ సంస్థ హైడ్రా పై నిరసన వీడియో అంటూ రాసుకొచ్చారు.

ఒక ఎక్స్ యూసర్ ఈ వీడియోని షేర్ చేసి, “హైడ్రా ను హడలెత్తిస్తున్న ప్రజలు....ప్రజల్లో మార్పు మొదలయ్యింది..ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరుముడే . . . “అంటూ రాసుకొచ్చారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్న పోస్ట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ వింగ్, దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో జులై 2024 నాడు ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని నీటి వనరులను పునరుద్దించడానికి ఈ ఏజెన్సీ ని ఏర్పాటు చేసారు.

హైడ్రా కు ఈమధ్యనే నీటి వనరుల చుట్టూ ఉండే బఫర్ జోన్స్ మరియు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉండే కట్టడాలను కూల్చే చట్టపరమైన అధికారం ఏర్పడింది. సెప్టెంబర్ నెలలో హైడ్రా అనేకమైన నిర్మాణ దశలో ఉన్న కట్టడాలను కూల్చివేసింది, దీని వలన కొన్ని చోట్ల నిరసనలు కుడా మొదలయ్యాయి.


కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది, ఎందుకంటే, ఇది హైడ్రా కి విరుద్దంగా జరిగిన నిరసన వీడియో కాదు, ఇది రాజస్థాన్ కి చెందిన వీడియో.

మేము ఏమి కనుగొన్నాము ?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, సెప్టెంబర్ 22, 2024 నాడు ప్రచురితమైన ఇండియా టుడే కథనం ఒకటి లభించింది. ఇందులో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కుడా ఉంది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియోని రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లా లోని రూపంగఢ్ లో తీసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం లో ఒక స్థలాన్ని ఆ ఊరి పెద్ద లీస్ కు ఇవ్వగా, ఆ విషయం లో లొసుగులు ఉన్న కారణంగా రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు అని కథనం పేర్కొంది. 

పైగా సెప్టెంబర్ 22, నాడు ఒక వర్గం, బుల్ డోజర్ ను తీసుకుని, ఆ స్ధలానికి వెళ్లగా, గొడవ మొదలయ్యింది. ది హిందూ కథనం ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ పేల్చగా, ఒక వ్యక్తికి బులెట్ గాయమై మరణించాడు.

వైరల్ వీడియో మరియు ది హిందూ ప్రచురించిన ఫొటో కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ ది హిందూ)

అనేక వార్త సంస్థలు కుడా ఈ సంఘటనను గురించి కథనాలు రాశాయి. ఆజ్ తక్, ఏ బి పి కుడా ఇలాంటి వివరాలే సమకూర్చాయి. వీటిలో కుడా వైరల్ వీడియో కి చెందిన వీడియోనే ఉంది.

పైగా అజ్మీర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓం ప్రకాష్ మేగ్వాల్ ఈ సంఘటనకు సంభందించి పత్రిక ప్రకటన కుడా చేసారు. ఎక్స్ లో సెప్టెంబర్ 22, 2024 నాడు ఐ ఏ ఎన్ ఎస్ దీనిని షేర్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ). మేగ్వాల్ మాట్లాడుతూ, ఈ ఘటనలో గాయపడిన ఒక వ్యక్తికీ చికిత్స జరుగుతుంది అని తెలిపి, ఒక జేసీబీ, రెండు కార్లు సీజ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అని కుడా తెలిపారు.


హైడ్రా పై నిరసనలు జారుతున్న కుడా, అక్టోబర్ 4, 2024 నాటికి మాత్రం, ఈ విధమైన నిరసన జరిగినట్టుగా ఎక్కడ కథనాలు కనపడలేదు.

తీర్పు 

రాజస్థాన్ లో భూ వివాదానికి సంభందించిన వీడియోని తప్పుగా తెలంగాణ లోని ఆక్రమణల వ్యతిరేక సంస్థ  హైడ్రా పై నిరసనలు అంటూ షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)



ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.