హోమ్ 2019 నుండి 2021 మధ్య 13 లక్షల మంది మహిళలు తప్పిపోయారు అనేది అబద్ధం

2019 నుండి 2021 మధ్య 13 లక్షల మంది మహిళలు తప్పిపోయారు అనేది అబద్ధం

ద్వారా: ప్రియాంక ఈశ్వరి

ఫిబ్రవరి 28 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2019 నుండి 2021 మధ్య 13 లక్షల మంది మహిళలు తప్పిపోయారు అనేది అబద్ధం సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వారు అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో 2021 వరకు కేవలం 4,65,171 మహిళలు మాత్రమే తప్పిపోయారు.

క్లెయిమ్ ఏమిటి?

ఒక వ్యక్తి, భారత దేశంలో అమ్మాయిలు కనపడకుండా పోవడం గురించి మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతుంది. ఇందులో ఆ వ్యక్తి, ఒక మహిళను కిడ్నప్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో ఒకటి ఉదాహరణగా చూపిస్తూ, అదే విధంగా అనేక మంది మహిళలు కనపడకుండా పోతున్నారు అన్నట్టుగా, భారత దేశంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 

ఆ వ్యక్తి చూపిస్తున్న వీడియోలో, ద్విచక్ర వాహనం పై చీర కట్టుకుని ఉన్న మహిళని మరో కుర్తా ధరించిన మహిళ లిఫ్ట్ కోసం ఆపటం మనకి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కుర్తా వేసుకుని ఉన్న మహిళ, ఆ ద్విచక్ర వాహనం సైలెన్సర్ లో ఒక బట్ట ముక్క ని పెట్టటం గమనించవచ్చు, ఆ తరువాత ఆ వాహనం నడవకపోవడం తో వారు వేరే కార్ ని లిఫ్ట్ అడగటం, ఆ కార్ ఆగడం, ఆ తరువాత కుర్తా ధరించిన మహిళ చీర కట్టుకుని ఉన్న మహిళని, అటువైపుగా తీసుకెళ్లి బలవంతంగా తనను మరో అతని సహాయం తో కార్లోనికి నెట్టటం చూడవచ్చు.


ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని చూపిస్తూ, 2019 నుండి 2021 ప్రాంతంలో దాదాపుగా 13. 3 లక్షల మహిళలు ఇలాగే కనపడకుండా పోయారు అని పేర్కొన్నారు, పైగా వారు ఇప్పుడు వారి జాడ కుడా తెలియదు అని అంటూ, వారందరు కిడ్నప్ కి గురి కాబడ్డారు అని అన్నట్టుగా వీడియో ఉంటుంది. పైగా ఆ వ్యక్తి ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి ఆపాదిస్తూ, ఆడవారే ఇలా ఆడవారికి  ఇబ్బంది కలిగిస్తున్నారు అని మహిళలని అందరిని జాగ్రత్తగా ఉండాలి అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు దాదాపుగా 3.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి, ఆర్కైవ్ చేసిన పోస్ట్ లింకులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

అయినప్పటికీ ఈ వీడియోలో ఉన్నది తప్పు. ముందుగా, మహిళ కిడ్నప్ గా చూపబడే వీడియో ఒక నాటకం, వాస్తవ ఘటనకి సంబంధించినది కాదు. పైగా, ఎన్సీఆర్బీ సమాచారాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు.

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ‘3RDEYE24X7’ అనే యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన వైరల్ వీడియో మాదిరిగా ఉన్న మరింత నిడివి గల వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోని ఏప్రిల్ 2022 లో షేర్ చేసారు, దీనికి సూచికగా, ఈ ఛానల్ ప్రజలకు అవగాహన కల్పించడానికి కల్పిత ప్రదర్శనలను నాటకాలను వేస్తుంది అని పేర్కొన్నారు. ఈ వీడియోలను కేవలం వినోదం కోసమే చిత్రీకరించినవని వాస్తవ సంఘటనలు కాదని పేర్కొన్నారు. ఈ ఛానల్ లో అలాంటి అనేక కల్పిత ప్రదర్శనలు అప్లోడ్ చేయబడ్డాయి. 




'3RDEYE24X7’ ఛానల్ లో షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ 

ఎన్సీఆర్బీ ప్రకారం తప్పిపోయిన బాలికల మరియు మహిళల సమాచారం.

జులై 26, 2023 నాడు హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అజయ్ కుమార్ మిశ్ర, రాజ్య సభ లో 2019 నుండి 2021 వరకు ఎంతమంది మహిళలు మరియు బాలికలు తప్పిపోయారు అనే అంశాన్ని గురించి చర్చించారు. ఇక్కడ సమకూర్చిన ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, 82,084 బాలికలు మరియు 3,42,168  మహిళలు 2019 వరకు కనపడలేదు. 2020 లో ఈ సంఖ్య 79,233 మరియు 3,44,222, దాకా చేరింది.
ఇక్కడ గమనించవలిసింది ఏమిటంటే, కిందటి సంవత్సరాలలో కనపడని వారి సంఖ్య కుడా ఇక్కడ నమోదు చేసారు. హోమ్ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం మొత్తం కనపడకుండా పోయిన బాలికలు (90,113)మరియు మహిళల (3,75,058) సంఖ్య 2021 లో 4,65,171.

