హోమ్ పాత వీడియోని పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కి ఎగుమతి అయిన ఉల్లిపాయలుగా షేర్ చేసారు

పాత వీడియోని పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కి ఎగుమతి అయిన ఉల్లిపాయలుగా షేర్ చేసారు

ద్వారా: అంకిత కులకర్ణి

సెప్టెంబర్ 17 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నుండి దిగుమతి అయిన ఉల్లిపాయలలో రాళ్లు అని షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్. పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కు దిగుమతి అయిన ఉల్లిపాయలలో రాళ్లు అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ వీడియో 2020 లో టర్కీ మరియు ఈజిప్ట్ దేశాల నుండి బంగ్లాదేశ్ కు ఎగుమతి అయిన ఉల్లిపాయల సంచి లో రాళ్లు కనపడిన సందర్భం లోనిది, పాకిస్థాన్ కి సంబంధం లేదు.

క్లెయిమ్ ఏమిటి?

ఉల్లిపాయల మధ్యలో రాళ్ల కుప్ప ఉన్న ఒక 42- సెకెన్ల వీడియోని, సామజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ, ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కి దిగుమతి అయిన ఉల్లిపాయలలో ఈ విధంగా రాళ్లు వచ్చినట్టుగా షేర్ చేసారు. వీడియో పైన బంగ్లా లో రాసి ఉన్న శీర్షికను అనువదిస్తే, “పాకిస్థాన్ నుండి వచ్చే ఒకొక్క ఉల్లిపాయ సంచిలో దాదాపుగా 3-4 కేజీల వరకు రాళ్లు వస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మేము సోదరులం కాబట్టి, ఫిర్యాదులు ఏమిలేవు .”

ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) పోస్టును హిందీ శీర్షికతో ఈ విధంగా షేర్ చేసారు,“బంగ్లాదేశ్ ఫండమెంటలిజం దిశగా సాగుతుంది, అందుకనే భారతదేశం నుండి ఉత్పత్తుల దిగుమతి ఆపేసి, పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు అందరు సోదరులు కాబట్టి. ఇప్పుడు పాకిస్థాన్ నుండి వచ్చిన ఉల్లిపాయ సంచులలో రాళ్లు వస్తున్నాయి. ఈ విధమైన క్లెయిమ్స్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లో కుడా షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)  

ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనం ప్రకారం, గత సంవత్సరం భారత దేశం బంగ్లాదేశ్ కు ఉల్లిపాయల ఎగుమతిని తాత్కాలికంగా ఆపివేసింది, ఆ సమయం లో పాకిస్థాన్, టర్కీ తో సహా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంది. ఈ కథనం ప్రకారం, ఆ సమయంలో బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్ల వలన కుడా భారత దేశం ఉల్లిపాయల ఎగుమతులను ఆపి ఉండవచ్చు అని తెలిపింది. ఇప్పుడు అలాంటి నిబంధనలు ఏమి లేనందువలన, బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత దేశం, పాకిస్థాన్ మరియు ఇతర దేశాల నుండి కుడా ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుంది.

కానీ వైరల్ అవుతున్న వీడియో మాత్రం 2020 నాటిది, ప్రస్తుత పరిస్థితులతో సంభందం లేదు.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 11 నాడు, 2020 లో సోమోయ్ టీవీ, అనే బంగ్లాదేశీ ఛానల్ లో ప్రసారమైన వీడియో ఒకటి లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియో వైరల్ క్లిప్ మాదిరి గానే ఉంది, ఈ ప్రదేశాన్ని చట్టోగ్రామ్ గా పేర్కొన్నారు. ఈ వీడియో ప్రకారం టర్కీ మరియు ఈజిప్ట్ నుండి చట్టోగ్రామ్ ఖాతూన్గంజ్ సెంటర్ కి వచ్చిన ఉల్లిపాయలతో రాళ్లు ఉన్నట్టు పేర్కొంది. ఇందులో, రాళ్ళ తో పాటుగా ఇతర చెత్త పేర్కోవటం వలన వ్యాపార నష్టం కలిగింది అని ఉంది.

ఈ వీడియోలో ఉల్లిపాయల సంచులలో రాళ్లు కనపడటం గురించి ప్రస్తావన కుడా ఉంది. భారత దేశం ఉల్లిపాయల ఎగుమతి ఆపేసిన తరువాత, ఈజిప్ట్ మరియు టర్కీ  సహా 11 దేశాల నుండి ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నట్టుగా పేర్కొన్నారు.

అదే విధంగా, యూట్యూబ్ లో న్యూస్ 24 ఛానల్ మార్చ్ 2, 2021 నాడు మరొక వీడియో కథనం ప్రచురిత మైంది (ఆర్కైవ్ ఇక్కడ), ఇందులో కుడా టర్కీ నుండి వచ్చిన ఉల్లిపాయ సంచులలో రాళ్ళ గురించి ప్రస్తావన ఉంది. 

పైగా, పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కు ఎగుమతి అయిన ఉల్లిపాయలలో రాళ్ల గురించి ఏవైనా వార్త కథనాలు ఉన్నాయా అని వెతికితే అలాంటిది ఏమి మాకు లభించలేదు. సెప్టెంబర్ 1, 2024 నాడు బంగ్లా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్ కు భారతదేశం, చైనా, పాకిస్తాన్, ఈజిప్ట్ మరియు థాయిలాండ్ నుండి చట్టోగ్రామ్ ఓడరేవు ద్వారా ఉల్లిపాయలు దిగుమతి అయినట్టు తెలుస్తుంది, కానీ రాళ్ల ప్రస్తావన ఏమి లేదు.

తీర్పు

వైరల్ అవుతున్న వీడియో కనీసం మూడు సంవత్సరాల కిందట టర్కీ మరియు ఈజిప్ట్ నుండి బంగ్లాదేశ్ కు ఉల్లిపాయల ఎగుమతి జరిగిన సంధర్భం లోనిది. దీనిని తప్పుగా, పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ కు ఉల్లిపాయల వీడియో అంటూ షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.