హోమ్ టి డి పి మరియి జన సేన పార్టీ కౌన్సిలర్ లకు మధ్య గొడవ ల పాత వీడియో వైరల్ అయ్యింది

టి డి పి మరియి జన సేన పార్టీ కౌన్సిలర్ లకు మధ్య గొడవ ల పాత వీడియో వైరల్ అయ్యింది

ద్వారా: రాజేశ్వరి పరస

అక్టోబర్ 11 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
టి డి పి మరియి జన సేన పార్టీ కౌన్సిలర్ లకు మధ్య గొడవ ల పాత వీడియో వైరల్ అయ్యింది సామాజిక మాధ్యమాలలో వస్తున్న క్లైమ్స్ (సౌజన్యం : ఫేస్బుక్/స్క్రీన్షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో 2016 లోనిది, గొడవ పడిన ఇద్దరు టి డి పి కి సంబందించిన వారే.


క్లెయిమ్ ఏమిటి?

ది హిందూ లో వచ్చిన కథనం ప్రకారం, నటుడు మరియు రాజకీయవేత్త అయిన జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 14వ తేదీన, 2023లో వారు టి డి పి తో కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తాం అని ప్రకటించారు.

ఈ సంధర్భంలో సామాజిక మాధ్యమాలలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోని టి డి పి కి మరియు జనసేనకి పార్టీ మధ్య గొడవ లాగా ప్రచారం చేశారు. ఎక్స్ (పూర్వపు ట్విటర్) లో ఈ వీడియోని షేర్ చేస్తూ, ఇలా రాశారు, “జనసేన పార్టీ కౌన్సిలర్ని బట్టలు చింపి కొట్టిన టీడీపీ కౌన్సెలర్...పాపం జెండా కూలీలు.” (ఆర్కైవ్ ఇక్కడ). ఇలాంటి రాతలతోనే మరి కొందరు కూడా సామాజిక మాధ్యమలలో పోస్ట్ చేశారు, వాటి ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వస్తున్న క్లైమ్స్ (సౌజన్యం : ఫేస్బుక్/స్క్రీన్షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయినప్పటికీ ఇది అబద్దం, ఎందుకంటే ఇది 2016 లో వీడియో, ఇందులో ఎవరు జనసేన పార్టీ కి సంబందించిన వారు లేరు. 

వాస్తవం ఏమిటి ?

ఈ వీడియో వైరల్ అవుతున్న తరుణం లో కొంతమంది యూసర్లు ఈ వీడియో 2016ది అని రాసుకొచ్చారు. దాని ఆధారంగా ఆంధ్ర లో రాజకీయనాయకుల మధ్య ఇలాంటి వివాదం ఏమైనా జరిగిందా అని కి వర్డ్ సెర్చ్ ద్వారా వెతికాము. మాకు, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు రాసిన కథనం ఒకటి లభించింది. ఆ రిపోర్ట్, ఫిబ్రవరి 29, 2016 లో ప్రచురించారు, దీనిలో, ఇద్దరు టి డి పి కౌన్సెలర్లు గుమ్మడి రమేష్ మరియు పసుపులేటి త్రిమూర్తులు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సమయంలో పుస్తకం లో మినట్స్ రాసే విషయం లో గొడవపడినట్టు రాసి ఉంది. 

ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో న్యూస్ ఏజెన్సీ ఏ ఎన్ ఐ వారు వారి ఎక్స్ అకౌంటులో ఫిబ్రవరి 29, 2016 నాడు పోస్ట్ చేసిన వీడియో ఒకటి, ఈ శీర్షికతో ఉంది, “గుంటూర్ జిల్లా లోని తెనాలి మున్సిపాలిటీ లో ఇద్దరు తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ మధ్య గొడవ చూడండి.” 

ఈ వీడియో మరింత నిడివి తో స్పష్టంగా ఉంది, రెండు వీడియోలలోనూ మనం ఒక పచ్చ రంగు చొక్కా మరియు తెలుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తులు గొడవ పడటం మనం చూడవచ్చు. పైగా వెనకాల ఒక మెరుణ్ రంగు కర్టెయిన్ మరియు చీర కట్టుకున్న ఒక స్త్రీ ని మనం చూడవచ్చు. 


వైరల్ వీడియో కి 2016 లో ఉన్న వీడియో కి పోలిక (సౌజన్యం: ఎక్స్/ఏ ఎన్ ఐ/ స్క్రీన్ షాట్)


మార్చి 1, 2016 నాడు ప్రచురించిన ది హిందూ కథనం లో కూడా ఈ విషయం గురించి రాశారు. ఈ కథనం ప్రకారం, కౌన్సిలర్ పి త్రిమూర్తులు షర్ట్ కూడా చిరిగింది అని రాసుకొచ్చారు. 2016 లో టి డి పి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న పార్టీ.

ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల్లో ఒకరైన మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ను లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. ఈయన వీడియో లో పచ్చరంగు చొక్కా వేసుకుని కనపడతారు. ఆయన ఈ వీడియో 2016 దే అని, తెనాలి లో జరిగింది అని కూడా స్పష్టం చేశారు. వారు ఇద్దరు టి డి పి కి చెందిన వారేనని, అప్పట్లో కౌన్సిలర్లని, ఏదో ఆవేశం లో అలా గొడవ జరిగిందని తెలిపార. పైగా వారిరువురికి జనసేన పార్టీ తో సంబంధం లేదని, ఇప్పటికీ టి డి పి పార్టీ కి చెందిన వారేనని తెలిపారు.  

తీర్పు: 

2016 కు సంభందించిన పాత వీడియో కొత్తగా పొత్తు కుదుర్చుకున్న టి డి పి -జనసేన వారి మధ్య వివాదం లాగా ప్రచారం అయ్యింది. వీడియో లో కనిపించే, ఇద్దరు కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీ వారే. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.