హోమ్ తెలంగాణా సచివాలయం దగ్గర, ముఖ్యమంత్రి దేవాలయం మరియు చర్చిని కూడా ప్రారంభించారు, ఒక్క మసీదు మాత్రమే కాదు

తెలంగాణా సచివాలయం దగ్గర, ముఖ్యమంత్రి దేవాలయం మరియు చర్చిని కూడా ప్రారంభించారు, ఒక్క మసీదు మాత్రమే కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

సెప్టెంబర్ 12 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణా సచివాలయం దగ్గర, ముఖ్యమంత్రి దేవాలయం మరియు చర్చిని కూడా ప్రారంభించారు, ఒక్క మసీదు మాత్రమే కాదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

మసీదుతో సహ తెలంగాణా ప్రభుత్వం ఒక దేవాలయాన్ని మరియు ఒక చర్చిని కూడా ప్రారంభించింది, ఇవి అన్నీ సచివాలయం బయటే ఉన్నాయి.

క్లెయిమ్ ఏమిటి ?

తెలంగాణా ప్రభుత్వం సచివాలయం లో నూతనంగా ఒక మసీదు కట్టి ప్రారంభించింది అంటూ సామాజిక మాధ్యమాలలో కొన్ని క్లైమ్స్ వైరల్ అయ్యాయి. మసీదు కట్టడం అనేది నిజమే అయినప్పటికీ, ఈ విషయాన్ని మతరంగు పులిమి ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఒక హిందీ పోస్ట్ X (ఇంతకుమునుపు ట్విటర్) లో ఇలా షేర్ చేశారు. అది అనువదిస్తే ఇలా అర్ధం వస్తుంది, “తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు ఒక కొత్త మసీదు ని ప్రారంభించారు. స్వార్థపూరిత మయిన మరియు ముస్లింలను బుజ్జగించే పార్టీలకు మీరు వోటు వేస్తే ఇలాంటివే చూస్తారు. మిమ్మల్ని దేశంలో నుంచి వెళ్లిపొమ్మనే పరిస్థితి కూడా వస్తుంది ఒక రోజు, అప్పుడు ఎక్కడికి వెళతారు, ఆలోచించండి.”

ఆ పోస్ట్ లో ఒక వీడియో కూడా జోడించి ఉంది. అందులో, తెలంగాణాలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), యం ఎల్ ఏ అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, సచివాలయం వద్ద మసీదు కట్టడం పై వారి పార్టీ కి ఉన్న నమ్మకం గురించి మాట్లాడారు. ఆ తరువాత ఆ వీడియో లో ముఖ్యమంత్రి కె సి ఆర్, గవర్నర్ తమిలిసాయి సౌందరరాజన్ మరియు ఇతర సిబ్బందిచే మసీదు ప్రారంభం ఫూటేజ్ ఉంది.  ఆ వీడియోలో కె సి ఆర్ మసీదు ప్రారంభ సమయంలో సొధరభావం గురించి, అది వారి మధ్య నిలుపడానికి వారి ప్రభుత్వం చేసే ప్రయత్నం గురించి మాట్లాడారు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లైమ్స్ (సౌజన్యం : ఫేస్బుక్/X)

ఇలాంటి వ్యాఖ్యలతోనే ముస్లింల బుజ్జగింపు చేస్తున్నారు అనే ఆరోపణతో  మసీదు కట్టడానికి ముడిపెడుతూ, బి జె పి సంబందిత యూసర్లు కూడా సామాజిక మాధ్యమలలో కన్నడ లో కూడా షేర్ చేశారు. ఆ పేజీ కి 69,000 ఫాలోవర్స్ ఉండగా, ఈ ఒక్క పోస్ట్ కె 6,300 వ్యూస్ కూడా ఉన్నాయి. 

ఆయినప్పటికి ఇవన్నీ తప్పుధోవ పట్టించేటట్టు ఉన్నాయి.

నిజం ఏమిటి ? 

