హోమ్ నటి రవీనా టండన్ తాను ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టు తెలుపలేదు

నటి రవీనా టండన్ తాను ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టు తెలుపలేదు

ద్వారా: రాహుల్ అధికారి

ఏప్రిల్ 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నటి రవీనా టండన్ తాను ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టు తెలుపలేదు వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

2024 ఎన్నికలలో టాండన్ బీజేపీ కి మద్దతు తెలిపింది, కాంగ్రెస్ కి కాదు. వైరల్ అవుతున్న వీడియో 2012 లోనిది.

క్లెయిమ్ ఏమిటి?

ప్రస్తుత 2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో నటి రవీనా టాండన్ కాంగ్రెస్ కి ప్రచారం చేస్తున్నట్టుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ వీడియోలో టాండన్ హిందీలో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాలని నేను కోరుకుంటున్నాను, అందుకే వారికి మద్దతుగా నేను ప్రచారం చేస్తున్నాను. ఈ దేశానికి అభివృద్ధి అవసరం, నేను ఎల్లప్పుడూ ఈ దేశ బాగోగుల కోసం ఉంటాను,” అని అన్నారు. 

ఏప్రిల్ 26, 2024 నాడు రెండో విడత ఎన్నికలు ప్రారంభం అయ్యే ఒక్క రోజు ముందు ఈ వీడియోని ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో భాగంగా రవీనా టాండన్ కాంగ్రెస్ గెలుస్తుంది అని తెలిపారు అని ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే, ఇది పాత వీడియో.. ఇది 2012 లో గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి ప్రచారం చేసిన నాటిది.  2024 లో టాండన్ భారతీయ జనతా పార్టీ తరపున మహారాష్ట్రలోని చంద్రాపూర్ నియోజకవర్గ అభ్యర్థి కోసం ప్రచారం చేసారు. 

ఈ వీడియో గురించి మేము ఏమి కనుగొన్నము?

మేము టాండన్ మాట్లాడిన వీడియోని ఏబీపీన్యూస్ తమ యూట్యూబ్ ఛానల్ లో డిసెంబర్ 12, 2012 నాడు, “రవీనా టండాన్ వదోదరలో కాంగ్రెస్ కి ప్రచారం” అనే శీర్షిక తో పబ్లిష్ చేసిందని కనుగొన్నాం. ఇక్కడ వీడియో కింద ఇచ్చిన వివరణ ప్రకారం, టాండన్ గుజరాత్ లోని ఆకోట శాసనసభ అభ్యర్థి లలిత్ పాటిల్ అనే కాంగ్రెస్ నాయకుడి కోసం 2012 లో ప్రచారం చేసింది. ఈ వీడియో ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.

ఈ కథనం లో టాండన్ మీడియాతో మాట్లాడిన మరింత నిడివి ఉన్న వీడియో ఇక్కడ ఉంది, ఇక్కడ తాను మాట్లాడుతూ అభ్యర్థి కి అల్ ది బెస్ట్ చెప్తూ, అతను తనకు అన్న లాంటి వాడని, తనకి కాంగ్రెస్ కుడా ఈసారి కొన్ని సీట్లు గెలవాలని ఉందని, అందుకే తను మద్దతు ఇస్తున్నట్టుగా తెలిపింది. పైగా దేశానికి అభివృద్ధి కావాలని, తానెప్పుడూ అభివృద్ధి వైపే ఉంటానని కుడా తెలిపింది. 

మిగతా ఎబిపి న్యూస్ రిపోర్ట్ లో టాండన్ జనాలకి చెయ్యి ఊపుతూ, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. వైరల్ అవుతున్న క్లిప్ ఈ యూట్యూబ్ వీడియోలో 0:34 మార్క్ నుండి 0:48 మార్క్ మధ్య ఉంది.  

 అలాంటిదే మరో వీడియో ఒకటి దేశ్ గుజరాత్ హెచ్ డి అనే యూట్యూబ్ ఛానల్ లో పబ్లిష్ అయింది. ఇది ఆమె డిసెంబర్ 12, 2012 లో వదోదర లో రోడ్ షో చేస్తున్న వీడియో. ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.  

2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలలో జరిగాయి - ఒకటి డిసెంబర్ 13 మరియు ఇంకోటి డిసెంబర్ 17. మొత్తం 182 సీట్లలో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 61 సీట్లు గెలుచుకుంది. 

2024 లో కాంగ్రెస్ తరపున టండన్ ప్రచారం చేసిందా?

ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఈ ఎన్నికలలో ప్రచారం చేయలేదు. పైగా తను మహారాష్ట్రలోని బీజేపి  అభ్యర్థి కి ప్రచారం చేసింది. ఏప్రిల్ 14 నాడు పరచురితమైన టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, బీజేపీ చంద్రపూర్ అభ్యర్థి సుధీర్ ముంగంటివార్ కోసం ప్రచారం చేసారు. 

 ఏప్రిల్ 16 నాడు ముంగంటివార్ తన సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో పోస్ట్ చేసారు. (ఆర్కైవ్ ఇక్కడ) ఈ వీడియోలో టాండన్ రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలని బిజెపి కి ఓటు వేయమనడం మనం చూడవచ్చు. చంద్రపూర్ లో ఎన్నికలు మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 19 నాడు అయ్యాయి. 

 వివిధ వార్త కథనాల ప్రకారం, టాండన్ 2014 లోక్ సభ ఎన్నికలలో కుడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. కురుక్షేత్ర లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి నవీన్ జిందాల్ కోసం ఆమె ప్రచారం చేసారు. కానీ 2024 లో టాండన్ కాంగ్రెస్ కి ప్రచారం చేసినట్టుగా మాకు ఎటువంటి కథనాలు లభించలేదు. 

తీర్పు :

భారతీయ నటి రవీనా టాండన్ 2012 లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి కోసం చేసిన ప్రచారాన్ని 2024 లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికలలో తను ప్రచారం చేస్తున్నది బీజేపీకి, కాంగ్రెస్ కి కాదు. కనుక మేము దీనిని తప్పు దోవ పట్టించే విధంగా ఉంది అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.