హోమ్ పులి స్నానం చేస్తున్నట్టు గా వైరల్ అవుతున్న వీడియో కర్ణాటకలోని కూర్గ్ లో తీసినది కాదు

పులి స్నానం చేస్తున్నట్టు గా వైరల్ అవుతున్న వీడియో కర్ణాటకలోని కూర్గ్ లో తీసినది కాదు

ద్వారా: రాజేశ్వరి పరస

ఆగస్టు 18 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పులి స్నానం చేస్తున్నట్టు గా వైరల్ అవుతున్న వీడియో కర్ణాటకలోని కూర్గ్ లో తీసినది కాదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో అమెరికాలోని ఉత్తర కరోలినాలో జూన్ 2020 లో తీసిన వీడియో.

నేపధ్యం 

దక్షిణ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ అనే ఊరులో ఉన్న కాఫీ తోటలలో ఒక పులి రబ్బరు టబ్బు లో స్నానం చేస్తున్నట్టు గా ఉన్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ని నటీమణి రష్మిక మందన్న కూడా ఇలా రాస్తూ రీపోస్ట్ చేశారు, “కూర్గ్ లో ఏదైనా సాధ్యమేనని మళ్ళీ నిరూపణ అయ్యింది. “

Source:X/@IamRashmika/@sdjoshi55/ Altered by LogicallyFacts

ఎన్ డి టి వి మరియు ఆసియా నెట్ లాంటి వార్తా వెబ్సైట్ లు 2020లో ఇలాంటి శీర్షికలతోనే ఇది కూర్గ్ లో జరిగినట్టుగా రాసుకొచ్చారు. 

Screengrabs of published articles/Altered by Logically Facts

అయితే ఇది కూర్గ్ లో జరిగినది కాదు. పైగా ఈ మధ్య కాలంలో జరిగినది కూడా కాదు. 

వాస్తవం

మేము దీని గురించి గూగుల్ లో వెతికిన వెంటనే మాకు ఈ వీడియో 2020 నుంచి ఇలాంటి శీర్షికలతోనే వైరల్ అవుతుందని అర్థమయ్యింది. 

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని  రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే అమెరికాలోని కరోలినా టైగర్ రెస్క్యూ అనే సంస్థ X లో పోస్ట్ చేసిన పోస్ట్ దొరికింది. ఆ సంస్థ ఒక పులి టబ్ లో స్నానం చేస్తున్న  వీడియోని జూన్ 11, 2020 లో పోస్ట్ చేశారు. దాని శీర్షిక గా ఇలా రాశారు- మడోన్నా అనే పులి నిన్న తన పూల్ లో స్నానం చేసింది. ఈ పూల్స్ అనేవి వేసవి కాలం లో పులులని చల్లగా ఉంచడానికి తోడ్పడతాయి, పైగా వాటికి ఇష్టం కూడా. దాగి ఉండటం మరియు వేటాడటం అనే నైపుణ్యాలు కలిగిన మడోన్నా ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఈ టబ్ లో సేదతీర్చుకుంటుంటే తనను వెతికే పని మాకు సులువు అవుతుంది!

కరోలినా టైగర్ రెస్క్యూ వారు వారి యూట్యూబ్ ఛానల్ లో మడోన్నాకు సంబందించిన ఇతర వీడియోలు కూడా ఉన్నాయి.. పైగా వారి ‘ఇన్ మెమోరియం’ పేజీ ప్రకారం ఆ పులి ఈ మధ్యనే చనిపోయింది. 

తీర్పు

టబ్బులో  స్నానం చేస్తున్న పులి వీడియో ఉత్తర కరోలినాలోనిది, కూర్గ్ లోని కాఫీ తోటలోనిది కాదు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.