హోమ్ తిరుమలకు కాలి నడక మార్గాన్ని మూసివేసే ఆలోచనలు ఉన్నాయంటూ టిటిడి ఎటువంటి ప్రకటన చేయలేదు.

తిరుమలకు కాలి నడక మార్గాన్ని మూసివేసే ఆలోచనలు ఉన్నాయంటూ టిటిడి ఎటువంటి ప్రకటన చేయలేదు.

ద్వారా: రాజేశ్వరి పరస

ఆగస్టు 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తిరుమలకు కాలి నడక మార్గాన్ని మూసివేసే ఆలోచనలు ఉన్నాయంటూ టిటిడి ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఒక ఆరేళ్ళ బాలికపై చిరుత దాడి తరువాత టిటిడి కాలి నడక మార్గం మీద కేవలం కొన్ని నిబంధనలు మాత్రమే విధించింది.

నేపధ్యం

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్నటువంటి వేంకటేశ్వరస్వామి ఆలయ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలకి కాలి నడక మార్గాన్ని మూసివేయడానికి చూస్తున్నారు అంటూ సామాజిక మాధ్యమాలలో కొన్ని క్లైమ్స్ చక్కర్లు కొట్టాయి. ఆగస్టు 13వ తారీఖునఒక ఫేస్బుక్ యూజర్- సుధా చింతా- టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మా రెడ్డి ఫొటోని పెట్టి తెలుగులో ఇలా రాసుకొచ్చారు- తిరుమలకు కాలి నడక మార్గాన్ని మూసివేయాలని అనుకుంటున్నాము. పైగా “కూల్చడం, మూసేయడం ఇవే గా మీకు చేతనయ్యింది,” అని వై ఎస్ ఆర్ సి పి నాయకత్వంలో ఉన్న ఆంధ్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా అంటున్నట్టు రాసి ఉంది. ఈ నిర్ణయం హిందువులకు వ్యతిరేకం అంటూ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడా ఇలాంటి పోస్ట్ లు వాట్సాప్ లోషేర్ చేస్తున్నారు. 



సామాజిక మాద్యమాలలో చక్కర్లు కొడుతున్న క్లెయిమ్ ఫోటో  (సౌజన్యం: వాట్సాప్, ఫేస్బుక్/@ సుధా చింతా)

ఈ ఊహాగానాలన్నీ కూడా లక్షిత అనే ఆరేళ్ళ చిన్నారిపై చిరుత దాడి తరువాతే మొదలయ్యాయి. ప్రాంతీయ వార్తా సంస్థ సాక్షి ప్రకారం, లక్షిత, ఆగస్టు 11వ తేదీన తన తల్లిదండ్రులతో  కలిసి అలిపిరి కాలి నడక మార్గంలో వెళ్తుండగా తప్పిపోయింది. ఆ తరువాత రోజు పాప శవాన్ని పోలీసులు అడవిలో కొంత దూరంలో గుర్తించారు.

అయితే ఈ కాలి నడక మార్గం ఇప్పుడు భక్తులకు మూసివేస్తున్నారు అనేది నిజం కాదు. 

వాస్తవం

వెంకటేశ్వర ఆలయం తిరుమల కొండ మీద ఉండటంతో ఆలయానికి రెండు మార్గాలు ఉన్నాయి, అందులో ఒకటి అలిపిరి నుండి కాలి నడక మార్గం. మేము టిటిడి వారి అధికారిక వెబ్సైట్ చెక్ చేశాము, అందులో నడక మార్గం మూసివేయటం గురించి ఎటువంటి ప్రకటన లేదు. 

టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో లాజికల్లీ ఫాక్ట్స్ మాట్లాడింది, ఆయన తిరుమలకు కాలి నడక మార్గం మూసివేయబోతున్నాం అంటూ ఎటువంటి ప్రకటనలు చేయలేదు అని అన్నారు. అయినప్పటికీ భక్తుల భద్రత కోసం కాలి నడక మార్గంలో బందోబస్తు పెంచటం లాంటి నిబంధనలు విధించటం జరిగింది అని చెప్పారు.

ఆరేళ్ళ చిన్నారిపై చిరుత దాడి తరువాత టిటిడి వారు కొన్ని నిబంధనలు విధించారు. ది హన్స్ ఇండియా కథనం ప్రకారం వాటిలో కొన్ని నిబంధనలు ఏమనగా, 12 ఏళ్ల వయసులోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తరువాత అనుమతించక పోవడం, భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపటం, సెక్యూరిటీ సిబ్బందిని పెంచడం మొదలయినవి. 

టిటిడి వారి పత్రికా ప్రకటన నుంచి రాసిన ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం, చిన్నారులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కాలి నడక మార్గంలో మరియు శ్రీవారి మెట్ల మార్గాలలో అనుమతిస్తారు అని రాసి ఉంది.

తిరుపతిలో ఉండే ఒక ప్రాంతీయ పాత్రికేయుడు లాజికల్లీ ఫాక్ట్స్ తో మాట్లాడుతూ ప్రత్యేకంగా పరిస్థితులలో , తప్పని పరిస్థితులలో పిల్లలను కూడా పంపుతున్నారు అని తెలియజేశారు. భక్తులను కాలి నడక మార్గం లో పంపుతున్నారు అని కూడా ఆయన నిర్ధారించారు. 

టివి 5 అనే ప్రాంతీయ వార్తా ఛానల్ ఆగస్టు 18 నాడు ప్రసారం చేసిన కథనం ప్రకారం, భక్తులందరూ కూడా కాలి నడక మార్గాన్ని వాడటం మనం చూడవచ్చు. అయితే చిరుత దాడి తరువాత భక్తుల సంఖ్య తగ్గింది అంటూ కథనంలో పేర్కొన్నారు. 

సామాజిక మాద్యమాలలో చక్కర్లు కొడుతున్న క్లెయిమ్ ఫోటో  (సౌజన్యం: వాట్సాప్, ఫేస్బుక్/@సుధా చింతా 

ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే తిరుమలవెంకటేశ్వర ఆలయానికి చేరుకోవడానికి తరచుగా బస్సు మరియు జీప్ సర్విస్ లు ఘాట్ రోడ్డులో కూడా అందుబాటులోనే ఉంటాయి. కొంత మంది భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే, మరికొందరు, మెట్ల మార్గాన కాలి నడక ద్వారా అలిపిరి నుండి వెళ్తుంటారు, ఇది సుమారు 9 కిలో మీటర్ లు ఉంటుంది. 

ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం జంతువుల దాడికి భయపడి ఘాట్ రోడ్డులో ద్వి చక్ర వాహనం మీద వెళ్ళే వారిని కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ప్రయాణం చేయడానికి అనుమతిస్తున్నారు. 

తీర్పు 

టిటిడి అలిపిరి నుండి తిరుమలకు కాలి నడక మార్గాన్నిమూసివేసే ఆలోచనలు ఉన్నాయంటూ ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఆలయ సంస్థ వారు చిరుత దాడి తరువాత కొన్ని ఆంక్షలు మాత్రమే విధించారు. కనుక మేము ఇది తప్పుదోవపట్టించేటట్టు గా ఉంది అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.