హోమ్ కల్పిత వీడియోని ఒక ముస్లిం వ్యక్తి తన దుకాణంలో భారతీయ జెండా పెట్టడానికి నిరాకరించినట్టుగా షేర్ చేస్తున్నారు

కల్పిత వీడియోని ఒక ముస్లిం వ్యక్తి తన దుకాణంలో భారతీయ జెండా పెట్టడానికి నిరాకరించినట్టుగా షేర్ చేస్తున్నారు

ద్వారా: రాజేశ్వరి పరస

ఆగస్టు 21 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కల్పిత వీడియోని ఒక ముస్లిం వ్యక్తి తన దుకాణంలో భారతీయ జెండా పెట్టడానికి నిరాకరించినట్టుగా షేర్ చేస్తున్నారు ఒక ముస్లిం వ్యక్తి భారతీయ జెండాని తన దుకాణంలో పెట్టడానికి నిరాకరించాడు అనే క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

రితిక్ కటారియా ఈ వీడియోని 2023 లో తయారు చేశారు. ఆయన లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ఈ వీడియో కల్పితమని, వాస్తవ ఘటన కాదని తెలియజేశారు.

క్లెయిమ్ ఏమిటి?

ఒక 50 సెకెన్ల వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది, ఇందులో టోపీ పెట్టుకుని కొబ్బరి కాయలు అమ్ముకునే ఒక వ్యక్తి తన దుకాణం లో జాతీయ జెండా పెట్టడానికి నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో మిగతా వ్యక్తులు ఇది తమ దేశం అని, ఎక్కడైనా జెండా ని పెడతాం అని వాదించటం కుడా మనం వినవచ్చు. 

ఈ వీడియోని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ముస్లింల గురించి చెప్పడానికి “నమ్మక ద్రోహులు” వంటి పదాలను వాడి షేర్ చేశారు. “ఇంతకు మునుపు, ఈ నమ్మక ద్రోహులకు కాషాయ రంగు జెండా తోనే ఇబ్బంది ఉండేది, ఇప్పుడు త్రివర్ణ పతాకం అన్నా కుడా ఇబ్బందిగా ఉంది,” అని రాసుకొచ్చారు. అలాంటి ఒక పోస్టుకు ఈ కథనం రాసే సమయానికి దాదాపుగా, 3,72,200 వ్యూస్ మరియు 77,000 లైక్స్ ఉన్నాయి. అలాంటి పోస్టుల యొక్క ఆర్చైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే, ఈ క్లెయిమ్ అబద్ధం, ఎందుకంటే ఇది వాస్తవ ఘటన కాదు. ఈ కల్పిత వీడియోని రితిక్ కటారియా అనే తన ఛానల్ లో ఆగష్టు 2023 లో అప్లోడ్ చేసారు. 

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో రితిక్ కటారియా అనే వ్యక్తి తమ యూట్యూబ్ ఛానల్ లో ఆగష్టు 2023 లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి వీడియోని (ఆర్కైవ్ ఇక్కడ) ఆగష్టు 14, 2023 లో అప్లోడ్ చేసి, దీనికి హిందీ లో శీర్షికగా “త్రివర్ణ పతాకం గురించి హిందూ ముస్లిం మధ్య గొడవ” అని పెట్టారు. ఆ ఛానల్ బయో లో “స్ఫూర్తిదాయక వీడియోలు” చేస్తారు అన్నట్టు గా పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న క్లిప్ ని నాలుగు నిమిషాల వ్యవధి గల ఈ ఒరిజినల్ వీడియోలో 0:56 టైం స్టాంప్ వద్ద మనం చూడవచ్చు. ఈ వీడియోలో ముస్లిం గా కనపడుతున్న వ్యక్తి, మొదట్లో జెండా ని తన షాప్ లో పెట్టవద్దు అని చూపినప్పటికీ, ఆ జెండా ని కింద పెట్టడం వలన దానిని అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి, అతను అలా అన్నట్టు అర్దమవుతుంది. ఈ వీడియోలోని చిన్న సన్నివేశం తీసుకుని అసందర్భంగా షేర్ చేస్తున్నారు.

నటుడు మరియు కంటెంట్ క్రియేటర్ అయిన రితిక్ కటారియా ను లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ విషయం గురించి  సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ, ఈ వీడియో తాను 2023 లో తయారు చేసినట్టుగాను, అప్పట్లో ఎక్కువ గా వ్యూస్ రాని కారణం తో మరళా ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసినట్టు తెలిపారు. కానీ ఈ వీడియోని ఎవరో ఆకతాయిలు తన అనుమతి లేకుండా తీసుకుని వాస్తవ ఘటన లా షేర్ చేస్తున్నారు అని తెలిపారు. పూర్తి వీడియో చూసినట్టైతే, ఆ వీడియో ఒక స్ఫూర్తి దాయక వీడియో అని అర్దమవుతుంది అని తెలిపారు.

తీర్పు

2023 నాటి ఒక స్క్రిప్టెడ్ వీడియోని అది నిజంగా జరిగినట్టుగా మతం రంగు పులిమి షేర్ చేశారు. నిజానికి, అది రితిక్ కటారియా అనే ఒక ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.