హోమ్ తమిళనాడు వీడియోని షేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజర్లను వాడి తోపుడు బండ్లను ధ్వంసం చేయిస్తున్నదని క్లైమ్ చేశారు

తమిళనాడు వీడియోని షేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజర్లను వాడి తోపుడు బండ్లను ధ్వంసం చేయిస్తున్నదని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస

జూలై 2 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తమిళనాడు వీడియోని షేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజర్లను వాడి తోపుడు బండ్లను ధ్వంసం చేయిస్తున్నదని క్లైమ్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజర్లను వాడి తోపుడు బండ్లను ధ్వంసం చేయిస్తున్నదని చేసిన క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ సంఘటన చెన్నై లోనే జరిగింది అని జియోలొకేట్ చేయగలిగింది.

క్లెయిమ్ ఏమిటి ? 

ఒక బుల్డోజర్ తోపుడు బండిని ధ్వంసం చేస్తున్న వీడియోని షేర్ చేసి, ఈమధ్యనే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అని రాసుకొచ్చారు. ఈ వీడియోని షేర్ చేసి, “జగనన్న ప్రభుత్వం చిరు వ్యాపారులకు పెట్టుబడి కింద 10,000 ఇస్తూ ఆర్ధికంగా తోడుగా ఉంటే.. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉండకపోగా ఏకంగా బుల్డోజర్తో వాళ్ళ జీవనోపాధిపై కొడుతుంది” అని రాసుకొచ్చారు. అలాంటి పోస్టుల ఆర్కైవ్ లు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

తెలుగు దేశం పార్టీ తన కూటమి సభ్యులైన జన సేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ లతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నెల వ్యవధి లోనే ఈ క్లెయిమ్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. శాసనసభ ఎన్నికలలో కూటమి జగన్ మోహన్ రెడ్డి వైఎసార్సీపి పై గెలుపొందింది.

వైరల్ క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు.

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోని తీక్షణంగా పరీక్షిస్తే అందులో వ్యక్తులు మాట్లాడుతున్నది తెలుగు కాదు తమిళం అని అర్ధమయింది, దీని బట్టి ఆ వీడియో తమిళ నాడు కి చెందినది అయి ఉండవచ్చు అని భావించాము. ఆ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా న్యూస్ 18 తమిళనాడు తమ ఎక్స్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో లభించింది(ఆర్కైవ్ ఇక్కడ). ఇందులో తమిళంలో శీర్షిక రాస్తూ, హైవే డిపార్ట్మెంట్ దారిలో ఉన్నటువంటి తోపుడుబండ్లను, చిన్న దుకాణాలను జెసిబి ని వాడి ధ్వంసం చేసిందని రాసుకొచ్చారు. ఇక్కడ జె సి బి అనేది కట్టడాలకు సంబందించిన మెషినరీని తయారు చేసే సంస్థ.

కీ వర్డ్ సెర్చ్ చేయగా మాకు ఇండియా టుడే కథనం ఒకటి లభించింది, ఇక్కడ వైరల్ వీడియో మాదిరి ఫొటోనే ఇక్కడ కనపడింది. ఈ కథనం ప్రకారం, తమిళనాడు లోని హైవే డిపార్ట్మెంట్ చెన్నై లోని తాంబరం అనే ప్రాంతం లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని ఒక బుల్డోజర్ని వాడి తోపుడు బండ్లను తీయించి వేసింది. మేము ఈ కథనం రాసిన రచయత ప్రమోద్ మాధవ్ ని కుడా సంప్రదించాము, అయన ఈ స్థలాన్ని శానిటోరియం అంటారని తెలుపుతూ, హైవే డిపార్ట్మెంట్ జూన్ 15 నాడు రోడ్ క్లియరెన్స్ కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా తోపుడు బండ్లను రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వారిని పంపించారని తెలిపారు. తాము ఈ సంఘటన కి చెందిన నాలుగు వీడియోలు తీసినట్టు, అందులో ఈ తోపుడు బండిని ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి అని మాకు తెలిపారు.

వైరల్ వీడియోకి మరియు ఇండియా టుడే లో ప్రచురించిన ఫొటోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ఇండియా టుడే/స్క్రీన్ షాట్)

మేము వైరల్ అవుతున్న వీడియో చెన్నై లోని తాంబరం అనే ప్రాంతానికి చెందిన వీడియోగా జియో లోకేట్ చేశాము. వీడియో లో కనపడే గ్రీన్ బోర్డు నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సిద్ధ, ఇది తాంబరంలో ఉంది. దాని పక్కన నారింజ రంగు బోర్డు ఉన్నది బ్యాంక్ ఆఫ్ బరోడా.


వైరల్ వీడియో మరియు గూగుల్ మ్యాప్స్ కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/గూగుల్ మ్యాప్స్/స్క్రీన్ షాట్)

తీర్పు :

చెన్నై కి చెందిన వీడియోని షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మొన్నీమధ్య బుల్డోజర్లను వాడి తోపుడు బండ్లను తీయిస్తున్న వీడియో అని పేర్కొన్నారు.

(అనువాదం : రాజేశ్వరి పరసా) 

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.