హోమ్ సంబంధం లేని వీడియో షేర్ చేసి ఆంధ్రలో వైసీపీ కార్యకర్తలు పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశారని పేర్కొన్నారు

సంబంధం లేని వీడియో షేర్ చేసి ఆంధ్రలో వైసీపీ కార్యకర్తలు పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశారని పేర్కొన్నారు

ద్వారా: రోహిత్ గుత్తా

జూలై 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంబంధం లేని వీడియో షేర్ చేసి ఆంధ్రలో వైసీపీ కార్యకర్తలు పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశారని పేర్కొన్నారు గూడూరు లో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన తెలుగుదేశం సభ్యులు అని కొంతమంది, వైసీపీ సభ్యులు అని మరికొంత మంది క్లైమ్ చేసిన పోస్ట్ ల స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

పోలీసులు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, ముద్దాయి పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి అని, ఆంధ్ర లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని తెలిపారు.

క్లెయిమ్ ఏమిటి?

ఒక 32 సెకెన్ల వీడియో షేర్ చేసి, అందులో పోలీసును కొడుతున్న వ్యక్తి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన గూండా అంటూ పేర్కొన్నారు. మరికొంత మంది దాడి చేసింది తెలుగుదేశం ‘గూండాలు’ అని క్లైమ్ చేశారు. అదే వీడియోలో ఆ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్టు కుడా ఉంది. వై ఎస్ ఆర్ సీ పీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మూడవ అతి పెద్ద పార్టీ.

ఒక ఎక్స్ యూజర్ (పూర్వపు ట్విట్టర్) ఈ వీడియోని షేర్ చేస్తూ, “పోలీసులకు రక్షనే లేదు!!! గూడూరులో పోలీసు కానిస్టేబుల్ పై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న వైసీపీ రౌడీ!!!,” అని పేర్కొన్నారు. గూడూరు తిరుపతి జిల్లాలో ఒక పట్టణం. ఈ పోస్టుకు మా కథనం రాసే సమయానికి 73,000 వ్యూస్ ఉన్నాయి. ఇదే వీడియోని షేర్ చేస్తూ, దాడి చేసింది తెలుగు దేశం పార్టీ ‘గూండాలు’ అని కుడా కొందరు క్లైమ్ చేశారు. తెలుగు దేశం, జన సేన మరియు భారతీయ జనతా పార్టీల కూటమి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ ల  స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ క్లెయిమ్స్ ఏవీ నిజం కాదు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు పోలీసులు చెప్పిన దాని ప్రకారం, వీడియోలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అతను పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి.

వాస్తవం ఏమిటి?

ఈ విషయం గురించిన వార్త కథనాల కోసం మేము వెతికాము. ఈ వైరల్ వీడియోకి సంబంధించి తెలుగు న్యూస్ ఛానెల్ అయిన 10 టీవీ  (ఆర్కైవ్ ఇక్కడ) ప్రచురించిన కథనం మాకు లభించింది. ఆ కథనం ప్రకారం, గూడూరు లో ఇద్దరు పోలిసులు  ఒక దుకాణంకి వచ్చినప్పుడు, వెనుకనుంచి మరో వ్యక్తి ఒక దుంగతో దాడి చేశాడు. ఈ వ్యక్తిని పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి గాను, ఇతని పేరు కలిండి అని ఇందులో ఉంది.

తెలుగు వార్తా పత్రిక ఈనాడు  (ఆర్కైవ్ ఇక్కడ) జూలై 18, 2024 నాటి కథనంలో గాయపడిన పోలిసు ఫోటోని ప్రచురించింది, అతని పేరు స్వామి దాస్ గా పేర్కొని, అతను గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అని తెలియజేసింది. ఇదే సమాచారాన్ని ఆంగ్ల వార్తా పత్రిక అయిన డెక్కన్ క్రానికల్  (ఆర్కైవ్ ఇక్కడ) కుడా తమ కథనంలో రాసింది, పైగా దాడి చేసిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ కి చెందిన 24 సంవత్సరాల లల్తు కలిండి గా పేర్కొంది.

గాయపడిన కానిస్టేబుల్ పని చేస్తున్నగూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ మాట్లాడుతూ, ఈ ఘటన గూడూరు లో జరిగిందని, కానిస్టేబుల్ స్వామి దాస్ తమ స్టేషన్ లోనే పని చేస్తున్నారని నిర్ధారించారు. ఇంతకు మునుపు వారి ఆమధ్య పరిచయం లేదని, దాడి చేసిన వ్యక్తి పేరు లల్తు కలిండి అని, తను పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి అని, అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్టుగా తెలియజేసారు.

గూడూరు మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ వి శ్రీ హరి మాతో మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తి వై ఎస్ ఆర్ సి పి కి కానీ తెలుగుదేశానికి కానీ చెందిన వ్యక్తి కాదని, ఆ క్లెయిమ్ ఫేక్ అని నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టుగా తెలిపారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ కేసు విషయమై ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 87/2024 ని సంపాదించింది. దాని ప్రకారం, దాడి చేసిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ కి చెందిన లల్తు కలిండి అని, ఈ దాడి జులై 18, 2024 నాడు ఒక జ్యూస్ షాప్ వద్ద జరిగినట్టుగా ఇందులో ఉంది. ఆ వ్యక్తి పై  హత్యాయత్నం మరియు ప్రభుత్వ అధికారి పై దాడి చేసినందుకు గాను కేసు నమోదు చేయటం జరిగింది.

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని గూడూరు లో పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన వీడియోని షేర్ చేసి, ఆలా దాడి చేసింది తెలుగుదేశం మరియు వై ఎస్ ఆర్ సి పి వ్యక్తులు అన్నట్టుగా తప్పుగా షేర్ చేస్తున్నారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.