హోమ్ బాబా సిద్ధిక్ మరణాంతరం బీహార్ ఎంపీ ఏడ్చినట్టుగా సంభంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు

బాబా సిద్ధిక్ మరణాంతరం బీహార్ ఎంపీ ఏడ్చినట్టుగా సంభంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు

ద్వారా: అంకిత కులకర్ణి

అక్టోబర్ 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సామాజిక మాధ్యమాలలో బాబా సిద్ధిక్ మరణాంతరం పప్పు యాదవ్ కన్నీరు పెట్టుకున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో బాబా సిద్ధిక్ మరణాంతరం పప్పు యాదవ్ కన్నీరు పెట్టుకున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న వీడియో 2018 లో పప్పు యాదవ్ పైన కొంత మంది నిరసనకారులు దాడి చేసిన నాటిది. సిద్ధిక్ మరణానికి సంభంధం లేదు.

క్లెయిమ్ ఏమిటి?

పప్పు యాదవ్ గా పిలువబడే బీహార్ పార్లమెంట్ సభ్యుడు రాజేష్ రంజన్ ఉన్న ఒక 13 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇందులో, యాదవ్ కన్నీరు పెట్టుకుంటూ మీడియా తో మాట్లాడటం మనం చూడవచ్చు. ఈ వీడియోని షేర్ చేసి, బాబా సిద్ధిక్ మరణాంతరం యాదవ్ కన్నీరు పెట్టుకున్నట్టుగా షేర్ చేసారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 66 సంవత్సరాల సిద్ధిక్ ను ముంబై లోని బాంద్రా లో తన కొడుకు జీషాన్ సిద్ధిక్ ఆఫీసు బయట అక్టోబర్ 12 నాడు తుపాకీ తో కాల్చి చంపారు. భారత దేశానికి చెందిన లారెన్స్ బిష్ణోయ్ అనే ఒక గ్యాంగ్ ఈ హత్య చేసినట్టుగా ప్రకటించింది.  

ఈ హత్య అనంతరం, యాదవ్ తన ఎక్స్ అకౌంట్ లో చట్టం అనుమతిస్తే బిష్ణోయ్ ముఠాని 24 గంటల్లో నాశనం చేయగలను’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేపధ్యం లో పై వీడియో వైరల్ అవుతుంది. యాదవ్ కార్ లో నుండి పాత్రికేయులతో మాట్లాడుతూ, “వాళ్ళు ఎంతగా దాడి చేశారో నేను చెప్పలేను” అని హిందీ లో అనడం మనకు వినిపిస్తుంది.

ఒక ఎక్స్ యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ, “పప్పు యాదవ్ ఈరోజు సాయంత్రం లారెన్స్ బిష్ణోయ్ ను హతమార్చనున్నాడు, దారిలో ఎవరన్నా దాడి చేశారేమో, గట్టిగా ఏడుస్తున్నారు.” అంటూ #BabaSiddiqueShotDead అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడారు. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఫేస్బుక్ లో కుడా ఈ వీడియోను షేర్ చెయ్యటం జరిగింది, వాటి ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


కానీ మా పరిశోధన పరికరం, వైరల్ అవుతున్న వీడియో సిద్ధిక్ మరణానికి ముందే ఆన్లైన్ లో ఉంది. 

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు ది క్విన్ట్ హిందీ సెప్టెంబర్ 6, 2018 నాడు అప్లోడ్ చేసిన ఒక వీడియో లభించింది (ఆర్కైవ్ ఇక్కడ).

ఈ వీడియోకి వివరణ లో, భారత్ బంద్ అనంతరం నిరసన కారుల దాడి తరువత పాత్రికేయులతో మాట్లాడుతూ యాదవ్ కన్నీరు పెట్టుకున్నారు. ఇందులో వైరల్ అవుతున్న క్లిప్ ను 0:39 సెకెన్ల వద్ద చూడవచ్చు.


ది క్విన్ట్ హిందీ సెప్టెంబర్ 6, 2018 నాడు అప్లోడ్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : యూట్యూబ్)


మరో 2018 నాటి ఎన్డీటీవీ కథనం ప్రకారం, సెప్టెంబర్ 6 నాడు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు చట్టం లో చేసిన సవరణకు గాను దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. యాదవ్ మీడియా తో మాట్లాడుతూ, యాదవ్ మహిళలలు భద్రత పై ఒక వాకతాన్ కు వెళ్తుండగా, తనపై కొంత మంది నిరసనకారులు దాడి చేసినట్టు తెలిపారు. ఈ కథనం లో యాదవ్ కార్ లో కుర్చీని మాట్లాడిన ఫొటో ఉంటుంది. ఇది వైరల్ వీడియో మాదిరిగానే ఉంటుంది. 

ఏబిపి లైవ్, అమర్ ఉజాలా లాంటి ఇతర మీడియా సంస్థల కథనాలు ప్రకారం, యాదవ్ ముజాఫ్ఫార్పూర్ లో ఉన్నప్పుడు నిరసనకారులు దాడి చేసారు. కానీ ఏ ఎన్ ఐ అనే వార్త సంస్థతో మాట్లాడుతూ, యాదవ్ పై అలాంటి దాడి ఏది జరగలేదు అని ఎస్ పి పేర్కొన్నారు. 

అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి?

షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ జాతుల వేధింపుల నిరోధక చట్టం లో వచ్చిన మారుప్లకు నిరసనగా సెప్టెంబర్ 2018 లో 35 ఆధిపత్య కులాల వారు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. అప్పట్లో రాజ్య సభ సుప్రీమ్ కోర్ట్ తీర్పు ను రద్దు చేస్తూ ఒక బిల్ ను జారీ చేసింది. ఈ విషయమై నిరసనలు వెల్లువెత్తాయి.

తీర్పు 

2018 లో బీహార్ పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్ కన్నీరు పెట్టుకున్న వీడియోను తప్పుగా, ఇటీవల కాలం లో బాబా సిద్ధిక్ మరణానికి జోడిస్తూ షేర్ చేసారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.