హోమ్ పోలవరం డ్యామ్ నిర్మాణం ఎక్కువ భాగం వై ఎస్ ఆర్ సీ పీ ప్రభుత్వం హయంలో జరిగిందని తప్పుగా క్లైమ్ చేస్తున్నారు

పోలవరం డ్యామ్ నిర్మాణం ఎక్కువ భాగం వై ఎస్ ఆర్ సీ పీ ప్రభుత్వం హయంలో జరిగిందని తప్పుగా క్లైమ్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

జూన్ 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పోలవరం డ్యామ్ నిర్మాణం ఎక్కువ భాగం వై ఎస్ ఆర్ సీ పీ ప్రభుత్వం హయంలో జరిగిందని తప్పుగా క్లైమ్ చేస్తున్నారు తెలుగు దేశం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులేమీ జరగలేదు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ప్రభుత్వ డేటా ప్రకారం 2019 నాటికే కనీసం 60 శాతం పూర్తి అయిపోయింది.

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో పోలవరం డ్యామ్ నిర్మాణం అధిక భాగం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2022 నుండి 2023 సంవత్సరాల మధ్య జరిగింది అని, పూర్వపు తెలుగు దేశం పార్టీ హయాంలో స్పీల్ వే పునాది పనులు తప్ప ‘చెప్పుకోదగ్గ’ పనులేమి జరగలేదని అంటూ ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నది.

పోలవరం డ్యామ్ అధికారిక పేరు ఇందిరా సాగర్ పోలవరం డ్యామ్. సాగు, తాగు నీటి అవసరాల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరి నది మీద నిర్మితమవుతున్న ప్రాజెక్ట్ ఇది.

ఈ పోస్ట్ తో పాటు ఆగస్ట్ 2019 లో పోలవరం డ్యామ్ పరిస్థితి, ఆగస్ట్ 2022 లో పరిస్థితి అని చెబుతూ రెండు ఫొటోల కొలాజ్ ని షేర్ చేస్తున్నారు. “గత టిడిపి ప్రభుత్వంలో  స్పిల్ వే పునాది పనులు తప్ప మిగతా పనులేమీ జరగలేదు గత వై.యస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులను మేఘ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులన్నీ 2020 జనవరిలో మొదలయ్యి ఆగస్టు 2023 వరకు జరిగాయి,” అనే శీర్షికతో ఈ క్లైమ్ ని షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆంధ్ర ప్రదేశ్ లో 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా, 2019 నుండి 2024 వరకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మే 2024 లో జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం తిరిగి గెలుపొందింది.

అయితే, ఈ క్లైమ్ తప్పు. పోలవరం డ్యామ్ నిర్మాణంలో అధిక భాగం పని 2019 నాటికే అయిపోయింది. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల విభాగం ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ లో ఒక మట్టి డ్యామ్, స్పీల్ వే, ఎడమ కాలువ (లెఫ్ట్ బ్యాంక్ కెనాల్), కుడి కాలువ (రైట్ బ్యాంక్ కెనాల్), ఒక జల విద్యుత్తు కేంద్రం ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2004 లో మొదలయ్యింది. నీటిని నిల్వ ఉంచేది డ్యామ్ కాగా, రిజర్వాయర్ నిండినప్పుడు అధిక జలాలని కిందకి స్పీల్ వే  ద్వారా వదులుతారు. 

జల్ శక్తి మంత్రిత్వ శాఖలో ఉండే జల వనరుల విభాగం కింద పని చేసే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పోలవరం డ్యామ్ గురించి 2014 నుండి వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నది. వాటిల్లో ఆయా సంవత్సరం పోలవరం డ్యామ్ పనుల ప్రగతి గురించిన డేటా ఇస్తున్నారు.

ఇందులో డ్యామ్ పనులని హెడ్ వర్క్స్, ఎడమ కాలువ, కుడి కాలువ గా విభజించారు. హెడ్ వర్క్స్ లో డ్యామ్ కట్ట, మట్టి పని, సిమెంట్ పనులు వస్తాయి. కాలువ పనులలో మట్టి పని, లైనింగ్, ఇతర పనులు వస్తాయి. స్పీల్ వే నిర్మాణం ‘హెడ్ వర్క్స్’ విభాగం కిందకి వస్తుంది. ఎడమ కాలువ ఉత్తర కోస్తా కి, కుడి కాలువ దక్షిణ కోస్తా కి నీళ్ళు అందిస్తాయి.

ఈ నివేదికల ప్రకారం, 2014 నాటికి, అంటే తెలుగు దేశం అధికారం లోకి వచ్చే సమయానికి,  జరిగిన పనుల శాతం-

హెడ్ వర్క్స్: 1 నుండి 19 

కుడి కాలువ: 49 నుండి 71 

ఎడమ కాలువ: 25 నుండి 79 

మార్చ్ 2014 నాటికి ప్రాజెక్ట్ ప్రగతి (సౌజన్యం: ppa.gov.in/స్క్రీన్ షాట్)

మార్చ్ 2019 నాటికి, అంటే తెలుగు దేశం అధికారం కోల్పోయే సమయానికి, జరిగిన పనుల శాతం-

హెడ్ వర్క్స్: 68 నుండి 89

కుడి కాలువ: 93 నుండి 100

ఎడమ కాలువ: 61 నుండి 93

దీని బట్టి, తెలుగు దేశం పాలనలో ఈ ప్రాజెక్ట్ పనులు ఎమీ జరగలేదు అనే క్లైమ్ అబద్ధం అవాస్తవం అని స్పష్టం అవుతున్నది. 2019 మే లో ప్రభుత్వం మారే సమయానికి ప్రాజెక్ట్ పనిలో కనీసం 61 శాతం పూర్తి అయ్యింది అని దీని ద్వారా స్పష్టం అవుతున్నది. 

మార్చ్ 2019 నాటికి ప్రాజెక్ట్ ప్రగతి (సౌజన్యం: ppa.gov.in/స్క్రీన్ షాట్)

ఈ నివేదికలలో తాజాగా అందుబాటులో ఉన్నది మార్చ్ 2023 నాటిది. దీని ప్రకారం పూర్తి అయిన పనుల శాతం-

హెడ్ వర్క్స్: 86 నుండి 96 శాతం

కుడి కాలువ: 95 నుండి 100 శాతం

ఎడమ కాలువ: 70 నుండి 95 శాతం 

మార్చ్ 2023 నాటికి ప్రాజెక్ట్ ప్రగతి (సౌజన్యం: ppa.gov.in/స్క్రీన్ షాట్)

పోలవరం ప్రాజెక్ట్ లో అధిక భాగం పనులు 2014 నుండి 2019 మధ్యలో పూర్తి అయ్యాయి అని ఈ డేటా ద్వారా స్పష్టం అవుతున్నది. 2019 నుండి 2023 మధ్య, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో, కొద్దిగానే అయ్యాయి అని కూడా స్పష్టం అవుతున్నది.

తీర్పు

2014 నుండి 2019 మధ్య తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు అతి తక్కువగానూ, 2019 నుండి 2023 మధ్య వై ఎస్ ఆర్ సీ పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ శాతం జరిగాయి అనే క్లైమ్ తప్పు. అధిక శాతం పనులు 2014 నుండి 2019 మధ్యనే పూర్తి అయ్యాయి. 

(అనువాదం - గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.