హోమ్ భారత మహిళా హాకీ జట్టుకి సంబంధించిన సంబంధం లేని ఫొటోలు షేర్ చేసి ‘ఆస్ట్రేలియా మీద పగ తీర్చుకున్నామని' క్లైమ్ చేశారు

భారత మహిళా హాకీ జట్టుకి సంబంధించిన సంబంధం లేని ఫొటోలు షేర్ చేసి ‘ఆస్ట్రేలియా మీద పగ తీర్చుకున్నామని' క్లైమ్ చేశారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్

డిసెంబర్ 1 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
భారత మహిళా హాకీ జట్టుకి సంబంధించిన సంబంధం లేని ఫొటోలు షేర్ చేసి ‘ఆస్ట్రేలియా మీద పగ తీర్చుకున్నామని' క్లైమ్ చేశారు సంబంధం లేని వీడియో షేర్ చేసి ఆస్ట్రేలియా మీద భారత మహిళా హాకీ జట్టు విజయోత్సవ వీడియో అంటూ క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఐసిసి పురుషుల ప్రపంచ కప్పు ఫైన లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమికి ప్రతీకారం అంటూ సంబంధం లేని ఫుటేజీని షేర్ చేశారు.

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న ఒక 26 సెకన్ల వీడియోలో నీలి రంగు దుస్తులు ధరించిన మహిళా హాకీ క్రీడాకారులు ట్రోఫీ ఎత్తుతుండటం మనం చూడవచ్చు. దీని తరువాత భారత మహిళా హాకీ క్రీడాకారులు మైదానంలో సంబరాలు చేసుకుంటున్న ఫొటోల కొలాజ్ కూడా మనం చూడవచ్చు. “ప్రపంచ మహిళా హాకీ ఛాంపియన్షిప్” లో ఆస్ట్రేలియా మీద భారత జట్టు విజయానికి సంబంధించిన వీడియో ఇదని కొంత మంది యూజర్లు క్లైమ్ చేశారు. నవంబర్ 19, 2023 నాడు జరిగిన ఐసిసి పురుషుల ప్రపంచ కప్పు ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమికి ఇది ప్రతీకారం అని కూడా కొంత మంది క్లైమ్ చేశారు. 

ఈ వీడియోని నవంబర్ 24 నాడు ఫేస్బుక్ లో షేర్ చేస్తూ, “మనం క్రికెట్ ప్రపంచ కప్పు ఫైనల్ లో ఓడిపోయాము. అది చాలా బాధనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఒక శుభవార్త. భారత జట్టు ఆస్ట్రేలియాని ఓడించి ‘మహిళా హాకీ ప్రపంచ ఛాంపియన్షిప్’ గెలుచుకుంది,” అని ఒక యూజర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

మరొక యూజర్ ఇదే వీడియో షేర్ చేసి అస్సామీ భాషలో ఇలా రాసుకొచ్చారు, “ఆస్ట్రేలియాని ఓడించి మన మహిళా హాకీ జట్టు 140 కోట్ల మంది తరుపున ప్రతీకారం తీర్చుకుంది.” ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ క్లిప్ షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పు. ఈ వీడియో, ఫొటోలు క్రికెట్ ప్రపంచ కప్పు కన్నా ముందువి. ఆస్ట్రేలియా మీద తాజా విజయానికి సంబంధించినవి కాదు. భారత మహిళా హాకీ జట్టు 4-0తో జపాన్ ని ఓడించి మహిళా ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

వీడియోలో ఏముంది?

వైరల్ వీడియోలో 0:12 దగ్గర “ఝార్ఖండ్ మహిళా ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీ” అనే పదాలు మనకి క్రీడాకారుల వెనుక కనిపిస్తాయి. వీటి ద్వారా నవంబర్ 5, 2023 నాడు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన మహిళా ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు గెలిచింది అని హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన కథనాన్ని మేము తెలుసుకున్నాము. 4-0తో జపాన్ ని ఓడించి భారత జట్టు కప్పు గెలుచుకుంది.

