ద్వారా: మొహమ్మద్ సల్మాన్
నవంబర్ 11 2024
ఈ వీడియో మహారాష్ట్రకు చెందినది కాదు, ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లోని డివినిటీ హోమ్స్ సొసైటీ కి చెందిన వీడియో, ఇది 2022 సమయం లోనిది.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో కొంత మంది వ్యక్తులు ఒక రెసిడెన్షియల్ సొసైటీ లో నుండి జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ హిందుత్వ కి మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేస్తున్నారు. దీనిని షేర్ చేస్తూ, ఇది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో అక్కడే ఒక రెసిడెన్షియల్ కాలనీ లో 2024 జరిగినట్టుగా షేర్ చేస్తున్నారు.
ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేసి, “మహారాష్ట్ర మూడ్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది. ఈ పోస్టుకు ఈ కథనం రాసే సమయానికి దాదాపుగా 267,000 వ్యూస్ మరియు 3,700 రీపోస్టులు, 12,000 లైక్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన అలాంటి పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోను ఫేస్బుక్ లో కూడా షేర్ చేస్తున్నారు, వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇండియా న్యూస్ అనే హిందీ న్యూస్ ఛానల్ కూడా ఈ వీడియోను మహారాష్ట్రలో జరిగినట్టుగా షేర్ చేసారు.
కానీ వైరల్ అవుతున్న వీడియో ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందినది, ఇది 2022 లో అసెంబ్లీ ఎన్నికల సమయం లో తీసిన వీడియో.
మేము ఎలా కనుగొన్నాము?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ అవుతున్న వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను వెతుకగా, విశ్వ హిందూ పరిషద్ బజరంగ్ దళ్ బ్లాక్ బంక్షోహ్ అనే ఫేస్బుక్ పేజీ మాకు లభించింది. ఇందులో ఫిబ్రవరి 15, 2022 నాడు పోస్ట్ చేసిన పోస్టులో వైరల్ అవుతున్న వీడియో ఉంది. దీనికి శీర్షికగా “ప్రభాత్ ఫేరీ కాన్పూర్ వెస్ట్” అని రాసి ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియో ఆన్లైన్ లో రెండు సంవత్సరాలకు పైగా ఉండటం తో ఇది మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యం లో తీసినది కాదు అని అర్ధమవుతుంది.
మా పరిశోధన లో వైరల్ అవుతున్న వీడియోను ఫిబ్రవరి 12, 2022 నాడు షేర్ చేసిన మరో పోస్ట్ లో కూడా కనుగొన్నాము (ఆర్కైవ్ ఇక్కడ). ఈ పోస్టులో అనేక ఫోటోలను షేర్ చేసారు. ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రభాత్ ఫెరి జై గోష్ తో ముగిసింది అని రాసి ఉంది. ఈ కార్యక్రమాన్ని, నవశీలధామ్ సొసైటీ, రతన్ ఆర్బిట్ అపార్ట్మెంట్, కన్హా శ్యామ్ అపార్ట్మెంట్, గౌతమ్ నగర్ లోని డివినిటీ హోమ్ అపార్ట్మెంట్ లో నిర్వహించినట్టు తెలిపారు.
పైన పేర్కొన్న సొసైటీ ఫొటోలను గూగుల్ లో వెతుకగా మాకు వైరల్ వీడియోను డివినిటీ హోమ్స్ సొసైటీ లో తీసినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్నీ ఈ ఫేస్బుక్ పోస్ట్ కూడా స్పష్టం చేస్తుంది.(ఆర్కైవ్ ఇక్కడ).
వైరల్ వీడియో మరియు డివినిటీ హోమ్స్ ఫేస్బుక్ పేజీ మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్)
దీని అనంతరం గూగుల్ మ్యాప్స్ లో ఈ సొసైటీ గురించి వెతుకగా, ఇది కాన్పూర్ లోని ఇందిరా నగర్ రోడ్ లో ఉందని తెలుస్తుంది.
గూగుల్ స్ట్రీట్ వ్యూ మరియు వైరల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/గూగుల్ మ్యాప్స్)
పైగా, వైరల్ వీడియో చివరన చూస్తే, ఇందులో 20 వ తారీకున ఓటు వెయ్యండి అని అభ్యర్థిస్తున్నట్టు ఉంది. దీని బట్టి, ఇది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో తీసినది అని అర్ధమవుతుంది, ఎందుకంటే ఉత్తర్ ప్రదేశ్ మూడవ విడత ఎన్నికలు ఫిబ్రవరి 20, 2022 లో 59 సీట్లకు గాను 16 జిల్లాలలో నిర్వహించారు, ఇందులో కాన్పూర్ ఒక నియోజకవర్గం.
తీర్పు
వైరల్ అవుతున్న వీడియో రెండు సంవత్సరాల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక హోసింగ్ సొసైటీ లో తీసినది, ఇది మహారాష్ట్రాకి సంబంధించినది కాదు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)