హోమ్ ఎం కే స్టాలిన్ సతీమణి ప్రపంచం లోనే అతి పెద్ద వెండి బీరువా కొనలేదు

ఎం కే స్టాలిన్ సతీమణి ప్రపంచం లోనే అతి పెద్ద వెండి బీరువా కొనలేదు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

నవంబర్ 6 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక వెండి బీరువాని చూపించి ఇది తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ భార్య కి చెందినది అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఒక వెండి బీరువాని చూపించి ఇది తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ భార్య కి చెందినది అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వెండి బీరువా తాయారు చేసిన శుక్రా జ్యూవెలరీ సి ఈ ఓ నితిన్ కల్కిరాజు ఈ బీరువా దుర్గా స్టాలిన్ కి చెందినది కాదు అని స్పష్టం చేసారు.

క్లెయిమ్ ఏమిటి? 

సామాజిక మాధ్యమాలలో ఒక వెండి బీరువా కి సంభందించిన వీడియోని చూపించి, ఇది తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కే స్టాలిన్, సతీమణి దుర్గా స్టాలిన్ కి చెందిన బీరువా అంటూ షేర్ చేస్తున్నారు. పైగా, ఈ బీరువాను అనధికారంగా సంపాదించినా ఆస్తి తో కొన్నారు అంటూ రాసుకొస్తున్నారు. 

ఒక ఎక్స్ యూజర్ ఈ 35 సెకెన్ల వీడియోను షేర్ చేసి, “తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్  భార్య చేయించుకున్న వెండి బీరువా. ఇదీ నేటితరం ప్రాంతీయ పార్టీల (కుటుంబ పార్టీల) అవినీతి సంపాధనల పైశాచికత్వం. తండ్రి కొడుకులు సనాతన ధర్మాన్ని అంతం చేయాలి చూస్తారు ఆవిడ మాత్రం సనాతన ధర్మాన్ని పాటిస్తుంది,” అంటూ రాసుకొచ్చారు.

సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 


ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు, ఈ పోస్టు వాట్సాప్ లో కూడా వైరల్ అవుతుంది.

వాట్సాప్ లో షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : వాట్సాప్)

కానీ వైరల్ వీడియోలో కనపడుతున్నది, శుక్రా జ్యూవెలరీ తాయారు చేసిన బీరువా, దీనిని కేవలం ఆవిష్కరించడానికి మాత్రమే దుర్గా స్టాలిన్ వెళ్ళటం జరిగింది.

మేము ఏమి కనుగొన్నాము? 

వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, DT Next వార్త కథనం ఒకటి లభించింది, ఇందులో కూడా వైరల్ వీడియో మాదిరి ఫొటో ప్రచురించి ఉంది, ఇందులో స్టాలిన్ ఒక సర్టిఫికెట్ ను ప్రదర్శించటం మనం చూడవచ్చు. ఈ కథనం ప్రకారం, ఆ వెండి బీరువా, చెన్నై లోని శుక్రా జ్యూవెలరీ తాయారు చేసారు, దీనికి ప్రపంచ గిన్నిస్ రికార్డు పొందిన ఘనత ఉంది అని తెలుస్తుంది.

వార్తా కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : డి టి నెక్స్ట్)

ఈ కథనంలో శుక్రా జ్యూవెలరీ తమ సంస్థకు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా ఒక ఏడు అడుగుల మూడు అంగుళాల బీరువాను 92.5 శాతం వెండితో తాయారు చేసింది అని పేర్కొంది. NBA 24x7 మరియు ఇతర తమిళ్ మీడియా సంస్థలు కూడా  ఈ కథనం గురించి ప్రచురించాయి.  (ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ). 

పైగా, శుక్రా జ్యూవెలరీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా ఈ విషయాన్నీ స్పష్టం చేసారు. ఒక పోస్టులో, దుర్గా స్టాలిన్ కంపెనీ సి ఈ ఓ నితిన్ కల్కిరాజు కు అక్టోబర్ 22, 2024 నాడు గిన్నిస్ సర్టిఫికెట్ ఇవ్వటం చూడవచ్చు (ఆర్కైవ్ ఇక్కడ).

శుక్రా జ్యూవెలరీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్)

గిన్నిస్ ప్రపంచ రికార్డు అధికారిక వెబ్సైటు లో కూడా శుక్రా జ్యూవెలరీ సంస్థను, ఈ వెండి బీరువా తయారీ నేపథ్యం లో ప్రపంచ రికార్డు హోల్డర్ గా గుర్తించింది. దీని తయారీలో వాడిన ప్రతి పదార్థం, అంటే నట్టులు మరియు బోల్టుల తో సహా వెండి మాత్రమే ఉపయోగించి చేశారు. ప్రస్తుతం ఈ బీరువాని శుక్రా జ్యూవెలరీ తమ చెన్నై షో రూమ్ లో నిల్వ ఉంచారు. 

గిన్నిస్ ప్రపంచ రికార్డు వెబ్సైటు స్క్రీన్ షాట్ (సోర్స్ : గిన్నిస్ ప్రపంచ రికార్డు)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ కల్కిరాజు ను సంప్రదించింది, ఆయన మాట్లాడుతూ, ఈ బీరువా దుర్గా స్టాలిన్ కి చెందిన బీరువా కాదు అని స్పష్టం చేశారు. పైగా, ఈ బీరువాకు వచ్చిన గిన్నిస్ ప్రపంచ రికార్డు గురించి తెలియజేసి, దీనిని ఎవరు కొనుగోలు చేయటానికి వీలు లేదు అని తెలిపారు. 

సి ఈ ఓ మాట్లాడుతూ, అనేక వార్తా సంస్థలు కూడా దుర్గా స్టాలిన్ తమ షో రూమ్ కు విచ్చేయటం గురించి ప్రచురించినట్టుగా తెలిపారు. ఇది తమ మూడవ రికార్డు అని కూడా స్పష్టం చేసారు.


తీర్పు 


వైరల్ వీడియోలో కనిపిస్తున్న వెండి బీరువాను శుక్రా జ్యూవెల్లరీ వారు తాయారు చేసారు, దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. దీనిని, తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కే స్టాలిన్ సతీమణి అక్టోబర్ 22, 2024 నాడు ఆవిష్కరించారు. అంతేకాని, ఇది ఆవిడ సొంత బీరువా కాదు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

Read the fact check in English here.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.