ద్వారా: ప్రభాను దాస్
సెప్టెంబర్ 30 2024
అధికారిక సమాచారం ప్రకారం అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలు కేరళ, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మరియు పంజాబ్.
క్లెయిమ్ ఏమిటి?
సామాజిక మాధ్యమాలలో కొంతమంది యూజర్లు ఒక పోస్టును షేర్ చేసి, ఇది భారతదేశం లోనే అధిక నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రాలు జాబితా అంటూ షేర్ చేసారు. ఈ జాబితా ప్రకారం, కేరళ (29.9 శాతం), గోవా (19. 1 శాతం), పంజాబ్ (18. శాతం), ఉత్తర్ ప్రదేశ్ (9.8 శాతం), వెస్ట్ బెంగాల్ (9 శాతం) మరియు తెలంగాణ (5.83 శాతం). ఈ పోస్టును షేర్ చేస్తూ కొంత మంది యూజర్లు, ప్రతిపక్ష కూటమి అయిన INDI కూటమిని విమర్శించారు.
ఇక్కడ INDI అంటే INDIA బ్లాక్ కూటమి, ప్రధాని (ఆర్కివ్) నరేంద్ర మోదీ తో సహా అగ్ర బీజేపీ నేతలు కొందరు, ఈ విధంగానే పిలుస్తారు. ఈ పోస్టులలో ‘INDI’ కూటమి తాను పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ముందుగా నిరుద్యోగాన్ని కట్టడి చెయ్యాలి అంటూ రాసుకొచ్చారు. అలాంటి పోస్టుల ఆర్కైవ్ లింకులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ ఈ వైరల్ పోస్టులో బీజేపీ పాలిత రాష్ట్రాలను వదిలేశారు.
వాస్తవం ఏమిటి?
ముందుగా, మేము వైరల్ పోస్టులో ఉన్న వివిధ రాష్ట్రాలకు నిరుద్యోగ శాతాలను అధికారిక లెక్కల ద్వారా పరిశీలించాము. ఇందుకుగాను, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సుర్వ్యే (పిఎల్ఎఫ్ఎస్) ను 15-29 సంవత్సరాల వయసు గల యువతలో ఎంత మేరకు ఉంది అని జూన్ 2023 నుండి జులై 2024 వరకు చూసాము. ఈ సమాచారాన్ని, ప్రతి సంవత్సరం, జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ ఎస్ ఎస్ ఓ) ప్రచురిస్తుంది.
వైరల్ పోస్టులో ప్రచురించిన కొన్ని సంఖ్యలు కరెక్టుగానే ఉన్నా, తెలంగాణ మరియు ఉత్తర్ ప్రదేశ్ సంఖ్యలను తప్పుగా 5.83, 9.8 గా చూపించారు, అధికారికంగా ఈ రాష్ట్రాలకు 16.6 మరియు 9.1 ఉన్నాయి.
పైగా మా పరిశోధన ప్రకారం, అధిక నిరుద్యోగం ఉన్న ఆరు రాష్ట్రాలు ఇవి :
జాతీయ స్థాయిలో నాగాలాండ్, మణిపూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు రెండు, మూడు మరియు నాలుగో స్థానాలలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు, దీని ద్వారా, వైరల్ అవుతున్న పోస్టు తప్పు అని చెప్పవచ్చు.
పైగా తక్కువ నిరుద్యోగం ఉన్న జాబితాలు చూస్తే, వెస్ట్ బెంగాల్ ( 9 శాతంతో) మరియు ఉత్తర్ ప్రదేశ్ (9. 1 శాతంతో) తొమ్మిది మరియు పదవ స్థానాలలో ఉన్నాయి. పైగా ఉద్యోగ కల్పన విషయంలో తెలంగాణ (16.6 శాతంతో) పన్నెండో స్థానంలో ఉంది.
ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనం ప్రకారం, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ తక్కువ నిరుద్యోగ రేటులో మొదటి పది స్థానాలలోనే ఉన్నాయి, దీనికి విరుద్ధంగా ఈ రెండు రాష్ట్రాలని ఎక్కువ నిరుద్యోగ శాతం ఉన్న జాబితాలో వేశారు.
రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు చూస్కుంటే, పి ఎల్ ఎఫ్ ఎస్ డేటా ప్రకారం, లక్ష్వాదీప్ 36.2 శాతం తో ఎక్కువ నిరుద్యోగ శాతం ఉంది, మధ్య ప్రదేశ్ 2.6 శాతం తో అతి తక్కువ స్థానం లో ఉంది. సెప్టెంబర్ 23, 2024 నాడు విడుదల అయిన, పి ఎల్ ఎఫ్ ఎస్ నిరుద్యోగ రేటు సమాచారాన్ని అనేక వార్త కథనాలలో ప్రచురించాయి. ఆ రిపోర్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
తీర్పు
నిరుద్యోగం గురించి వైరల్ అవుతున్న పోస్టు తాజా సమాచారాన్ని కరెక్టుగా పొందుపరచలేదు. నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల సమాచారం వైరల్ పోస్టులో లేదు, కానీ ప్రతిపక్ష కూటమి పాలన ఉన్న కొన్ని రాష్ట్రాలు, పైన పేర్కొన్న రాష్ట్రాల కంటే నిరుద్యోగంలో తక్కువ స్థాయిలో ఉన్నా కూడా వాటి పేరు పోస్టులో ఉన్నాయి.
(అనువాదం: రాజేశ్వరి పరసా)