ద్వారా: రజిని కె జి
ఫిబ్రవరి 21 2024
భోపాల్ లో నిరుద్యోగం పై కాంగ్రెస్ యువజన విభాగం చేసిన నిరసన వీడియో ఇది. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధం లేదు.
క్లెయిమ్ ఏమిటి?
ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమం నేపధ్యం లో, బిజెపి ప్రభుత్వం ఉద్యమకారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో నీటి కానోన్ లతో ఉద్యమకారుల మీద నీళ్లు జల్లటం, వారిని బ్యారికేడ్ లతో ఆపటం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఆ వీడియోల ఆర్కైవ్ పోస్ట్లు ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్లు (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
కానీ వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమం లోనివి. రైతుల ఉద్యమానికి సంబంధం లేదు.
వాస్తవం ఏమిటి?
వైరల్ వీడియోలో కాంగ్రెస్ యువజన భాగం భోపాల్ లోని బిజిపి ప్రభుత్వం పై నిరసన కార్యక్రమం చేపట్టారని అనటం మనకి వినిపిస్తుంది. పైగా వీడియోలో పైన కుడి వైపు ఉన్న లోగో కుడా ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మరియు ‘రోజ్గార్ డో న్యాయ డో’ అని ఉంది.
ఇదే వీడియోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయిన శ్రీనివాస్ బివి ఎక్స్ అకౌంట్ లో ఫిబ్రవరి 13 నాడు షేర్ చేసారు. దీనికి శీర్షికగా, పెరుగుతున్న నిరుద్యోగానికి అనేక మంది యువ కాంగ్రెస్ నేతలు గొంతెత్తారు అని పేర్కొంటూ, “నీటి క్యానన్ లు వాడండి లాఠి లే వాడండి, ఉద్యోగాలు అయితే ఇవ్వండి, న్యాయం జరిపించండి” అని రాసారు.
ఇండియ టుడే ఛానల్ మరియు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఈ వీడియోలను కుడా తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. వైరల్ అవుతున్న వీడియో మరియు ఈ దృశ్యాలు ఒకేలా ఉన్నాయి.
ఫిబ్రవరి 13 నాడు టైమ్స్ అఫ్ ఇండియాలో ప్రచురితమయిన కథనం ప్రకారం, కాంగ్రెస్ యువజన కార్యకర్తలు, బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని, నిరుద్యోగం రాష్ట్రంలో ఉందని నిరసన చేపట్టినట్టుగా ఉంది. శ్రీనివాస్ బివి కుడా ఇందులో పాల్గొన్నారు. ఈ నిరసనను ఆపటానికి పోలీసులు బ్యారికేడ్లు మరియు నీటి క్యానన్ లు వాడారు.
రెండేళ్ల క్రితం ఆపిన ఉద్యమాన్ని తమ హామీలు నెరవేర్చలేదని, రైతులు మరల మొదలుపెట్టారు. వీరిని ఆపటానికి కుడా పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు, ఇందులో భాగంగా రైతులను రాజధాని అయిన ఢిల్లీ లోనికి రానివ్వకుండా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో బ్యారికేడ్ లు పెట్టటం, రోడ్లపై వైర్లు మరియు మేకులు గుచ్చటం, టియర్ గ్యాస్ వాడటం లాంటివి కుడా చేసారు అని వార్త కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకి రైతు ఉద్యమాలకి సంబంధం లేదు.
తీర్పు :
గతంలో భోపాల్ లో యువజన కాంగ్రెస్ చేసిన వీడియోని ప్రస్థుం రైతు ఉద్యమానికి సంభంధం వీడియో గా షేర్ చేసారు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరస)