హోమ్ ఈ వీడియో తెలుగుదేశం వ్యక్తులు ప్రభుత్వ అధికారిపై దాడి చేస్తున్న సంఘటన కాదు

ఈ వీడియో తెలుగుదేశం వ్యక్తులు ప్రభుత్వ అధికారిపై దాడి చేస్తున్న సంఘటన కాదు

ద్వారా: వనితా గణేష్

ఆగస్టు 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఈ వీడియో తెలుగుదేశం వ్యక్తులు ప్రభుత్వ అధికారిపై దాడి చేస్తున్న సంఘటన కాదు ఈ వీడియో లో కొడుతున్నది తెలుగుదేశం కార్యకర్తలు అనే క్లెయిమ్ తో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ పరిశోధన ప్రకారం, వీడియో లో కనపడుతున్న వ్యక్తి మయూర్ బోర్ధే. ఈయన స్వాభిమాని షెట్కారీసంఘటన కి చెందిన వ్యక్తి

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక నిమిషం వ్యవధి ఉన్న వీడియోని షేర్ చేసి, సంతకం పెట్టలేదని ఒక ప్రభుత్వ ఉద్యోగిని డ్యూటీ లో ఉండగా, ‘టిడిపి గుండాలు’ ఇలా కొడుతున్నారు అని షేర్ చేస్తున్నారు. ఇదే వీడియోని, షేర్ చేస్తూ, ఇంకొందరు, ఈ వీడియోలో అలా కొడుతున్నది వైఎసార్సీపి వ్యక్తి అని, ఇది మూడు సంవత్సరాల క్రితం వీడియో అని కుడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల ఆర్కైవ్ లింకులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

కానీ, ఈ వీడియోలో ఉన్నది, టిడిపి కానీ వైఎసార్సీపి వ్యక్తులు కాదు, ఎందుకంటే ఇది మహారాష్ట్ర లో బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లో చోటు చేసుకున్న ఘటన, ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆగష్టు 13, 2024 నాడు టివి9 మరాఠీ (ఆర్కైవ్ ఇక్కడ) ప్రచురించిన వీడియో ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఆ సంఘటన మహారాష్ట్ర లోని జాల్నా జిల్లా లో బ్యాంకు అఫ్ మహారాష్ట్ర యొక్క వార్రుడ్ బ్రాంచ్ లో జరిగింది.

బోర్ధే అనే ఒక స్వాభిమాని షెట్కారీ సంఘటన కి చెందిన ఒక నాయకుడు రైతులను హింసిస్తున్నాడనే నెపం తో అక్కడి బ్యాంక్ మేనేజర్ ని కొట్టడం జరిగింది. ఈ కథనంలో వైరల్ వీడియో మాదిరి వీడియోనే మనం ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ వీడియో, టివి9 మరాఠీ కథనం మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ టివి9 మరాఠీ)

మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో స్వాభిమాని షెట్కారీ సంఘటన్ అనేది ఒక రైతు సంఘం. ఆగష్టు 14, 2024 లో ప్రచురితమైన ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనం ప్రకారం, రైతుల వద్ద నుండి బోర్డే కు మేనేజర్ ప్రవర్తన పై, అతను పంట రుణాల సబ్సిడీ విషయం లో సహరించట్లేదని ఫిర్యాదులు అందటంతో బోర్డే చేయిచేసుకున్నారు. పైగా ఈ కథనంలో  మేనేజర్ పేరు ధీరేంద్ర సొంకర్ అని, ఇతడు జఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ లో బోర్డే పై పోలీస్ కంప్లైంట్ కుడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆగష్టు 14, 2024 ప్రచురితమైన టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, వైరల్ వీడియో లో కనపడేది  స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యొక్క యువకుల సంఘం అధక్ష్యుడు అని ఉంది.

జఫ్ఫారాబాద్ స్టేషన్ ఇన్-ఛార్జ్ పి వి ఇంగ్లే లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, వీడియోలో కనిపించేది బోర్ధే అని తెలియజేసారు. ఈ విషయమై విచారణ జరుగుతుంది అని తెలిపారు.

తీర్పు :

వైరల్ వీడియోలో ఉన్నది స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువకుల విభాగానికి చెందిన వ్యక్తి బ్యాంకు మేనేజర్ ని కొట్టిన వీడియో. ఇది మహారాష్ట్ర లో జరిగింది, ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించినది కాదు.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.