ద్వారా: ఉమ్మే కుల్సుం
అక్టోబర్ 29 2024
వైరల్ అవుతున్నది టెహ్రాన్ లో 2021 సంవత్సరంలో ఒక చమురు కార్మాగారం లో అగ్ని ప్రమాదం సంభవించిన నాటి ఫొటో
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అవుతుంది, ఇందులో కొన్ని భవనాల నడుమ మంటలు చెలరేగి, దట్టంగా పొగ కమ్ముకుని ఉండటం మనకు కనిపిస్తుంది. ఈ ఫొటోని షేర్ చేసి, అనేక మంది యూజర్లు, ఇది ఇజ్రాయెల్ దాడి అనంతరం టెహ్రాన్ లో ధ్వంసం అయిన మిలిటరీ స్థావరం అంటూ రాసుకొచ్చారు. ఒక ఫేస్బుక్ యూజర్ ఈ ఫొటోని షేర్ చేసి, “ఇరాన్ రక్షణ రంగాని చీల్చి చెండాడుతున్న ఇజ్రాయేల్. ఇరాన్ లోని రష్యన్ S-400 మరియు S-300 డిఫెన్స్ సిస్టమ్‌ల యొక్క అన్ని రాడార్‌లను ఇజ్రాయెల్ నాశనం చేసింది. భవిష్యత్తులో ఇజ్రాయెల్ చేసే దాడులను ఇరాన్ అడ్డుకోలేదు.” ఈ విధమైన క్లెయిమ్స్ తో షేర్ చేసిన మరిన్ని పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అక్టోబర్ 26, 2024 నాడు ఇజ్రాయెల్ ఇరాన్ మిలిటరీ స్థావరాల పై ఎయిర్ స్ట్రిక్స్ చేసిన నేపధ్యం లో ఈ క్లెయిమ్ వైరల్ అయింది. కథనాల ప్రకారం, గత నెలలో ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడి కి ప్రతిఘటనగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో కనిపిస్తుంది, ఈ దాడి కి సంభందించిన ఫొటో కాదు, ఇది టెహ్రాన్ లోని చమురు కార్మాగారం లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భం లోనిది.
వాస్తవం ఏమిటి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న ఫొటో అల్ జజీరా ముబాషేర్ కథనం లో జూన్ 2, 2021 నాడు ప్రచురితమైనట్టు తెలుస్తుంది. ఆ అరబిక్ కథనాన్ని అనువదించగా, ఈ ఫొటోని దక్షిణ టెహ్రాన్ లోని చమురు కార్మాగారం లో అగ్ని ప్రమాదం సంభవించినపుడు తీసినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోని, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్స్ (ఏ ఎఫ్ పి) కి ఆపాదించారు. ఇదే ఫొటోని కెనడా వార్త సంస్థ ది గ్లోబ్ అండ్ మెయిల్ కూడా జూన్ 2021 లో ప్రచురించింది. ఈ కథనం ద్వారా, ఈ ఫొటోని ఏ ఎఫ్ పి ఫొటోగ్రఫేర్ అత్తా కెనారే తీసినట్టుగా, గెట్టి ఇమేజెస్ ద్వారా పొందుపరిచినట్టు తెలుస్తుంది.
గెట్టి ఇమేజెస్ ను పరిశీలించగా (ఆర్కైవ్), ఇది జూన్ 2, 2021 నాడు తీసినట్టు తెలుస్తుంది. దీనిని వివరిస్తూ, ఈ ఫొటోని ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని చమురు కార్మాగారం లో అగ్ని ప్రమాదం సంభవించినపుడు తీసినట్టుగా పేర్కొన్నారు. పైగా, అక్కడ ఉన్న లిక్విఫైడ్ గ్యాస్ లైన్ లీక్ అవటం తో పేలుడు సంభవించింది అని తెలిపారు. ఇది ఫొటోని ఏ ఎఫ్ పి ఆర్కైవ్ కుడా ఇదే విధమైన వివరణ తో ప్రచురించారు (ఆర్కైవ్ ఇక్కడ)
టెహ్రాన్ లో 2021 లో జరిగిన చమురు కర్మాగారం ప్రమాదాన్ని గురించి ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. రాయిటర్స్ మరియు అసోసియేటెడ్ ప్రెస్ కథనాల ప్రకారం, దక్షిణ టెహ్రాన్ లోని టోన్డ్గూయన్ పెట్రోకెమికల్ సంస్థలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ సంస్థ క్రైసిస్ మానేజ్మెంట్ హెడ్ దరజాతి కూడా అక్కడ లిక్విఫైడ్ గ్యాస్ లీక్ అవ్వటం తో ఈ సంఘటన సంభవించింది అని పేర్కొన్నారు. మరియి సి ఎన్ ఎన్ కథనం ప్రకారం, ఈ ప్రమాదం లో ఎటువంటి మరణాలు సంభవించలేదు.
తీర్పు
2021 లో దక్షిణ టెహ్రాన్ లోని చమురు కార్మాగారం లో జరిగిన ప్రమాదాన్ని చూపుతూ, ఇది ఈ మధ్య కాలం లో ఇజ్రాయెల్ టెహ్రాన్ దాడులకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.
(అనువాదం : రాజేశ్వరి పరసా)
Read the English version here