హోమ్ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ పని అయిపొయింది అని మల్లిఖార్జున్ ఖర్గే అన్నట్టు షేర్ చేసారు

ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ పని అయిపొయింది అని మల్లిఖార్జున్ ఖర్గే అన్నట్టు షేర్ చేసారు

ద్వారా: రాజేశ్వరి పరస

మే 24 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ పని అయిపొయింది అని మల్లిఖార్జున్ ఖర్గే అన్నట్టు షేర్ చేసారు మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అయిపొయింది అని అన్నారని క్లెయిమ్ చేస్తున్న వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్ / లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఖర్గే స్పీచ్ లో నుండి కొంత భాగాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అర్థం వచ్చేటట్టుగా ఎడిట్ చేసారు.

క్లెయిమ్ ఏమిటి?

2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ‘కాంగ్రెస్ పని అయిపొయింది’ అని అన్నట్టుగా సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో, ఖర్గే హిందీలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పని అయిపొయింది. కాంగ్రెస్ ఇక లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ని ఎక్కడ చూడలేరు,” అని అన్నారు. (తెలుగు అనువాదం)

ఈ వీడియోని షేర్ చేస్తూ, ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఇకపై పని చేయటం లేదని ఒప్పుకున్నారు అని షేర్ చేస్తున్నారు. అలాంటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ మా పరిశోధన ప్రకారం, ఇది ఎడిట్ చేసిన వీడియో. ఒరిజినల్ వీడియోలో ఖర్గే అహ్మదాబాద్ లో కాంగ్రెస్ విమర్శకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు.

మేము ఏమి కనుగొన్నము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, మాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ యూట్యూబ్ లో మే 2, 2024 నాడు  ప్రసారం చేసిన ఒక లైవ్ స్ట్రీమ్ లింక్ దొరికింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియోలో ఖర్గే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది.

12:04 టైం స్టాంప్ వద్ద, ఖర్గే అహ్మదాబాద్ గురించి మాట్లాడుతూ, “అహ్మదాబాద్ ఒక పెద్ద గొప్ప నగరం. మహాత్మా గాంధీజీ, సర్దార్ పటేల్ జీ, దాదాభాయ్ నౌరోజీ లాంటి ఎందరో గొప్ప నాయకులు ఇక్కడ పుట్టారు. వాళ్ళు గుజరాత్ ని ఒక్క గొప్ప ప్రదేశంగా మార్చారు. . .”

ఇంకా మాట్లాడుతూ, “అహ్మదాబాద్ లో కాంగ్రెస్ చాలా శక్తివంతమైన పార్టీ. దీనిని ఎవరు తొలగించలేరు, ఎవరు అలాంటి వ్యాఖ్యలు కుడా చేయలేరు. కొంత మంది, ‘కాంగ్రెస్ పని అయిపొయింది. కాంగ్రెస్ ఇక లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ని ఎక్కడ చూడలేరు’ అని అంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నానను - ఇది మహాత్మా గాంధీ పుణ్య నగరం. అలాంటి చోట, ఆశ్చర్యకరంగా ఆయన ఆదర్శాలనే ముగించాలని చూసే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు.”

 
పైన బోల్డ్ చేసిన వ్యాఖ్యలను ఖర్గే స్పీచ్ నుంచి తీసుకుని కావాలని వేరే అర్ధం వచ్చేటట్టు, ఖర్గే కాంగ్రెస్ పని అయిపొయింది అని అన్నట్టు ఎడిట్ చేశారు.

గతం లో లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇలా అసందర్బంగా షేర్ చేసిన ఎలక్షన్ ర్యాలీ వీడియోలను ఫాక్ట్ చెక్ చేసింది. మా చెక్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

తీర్పు

వైరల్ వీడియోలో మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ పని అయిపొయింది అని అన్నట్టుగా తప్పుగా ఉంది. నిజానికి ఆయన అహ్మదాబాద్ లో పార్టీ పని అయిపొయింది అని విమర్శించే వారిని ఉద్దేశించి మాట్లాడారు. కనుక దీనిని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అని నిర్ధారించాము.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.