ద్వారా: మొహమ్మద్ సల్మాన్
ఆగస్టు 20 2024
2021 లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళా లో నాగ సాధువులు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నప్పటి వీడియో ఇది.
క్లైమ్ ఏంటి?
బంగ్లాదేశ్ లో హిందువుల కోసం నాగ సాధువులు కదులుతున్నారు అని క్లైమ్ చేస్తూ ఒక వీడియో సామాజిక మాధ్యమలలో వైరల్ అయ్యింది. “మన నాగ సాధువులు బంగ్లాదేశ్ లోని హిందువులకి మద్దతుగా వచ్చారు. బంగ్లాదేశ్ ని అణిచివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు,” అనే శీర్షికతో ఈ వీడియోని షేర్ చేశారు.
ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియోకి ఈ కథనం రాసే సమయానికి 95000 వ్యూస్, 2200 రీపోస్ట్స్, 7500 లైక్స్ ఉన్నాయి. ఇదే వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో కూడా సర్కులేట్ అవుతున్నది.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
బంగ్లాదేశ్ లో నెలకొన్న అశాంతి నేపధ్యంలో అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనే కథనాలు వస్తున్న నేపధ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది.
అయితే, ఇది 2021 లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళా కి సంబంధించిన వీడియో. బంగ్లాదేశ్ కి దీనికి సంబంధం లేదు.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే మార్చ్ 13, 2021 నాటి యూట్యూబ్ వీడియో ఒకటి మాకు లభించింది (ఆర్కైవ్ ఇక్కడ). ఈ వీడియో శీర్షిక, ‘First Sahi Snan Naga Baba 2021 Mahakumbh Haridwar’ అని ఉంది. ‘Naveen Binjola’ అనే అకౌంట్ ఈ వీడియో ని పోస్ట్ చేసింది. దీని ద్వారా వైరల్ వీడియో 3 సంవత్సరాల నాటిది అని అర్థం అవుతుంది.
వైరల్ వీడియో, 2021 వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్)
వీడియో లో కనిపించిన దుకాణాలని మేము గుర్తించాము. ‘ఈశ్వర్ ఖాదీ కంబళ్ భండార్’, ‘శ్రీ నీలకంఠ్ ఖాదీ భండార్’ ఈ దుకాణాల పేర్లు. హరిద్వార్ లోని అప్పర్ రోడ్ మీద ఇవి ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా వాటిని మేము ధృవీకరించాము.
వైరల్ వీడియో లో ఉన్న దుకాణాల ని గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించాము (సౌజన్యం: గూగుల్ మ్యాప్స్)
ఎన్ డీ టీ వీ కథనం ప్రకారం, 2021 హరిద్వార్ కుంభమేళా లో మొదటి ‘రాజ స్నానం’ (Royal Bath) మార్చ్ 11, 2021 నాడు జరిగింది. ఈ సమయంలో, కేవలం సాధువులు, నాగ సాధువులతో సహా, మాత్రమే గంగా నది లో స్నానం చేస్తారు.
మార్చ్ 21 నాడు ఈ వీడియో నే ఫేస్బుక్, యూట్యూబ్ లలో కూడా అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. నాగ సాధువులు రాజ స్నానం కోసం హరిద్వార్ లోని హర్ కి పౌఢి కి వెళుతున్న వీడియో ఇది. ఈ వీడియో ని ఇక్కడ (ఆర్కైవ్ ఇక్కడ ), ఇక్కడ (ఆర్కైవ్ ఇక్కడ ), మరియు ఇక్కడ (ఆర్కైవ్ ఇక్కడ) చూడవచ్చు.
ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడు జరుగుతున్న నేపధ్యంలో కొంత మండి సాధువులు ఈ విషయం మీద చర్యలు తీసుకోమని భారత ప్రభుత్వాన్ని కోరారు అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి.
బంగ్లాదేశ్ లో అశాంతి
బంగ్లాదేశ్ లో నెలల తరబడి నెలకొన్న అశాంతి కారణంగా 650 మంది వరకు చనిపోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. రిజర్వేషన్ లకి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది.
హిందువుల మీద దాడులు జరిగిన నేపధ్యంలో భారతదేశం ఈ విషయం మీద ఆరా తీయగా ఆగస్ట్ 2024 లో షేక్ హసీనా నుండి పగ్గాలు చేపట్టిన మొహమ్మద్ యూనస్ అటువంటివి జరగకుండా చూస్తామని తెలియచేశారు.
తీర్పు
2021 లో హరిద్వార్ లో నాగ సాధువుల వీడియో ని తప్పుగా బంగ్లాదేశ్ లో హిందువులకి మద్దతుగా ర్యాలీ చేస్తున్న నాగ సాధువులు అని క్లైమ్ చేశారు.
(అనువాదం - గుత్తా రోహిత్)