ఇండియా టుడే రాసిన కథనం ప్రకారం, తెలంగాణా ప్రభుత్వం ఆగస్టు 25, 2023న నూతనంగా నిర్మించిన సచివాలయ ప్రాంగణంలో ఒక మసీదు, దేవాలయం మరియు చర్చిని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు, గవర్నర్ తమిలిసాయి సౌందరరాజన్  మరియు ఇతర మత-పెద్దల సమక్షంలో ఈ మూడింటి ప్రారంభ కార్యక్రమం ఒకే రోజు చోటు చేసుకున్నాయి. 

టి న్యూస్ తెలుగు అనే వార్తా సంస్థ కూడా దీనిని లైవ్ లో చూపించింది. మనం ఆ లైవ్ కార్యక్రమం మొదట్లో, ఒక హిందూ పూజ తో దేవాలయ ప్రారంభం జరిగింది అని చూడవచ్చు. మసీదును ప్రారంభించే కార్యక్రమం, 3:17:08న, మరియు చర్చిని ప్రారంభించే కార్యక్రమం, 7:59:38న చూడవచ్చు. ఎన్ టి వి తెలుగు చానెల్ కూడా చర్చి ప్రారంభించటాన్ని ఆగస్టు 25 న వారి యూట్యూబ్ చానెల్ లో ప్రసారం చేశారు, ఇందులో ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు, గవర్నర్ తమిలిసాయి సౌందరరాజన్ వారి సమక్షంలో ఒక పాస్టర్ మాట్లాడడం కూడా చూడవచ్చు.  వార్తా కథనాలు దీనిని ఏకీవభిస్తూ ప్రచురించబడ్డాయి. ఎన్ డి టి వి కథనం ప్రకారం, ఆగస్టు 25న మూడు ప్రార్థన మందిరాలో వివిధ మత ప్రార్థనలు జరిగాయి అని కూడా రాసుకొచ్చాయి. 

లాజికల్లీ ఫాక్ట్స్ కూడా సెప్టెంబర్ 11న  ఖైరతాబాద్ లో ఉన్న డా. బి ఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయానికి వెళ్ళి, ఈ మూడు ప్రార్థన మందిరాలు సచివాలయం బయట ఉన్నాయి అని గుర్తించింది. ఈ కట్టడాలు అన్నీ, సాధారణ ప్రజలకు అందుబాటులో వారు విచ్చేయడానికి వీలుగా బయట నిర్మించి ఉన్నాయి. 

తెలంగాణా సచివాలయం వద్ద ఉన్న మసీదు మరియు చర్చి (లాజికల్లీ ఫాక్ట్స్ వారి ఫోటోలు)

అక్కడ గమనించగ చర్చి మరియు మసీదు సచివాలయనికి వెనకాల కట్టబడి ఉన్నాయి, మరియు దేవాలయం, ఖైరతాబాద్ రోడ్డు మీదగా సచివాలయనికి కుడి పక్క ఉంది. ఈ చర్చి మరియు మసీదు ఉన్న వరుస లోనే, ఒక ఫైర్ స్టేషన్ మరియు సచివాలయ పోలీస్ సిబ్బందికి ఇచ్చే వసతి గృహాలు కూడా ఉన్నాయి. దేవాలయం ఉన్న మరో పక్క వరుస లో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. 

సచివాలయం పక్కన ఉన్న దేవాలయం (లాజికల్లీ ఫాక్ట్స్ వారి ఫోటోలు )

తీర్పు

తెలంగాణ ప్రభుత్వం సచివాలయ ప్రాంగణంలో చర్చి, దేవాలయం కూడా కట్టింది, ఒక మసీదు మాత్రమే కాదు. సచివాలయంలో మసీదు కట్టడం అనే వార్త మత రంగు పులిమి ప్రచారం జరుగుతుంది. కనుక మేము దీనిని తప్పుధోవ పట్టించేవిధంగా ఉంది అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.