ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 15 2024
హైదరాబాద్ కి చెందిన పాత వీడియోని- బహుశా 2023 మిలాద్-ఉన్-నబీ సంబరాలు నాటిది అయ్యుండొచ్చు- ‘పాకిస్థాన్ జెండాలు’ ఎగరేస్తున్న వీడియోగా షేర్ చేశారు.
క్లైమ్ ఏంటి?
ఒక రోడ్డు మీద ట్రాఫిక్ మధ్యలో పచ్చని జెండాలమి జనాలు ఎగరేస్తున్న 35 సెకన్ల వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాలు ఎగరేశారని క్లైమ్ చేశారు.
“హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్నాయి. గొప్ప ప్రజాస్వామ్యం మనది. దేని గురించి ఏమీ పట్టని వాడిగా ఉన్నందుకు బాగా గర్వంగా ఉంది,” అని ఒక యూజర్ ఈ వీడియో షేర్ చేసి రాసుకొచ్చారు. ఇంకొకరు ఏమో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందాకా ఇలా జరుగుతున్నది అనే అర్థం వచ్చేటట్టు రాసుకొచ్చారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ సోలంకి ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ (ఇప్పుడు తొలగించేశారు) ని ఆధారంగా చేసుకుని స్థానిక వార్తా చానల్ ఆసియా నెట్ కూడా ఇదే వార్తని రిపోర్ట్ చేసింది. తెలంగాణలో పాకిస్థాన్ జెండాలు ఎగరేస్తున్నారని శ్రీనివాస్ సోలంకి ఆరోపించారు.
ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
అయితే ఈ క్లైమ్ అబద్ధం అని మా పరిశోధనలో తేలింది. ఇది పాత వీడియో. అలాగే వీడియోలో ఉన్న జెండా పాకిస్థాన్ జెండా కాదు. ఇది ఇస్లామిక్ జెండా.
మేము ఏమి తెలుసుకున్నాము?
ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే హైదరాబాద్ పోలీసులు ఈ వీడియోని షేర్ చేసి, ఇది క్రితం సంవత్సరం నాటి మిలాద్-ఉన్-నబీ సంబరాలు నాటిది అని తెలిపారు. “ఇది క్రితం సంవత్సరం మిలాద్-ఉన్-నబీ నాటిది. దీని గురించి కేసు కూడా నమోదు చేశాము. కాబట్టి తప్పుడు క్లైమ్ లు చేయవద్దు. లేదంటే కనుక మీ మీద కేసు నమోదు చేయవలసి వస్తుంది”, అని ఒక యూజర్ పోస్ట్ కి రిప్లై ఇచ్చారు.
మిలాద్-ఉన్-నబీ ముస్లిం మతస్థులు జరుపుకునే పండుగ. ప్రాఫెట్ మొహమ్మద్ ఈ రోజునే పుట్టారని నమ్ముతారు.
దీని గురించి మరింత వెతుకగా, ఇదే వీడియోని హైదరాబాద్ డెక్కన్ న్యూస్ అనే స్థానిక చానల్ తమ యూట్యూబ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిందని తెలుసుకున్నాము. ఒక బృందం మిలాద్-ఉన్-నబీ రోజున బైక్ ర్యాలీ నిర్వహించింది అని, దాని కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది అని హిందీలో శీర్షిక ఉంది. ఈ వీడియోని అక్టోబర్ 2, 2023 నాడు అప్లోడ్ చేశారు. ఈ పండుగ సెప్టెంబర్ 27, 28 నాడు వచ్చింది.
ముఖ్యంగా, వీడియోలో ఉన్న జెండా పాకిస్థాన్ జెండా కాదు. అది ఇస్లామిక్ జెండా. రెండిటి మధ్య ముఖ్య తేడా ఏంటి అంటే జెండాకి ఎడమ వైపు ఉన్న తెల్లని ప్రాంతం.
వైరల్ వీడియోలో ఉన్న జెండా, పాకిస్థాన్ జెండా మధ్య తేడాలు (సౌజన్యం: ఎక్స్/అన్ స్ప్ల్ ష్/స్క్రీన్ షాట్స్)
ఇక్కడ చెప్పవలసిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ వీడియో అక్టోబర్ 2023 నుండి ఆన్లైన్ లో ఉంది. అప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా అధికారం చేపట్టలేదు. అప్పుడు అధికారంలో ఉంది భారత రాష్ట్ర సమితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 2023లో.
తీర్పు
హైదబారాద్ కి చెందిన పాత వీడియోని- బహుశా 2023లో మిలాద్-ఉన్-నబీ సంబరాలప్పటిది అయ్యుండొచ్చు- నగరంలో పాకిస్థాన్ జెండాలు ఎగరవేస్తున్న వీడియో అని క్లైమ్ చేశారు. వీడియోలో ఉంది ఇస్లామిక్ జెండా. ఈ వీడియో వచ్చేనాటికి కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి రాలేదు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)