హోమ్ బంగ్లాదేశ్ లో పాడైన వంతెనను భారతదేశానికి చెందినట్టుగా షేర్ చేసారు

బంగ్లాదేశ్ లో పాడైన వంతెనను భారతదేశానికి చెందినట్టుగా షేర్ చేసారు

ద్వారా: ఉమ్మే కుల్సుం

సెప్టెంబర్ 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఈ పాడైపోయిన వంతెన భారతదేశంలోనిది అని షేర్ చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో ఇది భారతదేశంలో పాడైన వంతెన అంటూ షేర్ చేసిన స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఫొటోలో ఉన్నది బంగ్లాదేశ్ లోని బర్గుణ జిల్లాలోని తెపురా గ్రామంలో ఉన్న వంతెన. భారతదేశానికి సంభందించినది కాదు.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో పాడైపోయిన వంతెన ఫొటో ఒకటి వైరల్ అవుతున్నది, వంతెనలో ఉన్న ఇనుప వైరింగ్ కనపడే విధంగా మూడు పెద్ద రంధ్రాలతో ఈ వంతెన పూర్తిగా విచ్చిన్నమై ఉంది. దీనిని షేర్ చేసి, ఇది భారతదేశం లోని మౌలిక సదుపాయాల పరిస్థితి అంటూ షేర్ రాసుకొచ్చారు.

తరచుగా తప్పుడు సమాచారం షేర్ చేసే ఒక బీహార్ కి చెందిన యూట్యూబర్ మనీష్ కశ్యప్ ఈ ఫొటోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, "చైనీస్ వారు తాము కట్టిన అద్దాల వంతెనకు మురిసిపోతుంటే, మనం ఇలాంటి ఇలాంటి వంతెన కట్టాము" అంటూ షేర్ చేసారు (హిందీ అనువాదం). తన పోస్టు ద్వారా భారతదేశం లోని మౌలిక సదుపాయాలను విమర్శిస్తూ, చైనా లోని గ్లాస్ బ్రిడ్జితో పోలుస్తూ, ఈ పాడైన వంతెన భారతదేశానిదే అన్నట్టుగా షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇంతకు మునుపు కుడా కశ్యప్, పాకిస్థాన్ కి చెందిన వీడియోని భారతదేశానిది అన్నట్టుగా షేర్ చేసిన క్లెయిమ్ ను లాజికల్లీ ఫ్యాక్ట్స్ నిజ నిర్ధారణ చేసింది. ఆ కథనం ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 


కానీ ఈ పాడైపోయిన వంతెన భారతదేశం లోనిది కాదు, బంగ్లాదేశ్ కి సంబంధించినది.

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దైనిక్ భయాన్నో అనే ఒక బంగ్లాదేశీ వార్త సంస్థ జులై 10, 2024 నాడు ప్రచురించిన కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ పాడైన వంతెన బంగ్లాదేశ్ లోని బర్గుణా జిల్లాలోని తెపురా గ్రామానికి చెందినది. ఈ కథనంలో తరచుగా ఈ వంతెనను వాడే కలపర ముక్తిజొద్ధ మెమోరియల్ డిగ్రీ కాలేజీ అధ్యాపకుడుతో మాట్లాడినట్టు కుడా ఉంది. తన నివాసం చంపాపూర్ యూనియన్ లో ఉంది అని, ప్రస్తుతం ఆ వంతెన పరిస్థితి గోరంగా ఉంది పేర్కొన్నారు. 

ఇంకాస్త పరిశోధించగా, మరొక బంగ్లాదేశీ వార్త సంస్థైన కాలేర్ కంతో రాసిన కథనం లభించింది, ఇందులో కుడా వైరల్ ఫొటో మాదిరి గానే పాడైపోయిన వంతెన ఫొటో ఉంది. ఇందులో కుడా ఇనుప వైరింగ్ కనపడుతూ పెద్ద పెద్దగా మూడు రంధ్రాలు ఉన్నాయి. ఈ ఫొటోని తామే తీసినట్టుగా ఈ కథనం పేర్కొంటూ, బర్గుణా లోని హల్దియా యూనియన్ ఆఫ్ అంతలి ఉపజిలా లోని తెపురా గ్రామం లో తీసినట్టుగా ఉంది. 


పాడైపోయిన వంతెనను ప్రచురించిన వార్త కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం : కాలేర్ కంతో)


మరికాస్త పరిశోధించగా దేశి బైకర్ అనే ఒక ఫేస్బుక్ పోస్ట్ మాకు లభించింది (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ వైరల్ ఫొటో లాంటి ఫొటోని షేర్ చేసి జీతూ సర్కర్ అనే వ్యక్తికి ఆపాదించారు. మా పరిశోధన ప్రకారం సర్కార్ అనే వ్యక్తి ఈ ఫొటోని తమ ఫేస్బుక్ పేజీలో జూన్ 24 నాడు షేర్ చేసి, ఈ ఫొటో తీసినది బరిశల్ అనే ప్రదేశం లో పేర్కొన్నారు (ఆర్కైవ్ ఇక్కడ). ఈ ప్రదేశం గురించి మరింత సమాచారం కొరకు మేము సర్కార్ ని సంప్రదించాము, సమాచారం అందిన వెంటనే ఈ కథనం లో పొందుపరచటం జరుగుతుంది.

తీర్పు

ఒక పాడైపోయిన వంతెన ఫొటోని షేర్ చేసి ఇది భారతదేశం లో వంతెన లాగ షేర్ చేశారు, కానీ ఇది  బంగ్లాదేశ్ లోని తెపురా గ్రామానికి చెందినది.

(అనువాదం: రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.