ది ఎకనామిక్ టైమ్స్ వారు నవంబర్ 6 నాడు ఒక యూట్యూబ్ షాట్ వీడియో అప్లోడ్ చేశారు. అందులో క్రీడాకారులు మైదానంలో సంబరాలు చేసుకోవటం మనం చూడవచ్చు. “ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ: జపాన్ ని 4-0 ఓడించాక భారత జట్టు సంబరాలు,” అనేది ఈ వీడియో శీర్షిక. వైరల్ వీడియోలో 0:01-0:19 భాగం ఈ వీడియోనే. 

వైరల్ వీడియో ది ఎకనామిక్ టైమ్స్ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఫేస్బుక్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

దీని ద్వారా భారత్ జట్టు గెలిచింది జపాన్ మీదని, ఆస్ట్రేలియా మీద కాదని స్పష్టం అవుతున్నది. అలాగే క్రికెట్ ప్రపంచ కప్పు ఫైనల్ కన్నా ముందే ఇది జరిగిందనేది కూడా సుస్పష్టం.

ఫొటోల సంగతేంటి?

అలాగే వైరల్ వీడియో చివర్లో ఉన్న రెండు ఫొటోల గురించి వెతికినప్పుడు అవి ఈ మధ్య కాలంలోవి కాదని మాకు తెలిసింది. ఈ ఫొటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇవి ఆగస్ట్ 2021 నాటి ఫొటోలని తెలిసింది.

ఇందులో ఒక ఫొటోని ది గార్డియన్ పత్రిక ఆగస్ట్ 2, 2021 నాడు ప్రచురించింది. ఇందులో ఉన్నది భారత జాతీయ క్రీడాకారులు నవనీత్ గౌర్ మరియు నేహా గోయల్ అని అందులో పేర్కొన్నారు. ఈ ఫొటో శీర్షిక ప్రకారం ఆగస్ట్ 2, 2021 నాడు ఒలంపిక్ క్వార్టర్ ఫైనల్ లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా మీద గెలిచినప్పటిది. ఈ ఫొటోని ఏ ఎఫ్ పి/గెట్టీ ఇమేజస్ కి చెందిన ఛార్లీ ట్రిబాల్యూ తీశారు. భారత జట్టు 1-0తో ఆస్ట్రేలియా జట్టుని ఓడించింది.

ఈ కొలాజ్ లొ ఉన్న మరొక ఫొటో కూడా ఇదే క్రీడలకి సంబంధించినది. ఈ ఫొటో గెట్టీ ఇమేజెస్ లో ఉంది. ఈ ఫొటోని బుదా మెండేస్ తీశారు. ఈ ఫొటో శీర్షిక “ఆగస్ట్ 2, 2021 నాడు జపాన్ లోని టోక్యోలో ఓఐ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మహిళా క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టుకి చెందిన నవనీత్ కౌర్, నేహా నేహా, లల్రెమిసియామి లు తమ బృందంతో కలిసి తమ 1-0 విజయాన్ని ఆస్వాదిస్తుండగా, కరి సోమర్విల్ తమ ఓటమిని వ్యక్తపరుస్తున్నారు,” అని ఉంది. 

ఆగస్ట్ 2021 లో జరిగిన ఒలంపిక్ క్వార్టర్ ఫైనల్స్  ఆస్ట్రేలియా మీద గెలిచిన తరువాత భారత మహిళా హాకీ జట్టు సంబరాలు చేసుకుంటున్న ఫొటో (సౌజన్యం: గెట్టీ ఇమేజెస్/స్క్రీన్ షాట్)

భారత్ ఆస్ట్రేలియా మధ్య తాజాగా జరిగిన మహిళా హాకీ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో మే 2023 నాడు జరిగింది.

తీర్పు

ఆస్ట్రేలియా మీద భారత జట్టు విజయానికి సంబంధించిన వీడియో అని క్లైమ్ చేస్తూ ఈ వైరల్ వీడియోని షేర్ చేశారు. అయితే ఇది జపాన్ మీద భారత దేశం నవంబర్ 6, 2023 నాడు జరిగిన ఆసియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్లో గెలిచిననాటి వీడియో.  ఇందులోని ఫొటోలు ఆగస్ట్ 2021లో ఒలంపిక్ క్రీడలలో ఆస్ట్రేలియా మీద భారత జట్టు గెలిచిననాటివి. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.