హోమ్ రాహుల్ గాంధీతో ఒక కాశ్మీరీ మహిళ మాట్లాడుతున్న పాత వీడియోని అసంధర్బంగా షేర్ చేసారు

రాహుల్ గాంధీతో ఒక కాశ్మీరీ మహిళ మాట్లాడుతున్న పాత వీడియోని అసంధర్బంగా షేర్ చేసారు

ద్వారా: తాహిల్ అలీ

సెప్టెంబర్ 27 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాహుల్ గాంధీని ఒక కాశ్మీరీ పండిట్ మహిళ నిలదీసింది అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ ఒక కాశ్మీరీ పండిట్ మహిళ రాహుల్ గాంధీని నిలదీసింది అంటూ షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కాశ్మీరీ మహిళ తన కష్టాన్ని రాహుల్ గాంధీ కలిసినపుడు చెప్పుకున్నారు, కానీ అది రాహుల్ గాంధీని కాశ్మీరీలను పట్టించుకోనందుకు గాను ఆయనను తిట్టినట్టు చూపారు.

క్లెయిమ్ ఏమిటి? 

భారతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఒక మహిళ మాట్లాడుతున్న వీడియోని షేర్ చేసి, ఆవిడ రాహుల్ గాంధీని కాశ్మీరీ హిందువుల సమస్యలను పట్టించుకోవట్లేదు అని నిందిస్తున్నట్టు రాసుకొచ్చారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ కి సంభందించి తీసుకునే పాలసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నందుకు నిలదీసినట్టుగా కుడా పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ హిందీలో మాట్లాడుతూ, “మా పిల్లలు ఇళ్లలో నుండి బయటకి రాలేకపోతున్నారు. మా అన్నయ్యకి గుండె జబ్బు, అయినా తమ పిల్లల్ని వెతుక్కుంటూ బయటకి వెళ్ళాడు, కానీ పది రోజుల నుండి కనపడటం లేదు. చాలా కష్టమైన పరిస్థితులలో ఉన్నాము,” అని అనటమే మనం వినవచ్చు.

ఒక ఎక్స్ యూసర్ ఈ వీడియోని షేర్ చేస్తూ, “విదేశాలలో ఉంటున్న కాశ్మీరీ పండితులు రాహుల్ గాంధీని ఫ్లైట్లో చుట్టుముట్టి, కాశ్మీర్ కి సంభందించిన విషయాలలో ఎందుకు మోదీని అడ్డుకుంటున్నారు అని నిలదీశారు. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పలేకపోయారు, కానీ జాతీయ మీడియా ఈ వార్తను చూపదు.” (హిందీ అనువాదం).

ఈ కథనం రాసే సమయానికి, ఆ పోస్టుకు 537,000 వ్యూస్ మరియు 19,000 లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోని భారతీయ జనతా పార్టీ చండీగఢ్ జనరల్ సెక్రటరీ అమిత్ జిందాల్ కుడా ఇదే క్లెయిమ్ తో షేర్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ)

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో ఆగష్టు 2019 నాటిది, ఇందులో ఒక మహిళ ఆర్టికల్ 370 తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో తనకి ఎదురైన కష్టాల గురించి తెలియజేస్తుంది.

వాస్తవం ఏమిటి? 

సరైన కీ వర్డ్స్ ద్వారా సెర్చ్ చేయగా, మాకు ఈ సంఘటనకు సంభందించి ఆగష్టు 2019 లో వచ్చిన అనేక వీడియోలు, వార్త కథనాలు లభించాయి (ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ).

ఆగష్టు 25, 2019 నాడు ప్రచురించబడిన ఒక ఇండియాటుడే కథనం ప్రకారం, శ్రీనగర్ ఫ్లైట్ లో ఒక కాశ్మీరీ మహిళ వీడియో వైరల్ అయింది, ఈ వీడియోని కాంగ్రెస్ ప్రతినిధి షేర్ చేసారు. ఈ వీడియోలో, కాశ్మీర్ ప్రాంతంలో ఆర్టికల్ 370 తీసేసిన తరువాత అక్కడ ఉండే వారి జీవితలలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఆ ప్రాంతం లో ఎటువంటి హద్దులు పెట్టారు అనే అంశం గురించి ఉంది.

వార్తా కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇండియా టుడే)

ఈ కథనం ప్రకారం, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న శ్రీనగర్ తో ఢిల్లీ ఫ్లైట్ లోనే ఆ మహిళ కుడా ప్రయాణిస్తుంది. కాశ్మీర్ పర్యటనకు అనుమతి నిరాకరించటం తో రాహుల్ గాంధీ, గులాం నబి ఆజాద్, ఆనంద్ శర్మ, కె సి వేణుగోపాల్ తో సహా 12 మంది ప్రతిపక్ష నాయకులు శ్రీనగర్ నుండి వెనుదిరిగి వస్తున్నారు. వీరందరూ, ఆర్టికల్ 370 అక్కడ తీసేసిన తరువాత పరిస్థితి ఎలా ఉందొ తెలుసుకుందామని వెళ్లారు. 

మేము ఇదే వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) ప్రియాంక గాంధీ రీ-షేర్ చేసిన ఒక ఎక్స్ (ఆర్కైవ్ ఇక్కడ) పోస్టులో కుడా చూసాము. ప్రియాంక గాంధీ ఆగష్టు 25, 2019 నాడు షేర్ చేస్తూ, “ఇంకెంత కాలం ఇలా కొనసాగుతుంది? జాతీయవాదం పేరుతో గొంతు నొక్కేస్తున్న లక్షల్లో ఒకరి గాధ ఇది. ప్రతిపక్షం ఈ విషయాన్నీ రాజకీయం చేస్తుంది అనే వారికి ఇది.”


వీడియోలో (ఆర్కైవ్ ఇక్కడ), ఆ మహిళ మాట్లాడుతూ, “మా పిల్లలు ఇళ్లలో నుండి బయటకి రాలేకపోతున్నారు. మా అన్నయ్య కి గుండె జబ్బు, అయినా తమ పిల్లల్ని వెతుక్కుంటూ బయటకి వెళ్ళాడు, కానీ పది రోజుల నుండి కనపడటం లేదు. నేను మా అన్నయని నా వెంట తీసుకొద్దాం అనుకుంటే, ఆయనని రానివ్వలేదు,” ఈ సంభాషణలో ఎక్కడా కుడా మోదీ విధానాల గురించి కానీ, కాశ్మీరీ పండిట్స్ గురించి ప్రస్తావన రాలేదు. కాశ్మీరీ పండిత్స్ అనే వారు ఆ ప్రాంతం లో తక్కువ సంఖ్యలో ఉన్న హిందూ మైనారిటీ వర్గానికి చెందిన వారు. 

తీర్పు

వీడియోలో కాశ్మీరీ మహిళ ఆ ప్రాంతంలో ఆర్టికల్ 370 ని 2019 లో రద్దు చేసిన తరువాత, ఆ ప్రాంత ప్రజల కష్టాల గురించి రాహుల్ గాంధీ కి చెప్తుంది. ఇందులో రాహుల్ గాంధీని నిందిస్తునట్టు కానీ, ప్రధాని మోదీ ప్రస్తావన కానీ లేదు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.