ఎన్సీఆర్బీ సమాచారం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎన్సీఆర్బీ సమాచారాన్ని 2019 నుండి 2021 వరకు తీక్షణంగా పరీక్షించింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎన్సీఆర్బీ గత సంవత్సరం తప్పిపోయి దొరికిన వారి సంఖ్యను కుడా నమోదు చేస్తుంది.

2019 లో 2,48,397 మంది మహిళలు కనపడకుండా పోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఈ సంఖ్య 4,22,439, (ఇక్కడ వచ్చిన తేడా ఎన్సీఆర్బీ డేటాని తరువాత అప్డేట్ చేయడం వలన అయి ఉండవచ్చు) 

మొత్తం, 2,48, 397 మహిళలు మరియు బాలికలతో దాదాపుగా 1,62,939 మంది దాకా అదే సంవత్సరం దొరికారు. 


(సౌజన్యం : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ క్రైమ్ బ్యూరో/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం 2020 లో 2,22,395 మంది బాలికలు మరియు మహిళలు కనపడకుండా పోయారు మరియు 1,52,020 మంది అదే సంవత్సరం దొరికారు. 


(సౌజన్యం : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ క్రైమ్ బ్యూరో/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

2021 లో 2,65,481 మంది మహిళలు కనపడకుండా పోయారు, వీరిలో 1,90,421 మంది అదే సంవత్సరం దొరికారు.

అంతా కలిపి మొత్తం మీద 2021 నాటికి 4,65,171 మంది మహిళలు కనపడకుండా పోయారు. అదే సంవత్సరం 2,61,278 మహిళలు మరియు బాలికలు దొరికారు.  మరియు 2021 నాటికి 2,03,893 మహిళలు మరియు బాలికల ఆచూకీ కనిపెట్టలేకపోయారు.


(సౌజన్యం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ క్రైమ్ బ్యూరో/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కనపడకుండా పోయిన మహిళలు అందరు కిడ్నప్ అయ్యారా?

తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ దారా కవిత, లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ కనపడకుండా పోయిన వారందరు కిడ్నప్ చేయబడినట్టుగా నిర్ధారించలేము అని చెప్పారు. మొత్తం కనపడకుండాపోయిన వారి సంఖ్య తో పోల్చుకుంటే  అందులో కిడ్నప్ అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని చెప్తూ, కొంత మంది ఆడవారు పెళ్లి చేసుకోడానికి ఇల్లు వదిలి వెళ్లిన వారు కుడా ఉంటారని తెలిపింది, ఇలాంటి కేసులలో కనపడకుండా పోయిన వారు మరల దొరుకుతారని తెలిపింది.

తెలంగాణ హై కోర్ట్ లాయర్ గా వ్యవహరిస్తున్న సింగపొగు సుబ్బారావు కుడా ఇవే వ్యాఖ్యలని నిర్ధారించారు. “మనం ఒక 100 కేసులను తీసుకుంటే, అందులో దాదాపు 60 శాతం మహిళలు వారి ఇష్ట పూర్వకంగా ఇల్ల్లు వదిలి వెళ్ళినవారు ఉంటారు. కానీ తల్లి తండ్రులు వారిని కనపడకుండా పోయిన వారి జాబితాలో కేసు నమోదు చేస్తారు. ఇలాగే కొంత మంది ఆక్సిడెంట్ లో చనిపోయి, కనపడకుండా పోయిన వారు ఉంటారు, కొందరు హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు అత్యాచారానికి గురైనవారు కుడా ఉంటారు,” అని పేర్కొన్నారు.

తీర్పు : 

ఒక కల్పితమయిన వీడియోని చూపించి నిజంగా ఒక మహిళను కిడ్నప్ చేస్తున్న వీడియోగా వర్ణించి ఇలానే దేశం లో 13. 3 లక్షలకు పైగా ఆడవారు 2019 నుండి 2021 దాకా కనపడకుండా పోయారు అని అర్ధం వచ్చేలా వీడియో షేర్ చేసారు. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం, 2021 వరకు కనపడకుండా పోయిన వారి సంఖ్య 4,65,171మాత్రమే, వీరిలో కొంత మంది మరల లభించి ఉండవచ్చు.  వీరిలో 2,03,893 మంది ఆడవారు 2021 వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కనుక మేము దీనిని అబద్ధం అనిపేర్కొన్నాము.


(అనువాదం: రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.