హోమ్ రామాయణంకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని క్లిప్ చేసి వైరల్ చేశారు

రామాయణంకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని క్లిప్ చేసి వైరల్ చేశారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్

ఆగస్టు 18 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రామాయణంకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని క్లిప్ చేసి వైరల్ చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

లోక్ సభలో రాహుల్ గాంధీ రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే అర్థం వచ్చేటట్టు ఈ క్లిప్ ని సందర్భరహితంగా షేర్ చేశారు.

నేపధ్యం

ఈశాన్య భారతంలోని మణిపూర్ లో నెలకొన్న అశాంతికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో ఆగస్ట్ 9, 2023 నాడు రాహుల్ గాంధీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం అనంతరం సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. లోక్ సభలో రామాయణం గురించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెబుతూ ఈ క్లిప్ ని షేర్ చేశారు. 

ఎక్స్ (ఇంతకమునుపు ట్విట్టర్) లో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. ఇందులో రాహుల్ గాంధీ “సోదర సోదరీమణులారా, హనుమంతుడు లంకకి నిప్పు పెట్టలేదు”, అని మాట్లాడుతున్న ఆడియో ఉంది. ఈ క్లిప్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 153000కి పైగా వ్యూస్, 500 కి పైగా రీపోస్ట్స్ ఉన్నాయి. 

ఈ వీడియోని ఎక్స్ లో భారీగా షేర్ చేస్తున్నారు. (మూలం: ఎక్స్/మిస్టర్. సిన్హా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది క్లిప్ చేసిన వీడియో అని, ఈ క్లిప్ ని సందర్భరహితంగా చేస్తున్నారని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొంది. 

వాస్తవం

యూట్యూబ్ లో రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగం కోసం చూడగా ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన 31:04 నిమిషాలు నిడివి గల వీడియో మాకు లభించింది. “బీజేపి  మణిపూర్ లో భారత మాతని హత్య చేసింది| పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగం”, అన్న శీర్షికతో ఈ వీడియో ఉంది. 

మరింత నిడివి గల రాహుల్ గాంధీ ప్రసంగం యూట్యూబ్ లో ఉంది. (మూలం: రాహుల్ గాంధీ/యూట్యూబ్)

రామాయణం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన నేపధ్యం మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో 29:57 దగ్గర రాహుల్ గాంధీ “రావణుడు ఇద్దరి మాటలు వినేవాడు. వాళ్ళు మేఘనాధుడు, కుంభకర్ణుడు. అలాగే నరేంద్ర మోదీ కూడా ఇద్దరి మాటలు మాత్రమే వింటాడు. వాళ్ళు అమిత్ షా, అదాని”, అని అంటారు. 

దీని తరువాత, “హనుమంతుడు లంకకి నిప్పు పెట్టలేదు, రావణుడి అహంకారం కారణంగా లంక తగలబడింది”, అని రాహుల్ గాంధీ అన్నారు. అప్పుడే స్పీకర్ బిర్లా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అయితే రాహుల్ గాంధీ తన ప్రసంగం కొనసాగిస్తూ, “రాముడు రావణుడిని చంపలేదు. రావణుడి అహంకారమే తన చావుకి కారణం అయ్యింది”, అని అన్నారు. హనుమంతుడు లంకకి నిప్పు పెట్టలేదు, రాముడు రావణుడిని చంపలేదు అని అనటం ద్వారా రాహుల్ గాంధీ ప్రజల విశ్వాసాలని కించపరచలేదు. ఆయన కేవలం ఒక పోలిక గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. 

రాహుల్ గాంధీ ప్రసంగం సంసద్ టివి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో కూడా ఉంది. 36:58 నిమిషాల నిడివి గల ఈ వీడియోకి “రాహుల్ గాంధీ వ్యాఖ్యలు| అవిశ్వాస తీర్మానం మీద చర్చ|09 ఆగస్ట్ 2023”, అనే శీర్షిక పెట్టారు. ఈ వీడియోలో వైరల్ అయిన క్లిప్ 35:30 టైమ్ స్టాంప్ దగ్గర ఉంది. లోక్ సభలో రాహుల్ గాంధీ రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెబుతూ షేర్ చేసిన ఈ క్లిప్ సందర్భరహితమైనదని మనకి దీని ద్వారా కూడా తెలుస్తుంది. 

వాస్తవం

లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తి వీడియో చూస్తే రామాయణం గురించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ప్రచారం చేయటానికి ఈ వైరల్ క్లిప్ ని సందర్భరహితంగా షేర్ చేశారని మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.